
సాక్షి, అమరావతి : మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష ప్రారంభించారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరగైన మధ్యాహ్న భోజనాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు భోజన మెనూలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఇక సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం జగన్ ఈనెల 9న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతీ పేద విద్యార్థి తల్లికి ఏటా రూ.15 వేలు ప్రభుత్వం అందిస్తుంది.
(చదవండి : అమ్మఒడి.. విద్యా విప్లవానికి నాంది)