సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలన అంటే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. ఏపీలో కూటమి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పంది. ప్రభుత్వ పాఠశాల్లలో విద్యార్థులకు సరైన ఆహారం అందించడంలేదు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ.. విద్యార్థుల కష్టాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ.. కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు ఇంతకంటే నీచత్వం ఉంటుందా?. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ బడిలో పేద విద్యార్థులకి ఐదేళ్లు శుచి, రుచి, పౌష్టికరమైన భోజనాన్ని అందిస్తే.. రెండు నెలల్లోనే ఆ వ్యవస్థను నాశనం చేసి పేదబిడ్డల నోటికాడ ముద్దని లాగేసుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబు?. ఏపీలో గాడి తప్పిన విద్యా వ్యవస్థకి ఇంతకంటే సాక్ష్యాలు కావాలా? అని ప్రశ్నించింది.
ఇంతకంటే నీచత్వం ఉంటుందా @ncbn?
వైయస్ జగన్ గారు సర్కార్ బడిలో పేద విద్యార్థులకి ఐదేళ్లు శుచి, రుచి, పౌష్టికరమైన భోజనాన్ని అందిస్తే.. రెండు నెలల్లోనే ఆ వ్యవస్థను నాశనం చేసి పేదబిడ్డల నోటికాడ ముద్దని లాగేసుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబు?
ఏపీలో గాడి తప్పిన విద్యా… pic.twitter.com/yHiekMK5BT— YSR Congress Party (@YSRCParty) August 14, 2024
ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విద్యార్ధులుకు పౌష్టికారహారం అందించిన విషయం తెలిసిందే. రోజుకో మెనూ చొప్పున మొత్తంగా 16 రకాల ఐటమ్స్ అందించారు.
గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం
సగటున 90% మంది విద్యార్థులకు భోజనం
భోజనం పూర్తయ్యాక ఆహారంపై ఆరా.. బాగుంటే ‘గుడ్’ లేకుంటే ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ
నాణ్యత కోసం కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి తినే ఏర్పాటు
ఎంత మంది భోజనం చేస్తున్నారో ఆన్‌లైన్‌లో పక్కాగా రికార్డు
43 లక్షల మంది ప్రతి రోజూ సంతృప్తికరంగా భోజనం
సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ
మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు
బుధవారం వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ
గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/ నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు
శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్
2019–20లో రూ.979.48 కోట్లు, 2020–21లో రూ.1,187.49 కోట్లు, 2021–22లో రూ.1,840.05 కోట్లు, 2022–23లో రూ.1,548.58 కోట్లు, 2023–24లో రూ.1,689 కోట్లు బడ్జెట్.
ప్రత్యేకంగా వంట గది, ఎప్పటికప్పుడు బిల్లులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment