
సాక్షి, హైదరాబాద్: భావి భారత పౌరుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
‘‘నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించింది‘‘ అంటూ ట్వీట్ చేశారు.
‘‘ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరుతున్నాను‘‘ అని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం.
విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం… pic.twitter.com/7zmh8fv81S— Harish Rao Thanneeru (@BRSHarish) August 4, 2024
Comments
Please login to add a commentAdd a comment