సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రభుత్వ స్కూల్స్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇక, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్కూల్స్, గురుకులాలను తరుచూ తనిఖీ చేయాలి. పరిశుభ్ర వాతావరణంలో ఆహారం అందించాలి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లఓ్యం వహిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో పలుచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి అన్ని వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment