ఆదిలాబాద్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ ఆవరణలో విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ ఆవరణలో విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పరిస్థితిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నేతలు మద్దతు తెలిపారు.
బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం కలుషిత ఆహారం తిని 120 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రిఫుల్ ఐటీ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. తాగునీరు, వాతావరణ మార్పుల కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండి ఉంటారని విద్యాసంస్థ ఉన్నతాధికారులు కప్పిపుచ్చుకునే ప్రయాత్నాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.