karimabad
-
నువ్వు ఎవడివిరా అంటూ విచక్షణా రహితంగా పొడిచి..
ఖిలా వరంగల్: కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్లో శనివారం అర్ధరాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. గంజాయి మత్తులో ఓ యువకుడు స్నేహితులతో కలిసి ముగ్గురు యువకులపై దాడి చేశాడు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. మరో యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన వనం సుధాకర్‌కు ఇద్దరు కుమారులు కార్తీక్, వనం రాకేశ్(26) ఉన్నారు. రాకేశ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. శనివారం స్కూల్‌కు వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం స్నేహితులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్లో ఉన్న మరుపల్లి నిఖిల్ బేకరికి వెళ్లాడు. అక్కడ నిఖిల్, శ్రీనాథ్, వంశీలతో రాకేశ్ మాట్లాడుతుండగా కడిపికొండ నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు నిఖిల్ బేకరి ఎదుట మూత్ర విసర్జన చేశారు. ఈక్రమంలో నిఖిల్, రాకేశ్ మూత్రవిసర్జన చేసిన యువకులను నిలదీశారు. దీంతో నువ్వు ఎవడివిరా అంటూ షాపు నిర్వాహకుడిని ప్రశ్నిస్తూ బైక్‌పై వచ్చిన వారు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఇంతలో బైక్‌పై వచ్చిన గాడుదల రాజేశ్‌తోపాటు మరో వ్యక్తి ఫోన్ చేసి బంటి, యోగి భాస్కర్‌ను పిలుపించుకున్నారు. ఓ పక్క ఇరువురు మాట్లాడుతుండగానే గాడుదల రాజేశ్ తన వద్ద ఉన్న కత్తి తీసి రాకేశ్‌ను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈక్రమంలో అడ్డుకోబోయిన నిఖిల్, శివపై దాడి చేశాడు. దీంతో నిఖిల్ కుప్పకూలాడు. శివ పారిపోతుండగా వెంటపడి కత్తితో దాడి చేశారు. అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత రాజేశ్ కత్తి చూపిస్తూ అడ్డువస్తే అందరికీ ఇదే గతి పడుతోందని హెచ్చరిస్తూ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. శివ మిల్స్‌కాలనీ పోలీసులతో పాటు గాయపడిన నిఖిల్ తల్లిదండ్రులు, రాకేశ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం) రాకేశ్, నిఖిల్‌ను 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాకేశ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నిఖిల్‌ను ఎమర్జెనీ వార్డుకు తరలించారు. మృతుడి సోదరుడు వనం కార్తీక్ ఆదివారం మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్ తెలిపారు. కాగా, స్నేహితుల వద్దకు వెళ్లకుంటే బతికేవాడి బిడ్డా అంటూ వనం రాకేశ్ మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పాతకక్షలే కారణమా..? రాకేశ్ హత్య అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇరువురు యువకుల మధ్య పాతకక్షలు ఉన్నాయా..?, క్షణికావేశంలో కత్తితో దాడి చేశారా..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. కాగా, ఇరువురి మధ్య పాతకక్షలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసు కస్టడీలో నిందితుడు యువకుడి హత్య కేసుతో సంబంధమున్న ఇరువురిని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన నిందితుడు శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌కు చెందిన గాడుదల రాజేశ్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, అతడితోపాటు మరో ఐదుగురు దాడిలో పాల్గొన్నట్లు విశ్వనీయంగా తెలిసింది. మిగతా వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు సమాచారం. -
భూమి కోసం ఘర్షణ
సాక్షి, కరీమాబాద్ : వరంగల్ 21వ డివిజన్ కరీమాబా ద్ నానమియాతోట వద్ద వివాదాస్పద భూమి విషయమై మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. బాధిత కుటుంబాలు, స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానమియాతోటలోని సర్వేనెంబర్ 340, 341 లోని సుమారు ఎకరం భూమి తనదేనంటూ కరీమాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు, రియల్టర్ వొగిలిశెట్టి అనిల్‌కుమార్‌తో పాటు ఆయన అనుచరులు బాలకొంరెల్లి, లింగమూర్తి, సాధిక్, ఖాజా, రబ్బాని, రాజు రాతి ఖనీలు పాతేందుకు మంగళవారం ప్రయత్నించారు. దీంతో స్థానికంగా ఉన్న గుడిసెవాసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మద్య గొడవ జరగడంతో అనిల్‌కుమార్‌తో పాటు అతని అనుచరులు.. గుడిసెవాసులైన ఎండీ హసన్, ఎండీ ఆలం, ఎండీ అబ్బు, గౌసియాబేగం, ఎండీ బాబాపై పారతో దాడిచేయగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఎండీ హసన్ తీవ్రంగా గాయపడడంతో అతనిని గార్డియన్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మిల్స్‌కాలనీ పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు గుడిసెవాసుల నాయకుడు ముక్కెర రామస్వామి తెలిపారు. కాందీశీకుల భూమి.. నానామియా తోటలోని 340, 341 సర్వే నం బర్లలోని భూమి కాందీశీకులదని, ఈ భూమి కోర్టు కేసులో ఉండగా ఇలా దాడి చేసి గాయపరిచారని రామస్వామి వివరించారు. గాయపడిన వారిని సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, నాయకురాలు రత్నమాల పరామర్శించా రు. అలాగే మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ పూర్తి వివరాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా తమ కనీలు పాతేందుకు వెళ్తే అడ్డుకోవడంతో పాటు బాలకొంరెల్లి, సాదిక్, లింగమూర్తి, ఖా జాపాష, రబ్బాని నీలపై దాడిచేసి గాయపరిచినట్లు అనిల్‌కుమార్ తెలిపారు. ఇలాంటి సమస్య వస్తుందనే ఈ నెల 25న మిల్స్‌కాలనీ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. భూమి ఎవరిదో తేల్చాలని తహసీల్దార్‌కు సూచించా.. వివాదాస్పదంగా మారిన కరీమాబాద్‌లోని నానామియాతోట వద్ద భూమి ఎవరిదో తేల్చాలని ఖిలావరంగల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్‌కు సూచించాను. అప్పటివరకు ఎవరూ ఎలాంటి గొడవలకు దిగొద్దు. ఏది ఉన్నా సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి. – నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే -
ఇంజక్షన్ వికటించి బాబు మృతి
సాక్షి, కరీమాబాద్ (వరంగల్): నగరంలోని రంగశాయిపేటలోని ఓ పిల్లల ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి ఏడు నెలల బాబు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన వర్కాల మమత, రత్నాకర్ దంపతులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్న తమ ఏడు నెలల బాబు (రుత్విక్)ను తీసుకుని రంగశాయిపేట కార్తీకేయ పిల్లల దవాఖానకు వచ్చారు. అక్కడ డాక్టర్ దయానందసాగర్ ఉదయం 11.30 ఇంజక్షన్ వేసి పంపించారు. అయితే కొంతసేపటి తర్వాత బాబు రుత్విక్ తీవ్ర అస్వస్తతకు గురికావడంతో తిరిగి ఆస్పత్రి వరకు తీసుకుకావడంలోపే మృతి చెందాడు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడంటూ బాబు తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని బాబు మృత దేహాన్ని ఎంజీఎంకు తరలించారు. అలాగే డాక్టర్ దయానందసాగర్‌ను మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో నా తప్పు లేదు.. ఈ నెల 21 జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఏడు నెలల బాబును తీసుకుని నా వద్దకు వచ్చారు. నేను ఆ రోజు కావాల్సిన సిరప్ మందులు రాసి ఇచ్చి పంపించారు. తగ్గక పోతే మళ్లీ రమ్మన్నాను. వారు గురువారం ఉదయం 11.30 గంటలకు రాగానే ఓఆర్ఎస్తో పాటు అమికాషన్ ఇంజక్షన్ ఇచ్చి పంపిచాను. వెళ్లిపోయిన వారు మళ్లీ మధ్యాహ్నం 1.30 గంటలకు వచ్చారు. అప్పటికే బాబు మృతి చెందాడు. ఇందులో నా తప్పేమి లేదు. నేను సరిగానే ట్రీట్మెంట్ చేశా. – దయానందసాగర్, వైద్యుడు -
బస్సులోనే డ్రైవర్‌కు రాఖీ కట్టిన చెల్లెలు
సాక్షి, కరీమాబాద్(కరీంనగర్) : హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్న గట్టు కృష్ణవేణి తన అన్నయ్యకు రాఖీ కట్టుందుకు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఉర్సుకు గురువారం వచ్చింది. అయితే ఆమె సోదరుడు ఆర్టీసీ లోకల్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గడ్డం జితేందర్ అప్పటికే డ్యూటికీ వెళ్లాడు. ఈ క్రమంలో కృష్ణవేణి అన్నయ్యకు ఫోన్‌చేయగా.. వరంగల్ బస్టాడ్ ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో ఆమె అక్కడికే వెళ్లి బస్సులోనే రాఖీ కట్టి తన ఆనందాన్ని పంచుకుంది. -
నాణ్యత లేని మద్యాన్న భోజనం
కరీమాబాద్: విద్యార్ధులకు అందించే మద్యాన్న భోజనంలో నాణ్యత లేదని వరంగల్ గ్రేటర్ కాంగ్రేస్ వర్కింగ్ అధ్యక్షులు రాజనాల శ్రీహరి అన్నారు. నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ప్రాధమిక, ఉన్నత పాఠశాలలోని మద్యాన్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్ధులకు ఎలాంటి ఆహార పదార్ధాలు పెడుతున్నారో పరీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మద్యాన్న భోజన పతకాన్ని అనుభవంలేని ఏజంట్లకు ఇవ్వడంతో పాటు వారి నుంచి వేరొకరికి చేతులు మారుతుండంతో విద్యార్ధులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గూడూరు మల్లేషం, కోటేశ్వర్రావు, వీరాచారి, రఘు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శివ, రాజేందర్, అమరలింగం తదితరులు పాల్గొన్నారు. -
చేతులెట్ల వచ్చాయో..
అనుమానాస్పద స్థితిలో రెండు నెలల పసికందు మృతి సంప్‌లో వేసి చంపారంటున్న కుటుంబ సభ్యులు కరీమాబాద్ కోయవాడలో దారుణం కరీమాబాద్ : ఈ భూమిపైకి వచ్చి ఆ పసిగు డ్డుకు ఇంకా రెండు నెలలైనా నిండలేదు. అప్పుడే ఎవరికో కన్నుకుట్టింది. పాలిచ్చిన తల్లి స్నానానికి వెళ్లొచ్చేసరికి ఆ పసికందు నీటి సంప్‌లో శవమై తేలాడు. ఈ సంఘట న నగరంలోని కరీమాబాద్ కోయవాడలో శనివారం మధ్యాహ్నం జరిగింది. పసికందు సందీప్(2నెలలు) తల్లి సిరిగిరి యశోద, నాన్నమ్మ దుర్గమ్మతోపాటు మిల్స్‌కాలనీ ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. కరీమాబాద్ కోయవాడలోని సిరిగిరి యశో ద, సాయి దంపతులకు రెండు నెలల పసికందు సందీప్ ఉన్నాడు. ఆ శిశువును ఇంట్లో పడుకోబెట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో తల్లి యశోద స్నానానికని బాత్రూమ్కు వెళ్లింది. ఆమె తిరిగి ఇం ట్లోకి వచ్చేసరికి పసికందు కనిపిం చలేదు. ఇంట్లో, బయట వెతికారు. స్థానికులకు చెప్పారు. అయినా సందీప్ ఆచూకీ లేకపోవడంతో ఇంటి వె నకాల ఉన్న వాటర్ సంప్‌లో గమనించారు. అం దులో శిశువు కనిపించడంతో బయటికి తీసి చూడగా అప్పటికే మృతిచెందాడు. దీం తో శిశువు తల్లి, నానమ్మ బోరున విల పిం చారు. తాను బాత్రూమ్కు వెళ్లిన సమయం లో బాబును ఎవరో కావాలని ఇంట్లో నుం చి తీసుకెళ్లి నీళ్ల సంప్‌లో వేసి చంపారని బా లుడి తల్లి యశోద విలపిస్తూ చెప్పింది. ఈ మేరకు మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. అ లాగే సంఘటన స్థలాన్ని ఏసీపీ సురేం ద్రనా థ్ సందర్శించి జరిగిన సంఘటనపై వి వరాలు అడిగి తెలుసుకున్నారు. పసికం దు తండ్రి సాయి తమిళనాడులో నాటు వైద్యం చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా కోయవాడలో పసికందు మృతి స్థానికంగా సంచలనం రేపింది. ఇంత దారుణానికి ఒడిగట్టినవారిని గుర్తించి శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. -
వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక..
కరీమాబాద్ (వరంగల్) : వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక ఓ ఆటో డ్రైవర్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం జరిగిన అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో గురువారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పిట్ట వినోద్(25) కామునిపేట ప్రాంతానికి చెందిన అంగన్వాడి ఆయా బత్తిని స్వరూప వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వినోద్ సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించలేకపోవడంతో.. స్వరూప తన మనుషులతో వినోద్ ఇంటి ముందు గొడవ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వినోద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
అంగన్వాడీ కేంద్రంలో పేలిన ప్రెషర్ కుక్కర్
కరీమాబాద్ (వరంగల్) : వరంగల్ నగరం కరీమాబాద్ కాశికుంటలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ప్రెషర్ కుక్కర్ పేలి ఆయాతోపాటు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. స్థానిక 64వ అంగన్ వాడీ కేంద్రంలో రోజు మాదిరిగానే పిల్లలకు భోజనం తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయాగా పనిచేస్తున్న అరుణ ప్రెషర్ కుక్కర్లో పప్పు, పాలకూర వేసి స్టవ్ మీద పెట్టింది. కాసేపటి తర్వాత ఉడికిందో లేదో తెలుసుకునేందుకు కుక్కర్ విజిల్‌ను కొద్దిగా పైకి లేపింది. కుక్కర్ మూత అకస్మాత్తుగా పైకెగిరిపోవడంతో అందులోని వేడి వేడి పప్పు, పాలకూర అక్కడే ఉన్న పిల్లలు శివరాత్రి రిషి(5), శివరాత్రి శ్రావణి(5)లతో పాటు ఆయా అరుణలపై పడింది. గాయాలపాలైన ఆయాను, పిల్లలను 108 లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
పిలిస్తే వస్తాడు.. పట్టుకుంటే వదలడు..
ఎవరికైనా పామును చూస్తే భయమేస్తుంది.. కానీ పైడిపల్లికి చెందని యూకూబ్‌కు మాత్రం పాములు పట్టుకోవడమంటే ఉత్సాహం. పదిహేనేళ్లుగా వందల సంఖ్యల పాములను పట్టుకోవడంతో గుడిసె యూకూబ్ పేరు కాస్తా పాముల యూకూబ్గా స్థిరపడింది. ఏటూరునాగారంలోని తుపాకులగూడెంకు చెందిన రాములు వద్ద పాములు పట్టుకునే విద్య నేర్చుకున్న ఆయన ఎవరి ఇంట్లోనైనా పాము కనిపించిందన్న సమాచారం తెలిస్తే వెంటనే వెళ్లి పట్టుకుని దూరంగా వదిలేస్తాడు. ఈ మేరకు ఎవరైనా సరే పాము ఉన్న సమాచారాన్ని తన నంబర్‌కు 90002 86776 తెలియజేస్తే వస్తానని యూకూబ్ చెబుతున్నాడు. - కరీమాబాద్ -
అయ్యో దేవుడా!
ఎంత పని చేశావు.. {పేమజంట ఆత్మహత్య రైలు కింద పడి మృత్యువాత ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులే.. ఖమ్మం జిల్లాలో ఘటన కరీమాబాద్‌లో విషాదం ‘‘అయ్యో దేవుడా! ఎంత పని చేశావు.. ఇరవై ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. బాబు, పాప పుట్టగానే సంతోషించాం.. వారే జీవితం అనుకుున్నాం.. బాగా చదువుకుని.. ప్రయోజకులు అవుతారనుకున్నాం.. ఇలా అర్ధంతరంగా చనిపోతారనుకోలేదు.. ప్రేమ రూపంలో మృత్యువు వస్తుందను కోలేదు.. మాకు కడుపుకోత మిగిల్చి.. దుఖఃసాగరంలో నెట్టారు..!’’ అంటూ ఖమ్మం జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు హిరణ్మరుు, సారుుక్రిష్ణ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలచి వేసింది.. కరీమాబాద్ : వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన మాటేటి హిరణ్మయి(19), గుడిమెల్ల సాయిక్రిష్ణ(20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు హసన్‌పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు హైస్కూల్ వరకు కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఇష్టపడ్డారు. ఆ తర్వాత మళ్లీ బీటెక్‌లో ఒకే గ్రూపు, ఒకే క్లాస్ కావడంతో ఆ ప్రేమ అలాగే కొనసాగించారు. హిరణ్మయి తండ్రి రవీందర్ వరంగల్ మున్సిపల్లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా, తల్లి నీరజ గృహిణి. ఇం కా హిరణ్మయికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అక్క శ్వేత, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అన్నయ్య రాకేష్ ఉన్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న గుడిమెల్ల సాయిక్రిష్ణ ఒకే ఒక్క కుమారుడు కాగా తన తండ్రి ప్రభాకర్ వేరే పెళ్లి చేసుకోవడంతో తల్లి విమలతోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లి హిరణ్మయి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యు లు వెతికినా ఫలితం లేకపోరుుంది. బుధవా రం ఉదయం ఖమ్మం జీఆర్పీ పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డ హిరణ్మయి తండ్రి రవీందర్‌కు, సాయిక్రిష్ణ తల్లి విమలకు ఫోన్ చేశారు. హిరణ్మయి, సాయిక్రిష్ణలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారనే తెలిపారు. దీం తో ఇరువురి తల్లిదండ్రులు ఒక్కసారి కుప్పకూలారు. చాలా ఏళ్లుగా సాయిక్రిష్ణ, హిరణ్మ యి ప్రేమించుకుంటుండడం.. వారి ప్రేమను తల్లిదండ్రులుఒప్పుకోకపోవడమో..మరేదైనా కారణంతోనో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు, మిత్రులు తెలిపారు. కాగా, ప్రేమికుల మృతితో కరీమాబాద్‌లో విషాద చాయలు అలుముకున్నారుు. -
ఉర్సుగుట్టపై తవ్వకాలు
కరీమాబాద్, న్యూస్‌లైన్ : నగరంలోని రంగలీల మైదానం వద్ద ఉన్న ఉర్సుగుట్టపై గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. గుప్త నిధులకోసమే తవ్వకాలు జరిపినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సమాచారం అందుకున్న ఉర్సు, కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు ఉర్సుగుట్టను సందర్శించారు. గుట్టపై ఉన్న గోదాసహిత రంగనాథస్వామి వారి ఆలయం వద్ద ఉన్న కోనేరు నుంచి ఆలయ గర్భగుడికి వెళ్లే దారిలో కందకం తవ్వినట్లు వారు పేర్కొన్నారు. గుప్తనిధుల కోసమే ఇలా చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ఆలయ అభివృద్ధిలో భాగంగా తాము కోనేరుతోపాటు దాని పక్కన ఉన్న ఖాళీ స్థలంలోని మట్టిని తీసేసే పని చేశామని, గుప్త నిధుల కోసం కాదని ఆలయ కమిటీ పేర్కొంది. దేవాలయూనికి భక్తులు వేళ్లేందుకు సరైన మెట్లు లేవని, అందుకే తాము మెట్లు నిర్మించే పనిలో ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఏదేమైనా పురావస్తుశాఖ, ఎండోమెంట్ అధికారులు చారిత్రక గోదాసహిత రంగనాయకులు ఆలయాన్ని, రక్షించి అభివృద్ధి చేయాలని ప్రజలు, భక్తుల కోరుతున్నారు.