
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ చిత్ర దర్శకుడు బైజు పరవూర్ జూన్ కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికి మీడియా కథనాల ప్రకారం ఫుడ్ పాయిజనింగ్‌తో మృతి చెందినట్లు భావిస్తున్నారు.
(ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్)
అసలేం జరిగిందంటే..
జూన్ 24న కోజికోడ్‌లోని ఒక హోటల్‌లో బైజు పరవూర్ భోజనం చేశారు. అయితే ఇంటికి వచ్చిన వెంటనే ఏదో అసౌకర్యంగా అనిపించడంతో కేరళలోని కున్నంకులంలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడే స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బైజు పరవూరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు.
ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే బైజు చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. బైజు దాదాపు 45 సినిమాల్లో ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పనిచేశారు. త్వరలోనే తాను తెరకెక్కించిన సినిమా సీక్రెట్ రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
(ఇది చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే)
Comments
Please login to add a commentAdd a comment