గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగి సస్పెండ్‌ | Tribal Welfare Department employee suspended | Sakshi
Sakshi News home page

గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగి సస్పెండ్‌

Published Sat, Sep 3 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

Tribal Welfare Department employee suspended

ఏటూరునాగారం : ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ విద్యా విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌ కృష్ణారావును సస్పెండ్‌ చేస్తూ ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2012–2013 స్పెషల్‌ డీఎస్సీలో డీడీ పోచంతోపాటు కిరణ్‌కృష్ణారావు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకే విభాగం నుంచి ఇటీవలే పోచంను సస్పెండ్‌ చేయగా, ప్రస్తుతం కృష్ణారావును సస్పెండ్‌ చేయడం గమనార్హం. గతంలో కూడా కిరణ్‌ కృష్ణారావు పనితీరు బాగా లేకపోవడంతో కన్నాయిగూడెంలో ఉపాధ్యాయుడిగా బదిలీ చేశారు. కానీ ఆయన అక్కడకు వెళ్లకపోగా.. తాజాగా డీఎస్సీలో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో వేటు పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement