గోదావరిలో తీరు మారిందంటున్న పందెంరాయుళ్లు
రండన్నా రండి.. వెయ్యికి రెండు వేలు.. లచ్ఛకు రెండు లచ్చలు.. గవర్నమెంట్ ఎవరిదీ వస్తుంది.. జగనా ? చంద్రబాబా ? ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి. రండి పందెం కాసుకోండి అంటున్నారు గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు.. కోడిపందాలు.. క్రికెట్ పందాలు.. ఇలా రకరకాల పందేలకు పేరుగాంచిన భీమవరంలో ఇప్పుడు రాజకీయ పందేలు మొదలయ్యాయి. ఇంకా నెలన్నరలో ఎన్నికలు జరగనుండగా.. ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ ఇప్పుడే పందేలు కాస్తున్నారు.. ఈ మేరకు అగ్రిమెంట్లు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ రాజకీయ పందేలు గత దసరా నుంచే మొదలయ్యాయి...అప్పట్లో కొందరు టీడీపీ అభిమానులు సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెసుకు యాభై సీట్లకన్నా తక్కువే వస్తాయని చెబుతూ అలా పందెం కాశారు. అది కూడా కోసు పందెం... అంటే ఫ్యానుకు యాభై సీట్లకు మించి వస్తే టీడీపీ వాళ్ళు రెండు రెట్లు.. మూడు రెట్లు డబ్బులిస్తారన్నమాట.. అంటే లక్ష పందెం కాసారనుకోండి.. జగన్ పార్టీకి యాభై సీట్లకు లోపు వస్తే ఆ లక్ష పోయినట్లు... కానీ యాభైకి మించి వస్తే టీడీపీ వాళ్ళు.. రెండు.. మూడు లక్షలు ఇస్తారన్నమాట.. ఇలా అప్పట్లో పందేలు ఫిక్స్ చేసుకుని నోట్లు.. అగ్రిమెంట్లు.. పెద్దమనుషుల సమక్షంలో మాట కూడా తీసుకోవడం జరిగింది.. ఇదిలా ఉండగా సంక్రాంతి పోయాక పందెం తీరు మారింది... జగనుకు 70 - 80 సీట్లు వస్తాయంటూ సమపందెం కాస్తున్నారు. అంటే పందెంలో ఎంత వేస్తె అంత వస్తుంది.. ఎంత కాస్తే అంతే ఓడిపోతారు తప్ప.. రెండు మూడు రెట్లు అనేది ఉండదు.
ఇదిలా ఉండగా మర్చి నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. మళ్ళీ జగన్ వస్తున్నారట.. పేదలు.. బీసీలు.. మహిళలు.. రైతులు అందరూ జగన్ పక్షాన ఉండడంతో ప్రభుత్వానికి ఎదురేలేదట.. నూట ఇరవై సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నారట అనే భావన పల్లెల్లో మొదలైంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనేదానిమీద పందేలు కాస్తున్నారు. అయితే గతంలో జగన్ కు 50 సీట్లకు మించి రావంటూ రెండు మూడు రెట్లు ఇచ్చేలా పందెం ఖరారు చేసుకున్నవాళ్ళంటా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
కూటమిలో సీట్ల చిచ్చు.. వాళ్ళిస్తున్న మ్యానిఫెస్టో.. హామీలను ప్రజలు నమ్మకపోవడం... గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎలా తుంగలోకి తొక్కింది.. ఇవన్నీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.. అంతేకాకుండా చెప్పినమాటమీద.. ఇచ్చిన హామీ మీద నిలబడే జగన్ అంతే జనానికి నమ్మకం కుదిరిందని, ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి కూడా చేసి చూపుతున్న జగన్ గెలుపు విషయంలో సందేహాలు లేనేలేవని ప్రజల్లో అభిప్రాయాలూ గట్టిగా వినిపిస్తుండడంతో ఇప్పుడు పందెం తీరు మారింది.
ఎన్ని సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.. వంద.. నూట ఇరవై.. ఇలా ఇప్పుడు పందేలు కాస్తున్నారు.. మొత్తానికి గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు పూర్తి భిన్నంగాఉండడంతో పందెం రాయుళ్లు ఇప్పుడు జగన్ గెలుపు మీద కాపు కాస్తున్నారు.. అయితే గతంలో టీడీపీ గెలుపు మీద లక్షల్లో అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్లంతా ఇప్పుడు దిగాలు పడిపోతున్నారు.. ఈ నెలలో పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పరిస్థితి మరింత మెరుగై... నూట నలభై.. వరకూ ఎగబాకుతుందని.. కూడా పందెం రాయుళ్లు అంటున్నారు.. మరోవైపు జగన్ గెలిస్తే లక్ష ఇస్తాం.. టీడీపీ గెలిస్తే మీరు అరవై.. డెబ్బై వేలు ఇస్తే చాలు అన్నట్లుగా ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment