టీచర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే | Teacher turning MLA | Sakshi
Sakshi News home page

టీచర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే

Published Sat, Jul 18 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

Teacher turning MLA

 సీతంపేట: ఎమ్మెల్యే విశ్వాస రాయి కళావతి టీచర్ అవతారమెత్తాయి. గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను శుక్రవారం సందర్శించారు. మూడో తరగతి గదికి వెళ్లి తెలుగు వాచకములోని పాటాలను విద్యార్థులతో చదివించి.. అర్థం చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఇక్కడ కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారని, సీఆర్‌టీలను ఇంతవరకు నియంచని విషయమై ఎమ్మెల్యే గుర్తించారు. మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పని చేయడం లేద న్నారు. 480 మంది విద్యార్థులు చదువుతుండగా సరిపడినన్ని మరుగుదొడ్లు, స్నాన్నపు గదులు లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. పాఠశాలకు ఉన్న ఇతర సమస్యలను హెచ్‌ఎం బి.నారాయణరావు, వార్డెన్ అమల, ఉపాధ్యాయుడు గాసయ్యలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్‌పీటీసీ సభ్యుడు పాలక రాజబాబు, ఎంపీటీసీ సభ్యురాలు బిడ్డిక జయలక్ష్మి, ఎంపీటీసీ ప్రతినిధి గొర్లె ప్రకాష్   పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement