మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజనింగ్ | mid day meal turns poisonous, students hospitalised | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజనింగ్

Published Wed, Jul 23 2014 1:55 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం విషతుల్యం అయ్యింది. దీంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం విషతుల్యం అయ్యింది. దీంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.

అక్కడ పెట్టిన మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత దాదాపు పది మంది పిల్లలకు కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. వాళ్ల పరిస్థితి విషమించడంతో వెంటనే విద్యార్థులందరినీ ఆస్పత్రికి తరలించి  చికిత్స చేయిస్తున్నారు.

అన్నం, కూర కూడా పాడైనట్లు వాసన రావడంతో కొంతమంది పిల్లలు వాటిని పారేశారు. మరికొంతమంది మాత్రం తిన్నట్లు తెలుస్తోంది. దాంతో తల్లిదండ్రులు పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. తహసిల్దార్ ప్రసాద్ పాఠశాల వద్దకు వచ్చి జరిగిన సంఘటనపై విచారణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement