సాక్షి, ఏలూరు జిల్లా: తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టిపెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఏపీ సి.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదని కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు అబద్ధ ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు అమరావతిని తనకు కావాల్సిన వాళ్లకి రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారు. సీఎం జగన్ తనకు తెలిసిన వారితో పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాల్సిన అవసరం తప్పకుండా ఉంది.’’ అని కొమ్మినేని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌పై కొమ్మినేని మాట్లాడుతూ, చంద్రబాబు 38 రోజులుగా జైల్లో వుండటానికి కారణం వారి కుటుంబ సభ్యులు, టీడీపీ లాయర్లే... లాయర్లు ముందు బెయిల్ కోరకుండా కేసు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. మొన్నటి దాకా చంద్రబాబు ఎండలో తిరిగి ఫిట్‌గా ఉన్నానని, ఇప్పుడు జైల్లో నీడలో ఉండి ఆరోగ్యం బాగాలేదనడం అర్థం కాని విషయం. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఏసీలు కావాలని కోర్టులో వేస్తున్నారు తప్ప, ఆయన్ని ఆసుపత్రిలో చేర్చమని ఎందుకు అడగడం లేదు’’ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు.
చదవండి: అన్ని సీట్లలో పోటీ చేయదట.. టీడీపీపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
Comments
Please login to add a commentAdd a comment