అయ్యో.. అనసూజ  | Sangareddy: Anasuja Died After Eating Contaminated Food | Sakshi
Sakshi News home page

అయ్యో.. అనసూజ 

Published Sat, Dec 26 2020 9:13 AM | Last Updated on Sat, Dec 26 2020 9:13 AM

Sangareddy: Anasuja Died After Eating Contaminated Food - Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడి తీరనిశోక సంద్రంలో ఉండగానే చికిత్స పొందుతున్న మరొకరు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలో చోటుచేసుకుంది. జొన్న రొట్టె తిని మరణించిన విషాద ఘటనలో అనుసూజ మృతి చెందడంతో మృతులసంఖ్య ఐదుకు చేరింది. పల్వట్ల గ్రామంలో మఠం శంకరమ్మ  అంత్యక్రియలకు వచ్చిన కొడుకులు, కోడళ్లు ఈ నెల 21న  జొన్న రొట్టెలు చేసుకొని తిన్న ఐదుగురిలో చంద్రమౌళి, శ్రీశైలం, సుశీల ముగ్గురు మృతి చెందిన విసయం తెలిసిందే.
(చదవండి : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి)

చికిత్స తీసుకుంటున్న ఇద్దరిలో బీబీఆర్‌ ఆస్పత్రిలో ఉన్న అనుసూజ(48) గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆ కుటంబం మరింత శోకసంద్రంలో మునిపోయింది. సరిత ఉస్మానియ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోందని, ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

దినకార్యం ముగియకముందే.. 
ఇటీవల మృతి చెందిన ముగ్గురి దినకార్యం కూడా పూర్తి కాకముందే మరో చావు కబురు వినడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటువంటి గోస పగవాడికి కూడా రాకూడదని గ్రామస్తులు ఒకరికొకరు చెప్పుకుంటూ బాధపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement