
సాక్షి, ఏలూరు జిల్లా : ఎగువను కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే వద్ద 32.390 మీటర్ల నీటిమట్టం పెరిగింది. వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
స్పిల్ వే గేట్ల నుంచి 7 లక్షల 43 వేల 352 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే దిగువన 24 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరి వరదల నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
- కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 1800 233 1077
- జంగారడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 9553220254
- కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 7013128597,9848590546
- వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 6309254781
తూ.గో. జిల్లా: ధవళేశ్వరంలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద 10.8 అడుగులకు నీటి మట్టం చేరింది. 8.48 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాల్వలకు 11వేల క్యూసెక్కులు విడుదల చేశారు అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment