చేతులెట్ల వచ్చాయో.. | how hands are came.. | Sakshi
Sakshi News home page

చేతులెట్ల వచ్చాయో..

Published Sun, Jul 31 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

చేతులెట్ల వచ్చాయో..

చేతులెట్ల వచ్చాయో..

  • అనుమానాస్పద స్థితిలో రెండు నెలల పసికందు మృతి 
  • సంప్‌లో వేసి చంపారంటున్న కుటుంబ సభ్యులు
  • కరీమాబాద్‌ కోయవాడలో దారుణం 
  •  
    కరీమాబాద్‌ : ఈ భూమిపైకి వచ్చి ఆ పసిగు డ్డుకు ఇంకా రెండు నెలలైనా నిండలేదు. అప్పుడే ఎవరికో కన్నుకుట్టింది. పాలిచ్చిన తల్లి స్నానానికి వెళ్లొచ్చేసరికి ఆ పసికందు నీటి సంప్‌లో శవమై తేలాడు. ఈ సంఘట న నగరంలోని కరీమాబాద్‌ కోయవాడలో శనివారం మధ్యాహ్నం జరిగింది. పసికందు సందీప్‌(2నెలలు) తల్లి సిరిగిరి యశోద, నాన్నమ్మ దుర్గమ్మతోపాటు మిల్స్‌కాలనీ ఎస్సై రవీందర్‌ కథనం ప్రకారం.. కరీమాబాద్‌ కోయవాడలోని సిరిగిరి యశో ద, సాయి దంపతులకు రెండు నెలల పసికందు సందీప్‌ ఉన్నాడు. ఆ శిశువును ఇంట్లో పడుకోబెట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో తల్లి యశోద స్నానానికని బాత్రూమ్‌కు వెళ్లింది. ఆమె తిరిగి ఇం ట్లోకి వచ్చేసరికి పసికందు కనిపిం చలేదు. ఇంట్లో, బయట వెతికారు. స్థానికులకు చెప్పారు. అయినా సందీప్‌ ఆచూకీ లేకపోవడంతో ఇంటి వె నకాల ఉన్న వాటర్‌ సంప్‌లో గమనించారు. అం దులో శిశువు కనిపించడంతో బయటికి తీసి చూడగా అప్పటికే మృతిచెందాడు. దీం తో శిశువు తల్లి, నానమ్మ బోరున విల పిం చారు. తాను బాత్రూమ్‌కు వెళ్లిన సమయం లో బాబును ఎవరో కావాలని ఇంట్లో నుం చి తీసుకెళ్లి నీళ్ల సంప్‌లో వేసి చంపారని బా లుడి తల్లి యశోద విలపిస్తూ చెప్పింది. ఈ మేరకు మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. అ లాగే సంఘటన స్థలాన్ని ఏసీపీ సురేం ద్రనా థ్‌  సందర్శించి జరిగిన సంఘటనపై వి వరాలు అడిగి తెలుసుకున్నారు. పసికం దు తండ్రి సాయి తమిళనాడులో నాటు వైద్యం చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా కోయవాడలో పసికందు మృతి స్థానికంగా సంచలనం రేపింది. ఇంత దారుణానికి ఒడిగట్టినవారిని గుర్తించి శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement