అధికారం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఆడపడుచులపై అమానుషంగా వ్యవహరిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వారేం తప్పు చేశారని మహిళలపై అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని మంగళవారం ట్వీట్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. నిరసనలో పాల్గొన్న మహిళలపై పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించి అరెస్ట్‌లు చేశారు.