ఆస్పత్రిలో జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor rushed to hospital due to food poisoning | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో జాన్వీ కపూర్‌

Jul 19 2024 3:54 AM | Updated on Jul 19 2024 3:54 AM

Janhvi Kapoor rushed to hospital due to food poisoning

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ అస్వస్థతకు గురయ్యారు. కల్తీ ఆహారం తినడం వల్ల జాన్వీ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారని, రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అవుతారని జాన్వీ తండ్రి–నిర్మాత బోనీ కపూర్‌ వెల్లడించినట్లుగా బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. 

అయితే ముందుగా జాన్వీ కపూర్‌ ఆస్పత్రిపాలయ్యారని వార్తలు రావడంతో ఆమె అభిమానులు షాక్‌ అయ్యారు. స్వల్ప అస్వస్థత మాత్రమే అని బోనీ కపూర్‌ పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్‌ ‘దేవర’, రామ్‌చరణ్‌ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), హిందీలో వరుణ్‌ ధావన్‌తో ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు జాన్వీ. అలాగే ఈ బ్యూటీ నటించిన హిందీ చిత్రం ‘ఉలజ్‌’ ఆగస్టులో విడుదలకు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement