
పార్వతీపురం: వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఓ భర్త, భార్యపై దాడిచేసి తీవ్రంగా ఆదివారం గాయపరియాడు. ఈ సంఘటనపై పార్వతీపురం ఆస్పత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పార్వతీపురం పట్టణంలోని వేమకోటివారి వీధికి చెందిన కె. ఆదిలక్ష్మి శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భర్త కృష్ణ అనుమానంతో కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆదిలక్ష్మికి ముఖంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆదిలక్షి్మని కుమారుడు ద్విచక్రవాహనంపై చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment