సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి టీడీపీ-జనసేనలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను టీడీపీ, జనసేనలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. లోకల్ ముద్దు - నాన్ లోకల్ వద్దు అంటూ టీడీపీ- జనసేన నాయకులు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. నాగబాబు వద్దకు తిరుపతి పంచాయితీ చేరింది. మరోవైపు, టికెట్ ఇస్తే జనసేన నుంచి పోటీకి సిద్ధమని సుగుణమ్మ అంటున్నారు.
శ్రీకాళహస్తిలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్పీవీ వర్గం వ్యతిరేకిస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోనేటి ఆది మూలం వద్దని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. టీడీపీ రెబెల్‌గా సత్యవేడు మాజీ ఇన్‌ఛార్జ్ జీడి రాజశేఖర్ బరిలో దిగారు. మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషాను దొమ్మల పాటి రమేష్, జనసేన పార్టీ నేత రామ్ దాస్ చౌదరి వ్యతిరేకిస్తున్నారు. తంబల్లపల్లెలో జయచంద్రారెడ్డికి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం ఆగ్రహంతో ఉన్నారు.
ఇదీ చదవండి: బాబును నమ్ముకో.. ఉన్నది అమ్ముకో..
Comments
Please login to add a commentAdd a comment