నంగునూరు (మెదక్) : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ కళాశాలల్లోనూ సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం మెదక్ జిల్లా నంగునూరు మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే ప్రభుత్వ కళాశాలల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామన్నారు.