అనంతపురం: ఇక ఎండీఎం అక్రమాలకు చెక్ మధ్యాహ్న భోజనం పథకం అమలు ఆన్‌లైన్ చేయడంలో భాగంగా ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా ఇన్ని రోజులూ మధ్యాహ్న భోజనం పథకంలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పడనుంది. చాలాచోట్ల పిల్లలు పాఠశాలలకు రాకపోయినా ఎండీఎం బిల్లులు మాత్రం చేసుకునేవారు.
ఇకపై మధ్యాహ్నం భోజనానికి హాజరయ్యే పిల్లల వివరాలను ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో ఉంచాల్సి ఉంటుంది. ట్యాబ్‌ల్లో జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) యాప్ అనుసంధానం చేశారు. దీనివల్ల పాఠశాల ఏ ఊరిలో ఉంది, అందులో ఉన్న వసతులు ఫోటోలను ఇందులో పంపితే నేరుగా ముఖ్యమంత్రి బోర్డుకు చేరుతుంది. ఆయనే స్వయంగా ఆన్‌లైన్‌లో పాఠశాలలను పరిశీలించే వీలుంటుంది.
జిల్లాకు చేరిన ట్యాబ్‌లు :
ప్రాథమికోన్నత పాఠశాలలు, మోడల్ ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల స్పెషలాఫీసర్లకు పంపిణీ చేసేందుకు ట్యాబ్‌లు జిల్లాకు వచ్చాయి. వీటిని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో భద్రపరిచారు. 590 ప్రాథమికోన్నత పాఠశాలలు, 414 మోడల్ ప్రైమరీ పాఠశాలలు, 62 కేజీబీవీలు కలిపి మొత్తం 1066 ట్యాబ్‌లు వచ్చాయి. వీటిని కలెక్టర్ త్వరలో ప్రధానోపాధ్యాయులకు అందజేయనున్నారు.
ఆన్‌లైన్‌తో అక్రమాలకు చెక్
Published Mon, Jul 4 2016 9:54 AM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM
Advertisement