కొయ్యలగూడెం: ఏలూరు జిల్లాలో వినాయక నిమజ్జనంలో ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలోని పోతన చెరువులో వినాయక విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షేక్ రియాజ్ (25), ఉక్కుర్తి దొరబాబు (45), దొరబాబు కొడుకు కార్తీక్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు.
వెంటనే మత్స్యకారుడు పి.రమణ స్పందించి కార్తీక్‌ను కాపాడాడు. పూర్తిగా నీటమునిగిన రియాజ్, దొరబాబులను బయటకు తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న వారిని జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలిచ్చారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రియాజ్ అవివాహితుడు కాగా, దొరబాబుకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.
నిమజ్జనంలో అపశ్రుతి
Published Mon, Sep 5 2022 5:51 AM | Last Updated on Mon, Sep 5 2022 5:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment