సైలెంట్‌ పుంజు.. వయలెంట్‌ విజయం | kodi pandalu in eluru district | Sakshi
Sakshi News home page

సైలెంట్‌ పుంజు.. వయలెంట్‌ విజయం

Published Thu, Jan 16 2025 11:42 AM | Last Updated on Thu, Jan 16 2025 12:39 PM

kodi pandalu in eluru district

 భీమడోలు:  ఏలూరు జిల్లా కోడి పందేల బరిలో ఓ పుంజు చిత్రమైన విజయా­న్ని సొంతం చేసుకుంది. ‘నేనె­­ప్పుడూ సైలెంట్‌.. నా జో­లికొస్తే మాత్రం మహా వయలెంట్‌’ అన్నట్టుగా మూడు కోడి పుంజుల్ని వీరోచిత పటిమతో ఓ­డించిన రసంగి పుంజును అ­బ్రా­స్‌ పుంజు మట్టికరిపించింది. ఏలూ­రు జిల్లా భీమడోలులో జాతీయ రహ­దా­రి పక్కన ఓ భారీ బరిని ఏర్పాటు చేశారు. బుధవారం చివరగా ఓ పందెం వేశారు. ఒకేసారి ఐదు కోడి పుంజులను బరిలోకి దింపారు. 

వాటిలో ప్రారంభం నుంచి సైలెంట్‌గా ఉన్న అబ్రాస్‌ కోడి పుంజు వేరే పుంజుల జోలికి వెళ్లకుండా మౌనంగా ఉండి­పోయింది. కాగా.. రసంగి కోడి పుంజు మిగిలిన మూడు పుంజులపై వీరోచితంగా పో­రాడి వాటిని మట్టి కరిపించింది. చివరగా నక్కినక్కి ఉన్న అబ్రాస్‌ కోడి పుంజుని పొడిచేందుకు వెళ్లిన రసంగిని అబ్రాస్‌ పుంజు ఒకే ఒక్క దెబ్బతో నేల కరిపించింది. ఈ పందేన్ని చూసిన వారంతా ‘సైలెంట్‌ పుంజు.. వయలెంట్‌’ విజయం.. అని వ్యాఖ్యానించారు.               

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement