సంక్రాంతి నెల రావడంతో పల్లెల్లో సందడి మొదలైంది. హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. మోటారు వాహనాలపై తిరుగుతూ దానం స్వీకరిస్తున్నారు. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచే ఈ హరిదాసులకు పూలు, పండ్లు, ధాన్యం ఇస్తుంటారు.
రానురాను ప్రజల్లో భక్తిభావం తగ్గుతుందని, హరిదాసులు జీవించడానికి ఆశించిన విధంగా ఆదాయం రాకపోయినా తాతముత్తాతల నుంచి వస్తున్న ఈ వృత్తినే కొనసాగిస్తున్నామని కొవ్వలి గ్రామానికి చెందిన హరిదాసు మహేష్ అన్నారు.
– దెందులూరు(ఏలూరు జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment