సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్‌పై మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు ఆగ్రహం వ్వక్తం చేశారు. తాజాగా నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో భోజనం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం(నవంబర్20) ఒక ప్రకటన విడుదల చేశారు. అవి గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా? అని ప్రశ్నించారు.
‘నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని గురుకులాల్లో,ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతున్నది.
పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.రేవంత్ ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది? మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment