YSR Asara: AP CM YS Jagan Denduluru Eluru District Tour Live Updates - Sakshi
Sakshi News home page

హామీని నిలబెట్టుకున్నా.. అండగా నిలిచా: సీఎం జగన్‌

Published Sat, Mar 25 2023 9:34 AM | Last Updated on Sat, Mar 25 2023 3:16 PM

Ysr Asara: Cm Jagan Denduluru Eluru District Tour Live Updates - Sakshi

Updates

Time: 01:05 PM
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. వైఎస్సార్‌ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని ఆయన విడుదల చేశారు. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్‌ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్‌ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు.

Time: 12:47 PM
రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయి: సీఎం జగన్‌
ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు :
ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిపెట్టాను
స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు
అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం కింద ఇచ్చాం
మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. అన్నగా… ప్రభుత్వం నిలబడుతుంది
ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం
9 లక్షల మందికిపైగా నా అక్క చెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు
రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా వారికి అనుసంధానం చేశాం
తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారు

చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయి
99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నారు
దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయి
బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం
ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నాం
చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. మళ్లీ ఊపిరి పోసుకుంది
ఎన్‌పీఏలు, ఓవర్‌ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమే
గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం
రుణాలు మాఫీచేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారు
వారిని నిలువునా ముంచేశారు
2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీరుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారు
రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్కవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి
తిరిగి సున్నావడ్డీ కిందరుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చాం
2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించాం
చిక్కటి చిరునవ్వుతోనే ఇదంతా చేశాం
మహిళా పక్షపాత ప్రభుత్వం మనది
ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం:
మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం
కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది
ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది
గుడి ఛైర్మన్‌, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం
అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ను తీసుకు వచ్చాం
1.17 లక్షల మంది రిజస్టర్‌ చేసుకున్నారు
21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపన పడుతున్నాను

Time: 12:25 PM
►మహిళలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తోంది: సీఎం జగన్‌
►వ్యాపార దిగ్గజాలతో ఒప్పంద చేసుకొని వ్యాపార మార్గాలు చూపాం
►ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచాం.
►పొదుపు సంఘాల మహిళలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు
►పొదుపు సంఘాల పనితీరును ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి
►బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాన్ని తగ్గిస్తున్నాం
►78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం
►10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పంపిణీ ఉత్సవాలు
►ప్రతి మండలంలోనూ ఉత్సవంలా వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం

Time: 12:25 PM
►పొదుపు సంఘల మహిళలకు అండగా నిలిచాం: సీఎం జగన్‌
►డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
►ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లు అందించాం
►లంచాలు లేవు.. వివక్ష ఉండదు.. నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు
►ఆసరా కింద ఇచ్చే డబ్బులు ఎలా వాడుకుంటారో మీ ఇష్టం

Time: 12:09 PM
►మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: సీఎం జగన్‌
►పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా
►డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చా
►నేను విన్నాను... నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నానని చెప్పా
►ఇచ్చిన మాట ప్రకారం అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నా

Time: 12:00 PM
►వైఎస్సార్‌ ఆసరా నిధులు ఇవ్వడం సంతోషంగా ఉంది: లబ్దిదారులు
►వైఎస్సార్‌ ఆసరా నిధులతో మా కాళ్ల మీద మేము నిలబడ్డాం
►అండగా విద్యాకానుక, విద్యాదీవెన, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలు.
►మీ పాలనలో మా పిల్లలకు మంచి చదువులు
►నవరత్నాల పథకాలతో మా జీవితాల్లో వెలుగులు నింపారు.

Time: 11:45AM
► సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చిన ఘనత చంద్రబాబుది: ఎమ్మెల్యే అబ్బయ చౌదరి
►డ్వాక్రా మహిళలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు.
►పొదుపు సంఘాలు చివరికి సీ,డీ గ్రేడ్‌లకు పడిపోయాయి.
►సున్నావడ్డీ పథకంతో అక్కచెల్లెమ్మల్లో మళ్లీ ఆనందం తెచ్చిన ఘనత సీఎం జగన్‌ది
►సీఎం జగన్‌ పాలనలో పొదుపు సంఘాలు ఏ,బీ గ్రేడ్‌లకు చేరాయి.

Time: 11:31AM
► వైఎస్సార్‌ ఆసరా లబ్ధిదారులను పలకరించిన సీఎం జగన్‌
► వైఎస్సర్‌ ఆసరా లబ్ధిదారులతో సీఎం జగన్‌ ఫోటో సెషన్‌

Time: 11:15AM
►దెందులూరు సభా ప్రాంగణానికి సీఎం జగన్‌ చేరుకున్నారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తున్నారు.

Time: 10:50AM
► దెందులూరుకు సీఎం జగన్‌ చేరుకున్నారు. సభా ప్రాంగణానికి బయల్దేరారు. దారిపోడవునా సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు.

Time: 10:10AM
► ఏలూరు జిల్లా దెందులూరుకు సీఎం జగన్‌ బయల్దేరారు.  కాసేపట్లో  వైఎస్సార్‌ ఆసరా పథకం కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు.

సాక్షి, ఏలూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 గంటల మధ్య దెందులూరులో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్‌ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

కాగా ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌ లేఖలు రాశారు. పది రోజుల పాటు జరిగే ‘ఆసరా’ పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ది దారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారని అధికారులు తెలిపారు. 

వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్‌ ఆసరా
వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్‌ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు.  నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్‌ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు.

పథకం ఉద్దేశ్యం
ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకం తీసుకురావడం జరిగింది.

మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడం
మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని, వారికి వారుగా సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేయడం జరిగింది. 

మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయడం కోసం, జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా అమూల్, హిందూస్తాన్‌ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అలానా, అజియో రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్‌గుడి, జియాన్, నినె, ఆయేకార్ట్, మహేంద్ర అండ్‌ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో వారికి సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్దికి సీఎం బాటలు వేశారు.

కార్పొరేట్‌ సంస్ధలు, బ్యాంకులతో అనుసంధానం చేసి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటివరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్రవ్యాపారం వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ. 7,000 నుండి రూ. 10,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటర్‌ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement