సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని కోర్టు ఆదేశించింది. భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.
భోజనం వికటించిన ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఏజీ కోర్టుకు తెలిపారు. బాధ్యులను వాళ్లను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40 శాతం పెంచామని ఏఏజీ తెలిపారు.
పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది.. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని ఏఏజీ చెప్పారు. ఏఏజీ చెప్పిన వివరాలను హైకోర్టు నమోదు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment