April 18th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections 2024: Political News In Telugu On April 18th Updates | Sakshi
Sakshi News home page

April 18th AP Election News Updates: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Published Thu, Apr 18 2024 6:46 AM | Last Updated on Thu, Apr 18 2024 7:19 PM

AP Elections 2024: Political News In Telugu On April 18th Updates - Sakshi

April 18th AP Elections 2024 News Political Updates..

6:45PM, Apr 18th, 2024

నెల్లూరు: 

కుట్రలు చేస్తున్న చంద్రబాబుకీ ఇవే చివరి ఎన్నికలు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

  • రాష్ట్ర సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించిన విషయాలన్నీ వాస్తవాలు
  •  సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంపాలని చూశారు
  • హత్యయత్నం వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు.. వారి పాత్ర పై విచారణ జరపాలి..
  • కుట్రలు చేస్తున్న చంద్రబాబుకీ ఇవే చివరి ఎన్నికలు

6:38PM, Apr 18th, 2024

అమరావతి:

చంద్రబాబు , పవన్ ఇప్పుడేమని సమాధానం చెబుతారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

  • చంద్రబాబు , పవన్ ప్రచార సభల్లో సీఎంపై వాడుతున్న అసభ్యకర పదజాలం పై ఈసీకి పిర్యాదు చేసాము 
  • నర్సీపట్నం లో అయ్యన్నపాత్రుడు సీఎం వైఎస్ జగన్‌ని దుర్భాషలాడారు
  • రాజకీయ విలువలను దిగజార్చేలా మాట్లాడారు 
  • సభ్యసమాజం తలదించుకునేలా అయ్యన్న చేసిన వాఖ్యలపై కూడా పిర్యాదు చేశాం
  • సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై కూడా ఈసీకి పిర్యాదు చేశాం
  • చంద్రబాబు ,పవన్ విలువలు విశ్వసనీయత లేని నాయకులు 
  • దగా , కుట్రలకు కూటమి నిలువెత్తు నిదర్శనం 
  • సీఎంపై దాడి చేసిన వారికి చంద్రబాబు , పవన్ వత్తాసు పలికారు 
  • దాడి బూటకమని ఆరోపించారు 
  • నిందితులను పోలీసులు అరెస్ట్ చెసి కోర్టులో హాజరు పరిచారు 
  • చంద్రబాబు ,పవన్ ఇప్పుడేమని సమాధానం చెబుతారు

5:32PM, Apr 18th, 2024

అమరావతి:

నేటి ఉదయం 11 నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. ముఖేష్ కుమార్ మీనా, ఏపీ సీఈవో

  • ఈ నెల 25 వరకూ నామినేషన్లు స్వీకరణ..26న నామినేషన్లు పరిశీలన 
  • ఈ నెల 29 వరకూ నామినేషన్లు ఉపసంహరణ గడువు .
  • ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్.
  • అరకు, పాడేరు,రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ పోలింగ్
  • 50 మంది సాధారణ పరిశీలకులు ఉంటారు
  • మొదటిసారి ఏపీ ఎన్నికలకు 18 మంది పోలీసు పరిశీలకులను నియమించారు.
  • 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ అవకాశం.
  • ఇవాల్టి నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
  • 29 వరకూ హోం ఓటింగ్ కోసం అప్లికేషన్లు తీసుకుంటాం.
  • మే 2 నుంచి 10 వరకూ ఇంటింటికీ పోలింగ్ టీమ్స్ వెళ్లి ఓటింగ్ తీసుకుంటాయి.
  • సర్వీస్ ఓటర్లకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది.
  • మే 5 నుంచి 10 వరకూ ఎన్నికల విధుల్లో ఉన్న వారికి ఫెసిలిటిషవ్ సెంటర్లలో ఓటింగ్.
  • 5,26,000 మందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంది .

4:20PM, Apr 18th, 2024

తాడేపల్లి:

సీఎం జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే: సజ్జల రామకృష్ణారెడ్డి

  • ఎన్‌ఆర్‌ఐలు స్వచందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చెయ్యడం సంతోషం
  • ప్రజల్లో సీఎం జగన్ చేసిన  మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు
  • మన రాష్ట్రంలో మళ్ళీ సీఎం జగన్ పాలన రావాలని  కోరుకుంటున్నారు
  • సీఎం జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
  • ఇది ఆకతాయిల చర్య కాదు
  • దీని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అర్థరహితం
  • ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి
  • వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది
  • బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా విచారణలో తేలుతుంది
  • తప్పు చేసినోడు నన్ను ఇరికించారాని మాట్లాడితే చెల్లుతుందా?
     

4:15PM, Apr 18th, 2024

తాడేపల్లి: 

బాబు, పవన్‌ అబద్ధాలు చెబుతూ ఓట్లు అడుగుతున్నారు: పేర్ని నాని

  • చంద్రబాబు నోరు తెరిస్తే అసత్యాలే
  • చంద్రబాబు మాట్లాడిన ప్రతీ మాట అబద్ధమే
  • శిరోముండనం కేసు 1996లో జరిగింది
  • 1995-2020 వరకూ తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు
  • చంద్రబాబు బొంకు మాటల నాయుడు
  • బాబు, పవన్‌పై నేను ఏనాడు బూతులు మాట్లాడలేదు
  • బాబుకు వయసు పెరిగింది కానీ.. ఏం మాట్లాడాలో తెలియదు
  • 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందరుకు ఏం చేశారు
  • బందరుకు పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్‌
  • కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్‌ కాలేజీలు నిర్మించాం
  • పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నాం
  • 26వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చాం
  • కరోనా సమయంలో నా కొడుకు పేదలకు సేవ చేశాడు
  • 75 ఏళ్ల వయసున్న చంద్రబాబువి అన్నీ పాపపు మాటలే
  • నా కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారాలు
  • చంద్రబాబు తీరును ప్రశ్నిస్తే నేను బూతులు నానినా?

3:15PM, Apr 18th, 2024

ఏలూరు జిల్లా:

నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు

  • స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన
  • నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు
  • నూజివీడు టీడీపీలో ఉన్నదంతా ప్యాకేజ్ బ్యాచ్ 
  • రెండు సార్లు నాకు నామాలు పెట్టారు

3:10PM, Apr 18th, 2024

విజయవాడ:
4 శాతం రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా చెప్పిందే కిషన్‌రెడ్డి, పురంధేశ్వరి చెప్తున్నారు
సాక్షితో వైఎస్సార్‌సీపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్

  • బీజేపీ నేతల స్టేట్‌మెంట్లను చంద్రబాబు ఖందించట్లేదు అంటే సమర్ధిస్తున్నట్టే
  • కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న కూటమిని ఏపీ ప్రజలు నమ్మరు
  • చంద్రబాబు ముస్లింల ద్రోహి
  • గుంటూరు నారా హమారా సభలో నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులను కేసులు పెట్టి హింసించింది చంద్రబాబే
  • చంద్రబాబును ముస్లిం సమాజం నమ్మదు
  • ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు
  • సీఏఏ, ఎన్ఆర్ సి వంటి నల్ల చట్టాలు అమలులోకి వస్తాయి
  • పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలను రెచ్చగొట్టేలా అనేక వ్యాఖ్యలు చేశారు
  • బీజేపీ నేతల వ్యాఖ్యలతో అన్నదమ్ముల్లాంటి హిందూ, ముస్లిం, కృష్టియన్లకు గొడవలు మొదలవుతాయి

2:50PM, Apr 18th, 2024

అనంతపురం:

టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ 

  • రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత ప్రొఫెసర్ రాజేష్ 
  • టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్ 
  • పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్
     

2:20PM, Apr 18th, 2024
తాడేపల్లి

జూపూడి ప్రభాకర్ రావు, సోషల్ జస్టిస్ సలహాదారు.. కామెంట్లు

  • ఈనాడు పత్రిక సీఎం జగన్‌పై దారుణంగా రాశారు
  • దళితులను విడగొట్టి, దళితులను నీరు గార్చిన వ్యక్తి చంద్రబాబు
  • కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదా
  • రామోజీరావుకి కారంచేడు ఘటన కనిపించలేదా
  • దళితులని ముక్కలు చేసి, సాక్ష్యాలు లేకుండా చేసింది చంద్రబాబు కాదా
  • ఈనాడు లో ఒక్క రోజైన దళితుల వృద్ధి కోసం వార్త రాశావా
  • మాదిగ పల్లెలు మీద దాడి చేసి చంపింది టీడీపీ కాదా
  • ట్యాంక్ బండ్ మీద దళితులను గుర్రాలతో తొక్కించి చంపించింది చంద్రబాబు కాదా
  • సీఎం జగన్ నా ఎస్సి, నా బీసీ, నా మైనారిటీ అంటుంటే రామోజీరావు తట్టుకోలేకపోతున్నాడు
  • రామోజీరావు ని వయస్సుకి కూడా బుద్ధి లేదా
  • దళితులు మురికిగా ఉంటారని చంద్రబాబు కేబినెట్లో మంత్రి అనలేదా
  • ఎస్సిలకు ఎందుకురా రాజకీయాలు అన్నది టీడీపీ నాయకులు కాదా
  • వై ఎస్ కుటుంబం లో దళితులను వివాహం చేసుకున్నారు ఉన్నారు
  • రామోజీరావు, చంద్రబాబు ఇంట్లో ఎవరైనా ఎస్సిలు ఉన్నారా
  • 14 ఏళ్ల లో చంద్రబాబు ఏనాడైనా దళితులకు మేలు చేశాడా
  • సీఎం జగన్ని చూసి అన్నీ తడుపుకుంటున్నారు
  • సీఎం జగన్ని చంపాలని కూడా చూశారు
  • ఆ విచారణలో నిజాలు బయటకొస్తున్నాయ్ కాస్కోండి
  • సీఎం జగన్ బి ఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయం సూత్రాన్ని అమలు చేస్తున్నారు
  • చరిత్రలో ఎవ్వరు ఇవ్వని రాజకీయ అవకాశాలు ఇచ్చారు
  • దళితుల్లో విషం నింపాలని రామోజీరావు తప్పుడు వార్తలు రాస్తున్నాడు
  • 14 ఏళ్ళు ఎవడికి ఏం చేశాడో.. చంద్రబాబు చెప్పాలి
  • బాలయోగిని స్పీకర్ కాకుండా అడ్డుకోవాలని చూడలేదా
  • అబ్దుల్ కలాంని రాష్ట్రపతి ని చేశావంటే ఎవరైనా నమ్ముతారా
  • నీకు, అబ్దుల్ కలాంకి ఏంటి సంబంధం
  • సింగణమలలో ఓ సాధారణ టిప్పర్ డ్రైవర్ అయిన దళితుడికి సీటు ఇస్తే చంద్రబాబు అవమానించారు
  • రామోజీరావు శరీరం దళితుల రక్తం, దళితుల చెమట, దళితుల వ్యతిరేక భావం తో నిండిపోయింది
  • రాజధానిలో దళితులు ఉండటానికి వీల్లేదని చెప్పిన వాళ్ళు చంద్రబాబు, రామోజీ రావులు
  • పేదవాడి వాసన, పేదవాడి నీడ వాళ్ళ మీద పడకూడదంట.!
  • విజయవాడలో పెట్టిన అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా చూడని దళిత వ్యతిరేక స్వభావం చంద్రబాబుది.!

01:45PM, Apr 18th, 2024
అన్నమయ్య జిల్లా : 
రాజంపేటంలో అట్టహాసంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ 

  • రాజంపేటలో వైసిపిదే గెలుపు: అమరనాథ్‌ రెడ్డి 
  • స్థానికుడిని, అందరికి అందుబాటులో ఉండే వాడిని
  • సిఎం వైఎస్ జగన్ పాలనకు బ్రహ్మరథం పట్టడం ఖాయం

01:45PM, Apr 18th, 2024
ఢిల్లీ:
మళ్లీ వాయిదాలు ఇవ్వం,. ఇదే చివరి అవకాశం

  • ఓటుకు నోటు కేసు విచారణలో చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి  స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
  • కేసు ప్రారంభం కాగానే విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు
  • కేసు విచారణ జూలై 24కి వాయిదా
  • ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని కోరిన తెలంగాణ తరఫున న్యాయవాది
  • సెలవుల తర్వాత విచారణ జరపాలనుకొని చంద్రబాబు తరఫు న్యాయవాది
  • ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలని , దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని పిటిషన్
  • చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావించిన ఏసీబి

01:30PM, Apr 18th, 2024
అనకాపల్లి జిల్లా
వైవీ సుబ్బారెడ్డి కామెంట్లు

  • రాజధాని పేరిట దోచుకోవడానికే చంద్రబాబు నాయుడు అమరావతి నినాదం
  • కేంద్రం దాతలు ఇచ్చిన నిధులు ఎప్పుడో దోచేశారు
  • ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారు
  • ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖ రాజధానిని ఇప్పటికే సీఎం ప్రకటించారు
  • విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది
  • సీఎంపై రాళ్లదాడి వెనక టిడిపి ప్రమేయం కచ్చితంగా ఉంది
  • ఆ విషయం దర్యాప్తులోనే తేలుతుంది
  • సీఎం గెలుపు ఓర్వలేక ఈ ఇలాంటి దాడులకు టిడిపి పురి గొలుపుతోంది

01:00PM, Apr 18th, 2024
విజయవాడ:

చంద్రబాబు, పవన్ పై మంత్రి జోగి రమేష్ మండిపాటు

  • జగన్ పై విషం చిమ్ముతున్నారు 
  • జనప్రభంజనం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు 
  • చంద్రబాబు సభలకు ఎక్కడా జనం లేరు 
  • జగన్ సభలకు ఎండ తీవ్రత లెక్కచేయకుండా జనం వస్తున్నారు 
  • చంద్రబాబును జనం నమ్మే పరిస్థితిలో లేరు 
  • పిఠాపురంలో గాజు గ్లాసు పగిలిపోవడం ఖాయం 
  • ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో జగన్ చూపించారు 
  • ఇద్దరు మోసగాళ్లు వెళ్లి ఢిల్లీ పార్టీతో కలిశారు 
  • విలువలు, విశ్వసనీయత వదిలేసి పొత్తులు పెట్టుకున్నారు 
  • ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ-జనసేన అడ్రస్ గల్లంతే 
  • కుప్పంలో బాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోతున్నారు 
  • ప్రజల మనస్సులు గెలిచిన నాయకుడు జగన్

12:40PM, Apr 18th, 2024
కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు లో టీడీపీకి ఎదురు దెబ్బ

  • టీడీపీ అభ్యర్ధి వరుపుల సత్యప్రభ తీరుతో మనస్తాపం చెందిన జిల్లా అధికార ప్రతి‌నిధి పైలా సుభాష్ చంద్రబోస్
  • తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా
  • టీడీపీలో బీసీలకు గుర్తింపు లేదు
  • పార్టీ ఆవిర్భావం నుండి సేవ చేస్తున్న తనకు గుర్తింపు లేకపోవడంతో పాటుగా.. అనేక అవమానాలు ఎదుర్కోన్నాని బోసు  ఆవేదన

12:20PM, Apr 18th, 2024
విశాఖపట్నం:
మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్‌..

  • సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు
  • చెప్పిన మాటమీద నిలబడటం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారు
  • విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు
  • రేపు గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది..
  • సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి
  • చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్ర ను పట్టించుకోలేదు
  • టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు

12:10PM, Apr 18th, 2024
కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్..

  • వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండకూడదు.. ఆయనది చీప్ క్యారెక్టర్
  • కోవూరులో నన్ను ఓడించేందుకు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నాడు
  • వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారు.. ఆయన బాగోతం అంతా నా దగ్గర ఉంది
  • ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో మరోసారి నామినేషన్ వేశా
  • కోవూరు నియోజకవర్గము నల్లపురెడ్డి కుటుంబానికి అడ్డా.. కోవూరు ప్రజలు మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారు
  • ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గడపగడపకి వెళ్లాయి
  • రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నా

12:00PM, Apr 18th, 2024
తండ్రిని అడ్డం పెట్టుకుని లోకేష్ మంత్రి కాలేదా?: దేవినేని అవినాష్ కామెంట్స్

  • స్కూల్స్ రూపు రేఖలు మార్చిన జగన్ ప్రభుత్వం 
  • రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్ ప్రభుత్వమే గుర్తుకు వస్తోంది
  • ప్రజలను మభ్య పెట్టి కాలం గడుపుతున్న స్థానిక టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
  • ఏ ఇంటి తలుపు తట్టిన ఏది ఒక పథకం వచ్చింది అని ప్రతి మహిళ అంటున్నారు
  • జూన్ 4 తరువాత రామరాజ్యం తలపించే జగన్ పాలన ప్రారంభమవుతుంది
  • ప్రజలు కోరు కుంటున్నది జగన్ ప్రభుత్వమే 
  • రామాయణంలో రాముడు ఒక్కడే ఒకవైపు రావణ సమూహం ఒకవైపు ఉన్నాయి 
  • అదే చందంగా జగన్ ఒక్కడు ఒకవైపు రాక్షస కూటమీ ఒక వైపు నిలిచింది
  • ఒక సీఎం కొడుకుగా గత ఎన్నికలలో లోకేష్ ఓడిపోలేదా
  • పవన్ కళ్యాణ్ది వారసత్వం రాజకీయం కాదా
  • చిరంజీవి లేక పవన్ కల్యాణ్‌కు సినీ జీవితం, రాజకీయ జీవితం ఎక్కడది
  • వారసత్వ రాజకీయం గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
  • మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవటానికి సిద్ధంగా వుండాలి
  • పవన్ రాజకీయ జీవితం నాశనం చేసేది చంద్రబాబు
  • నిత్యం ప్రజల్లో వుండే వ్యక్తులకు ప్రజలు ఎప్పుడూ అండగా వుంటారు

బీసీ నేత లాకా వెంగళరావు యాదవ్ పాయింట్స్

  • గతం లో  ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు జగన్ అందించారు 
  • ఆరోగ్య శ్రీతో అనేక మందికి పేదలకి ఆరోగ్యం అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది 
  • 14 సీఎంగా చేసి ప్రజలకు ఉపయోగ పడే ఏ మేలు చేశారో.. చంద్రబాబు చెప్పాలి
  • ఎవరు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారో ప్రజలు కూడా ఆలోచించాలి
  • రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 100 స్థానాలు కేటాయించిన జగన్
  • వైఎస్ఆర్సీపీ అంటే పేదల పార్టీ

11:45AM, Apr 18th, 2024 
ఢిల్లీ:
సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

  • కేసు విచారణ జూలై 24 చివరికి వాయిదా
  • ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని కోరిన తెలంగాణ తరఫున న్యాయవాది
  • సెలవుల తర్వాత విచారణ జరపాలనుకొని చంద్రబాబు తరఫు న్యాయవాది
  • ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని పిటిషన్
  • చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావించిన ఏసీబి
  • అయినా చంద్రబాబు నాయుడు పేరు నిందితుడిగా తెలంగాణ ఎసిబి చేర్చకపోవడాన్ని  ప్రశ్నిస్తూ పిటిషన్ 
  • పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి  
  • విచారణ జరిపిన జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 
  • 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు 
  • ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ ఏసిబి 
  • ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన  చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో  బయటపెట్టిన ఏసిబి
  • "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్

11:30AM, Apr 18th, 2024 
నెల్లూరు
గందరగోళం సృష్టించాలని టీడీపీ నేతల కుట్రలు

  • కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..
  • -నామినేషన్ సందర్భంగా గందరగోళం సృష్టించాలని తెలుగుదేశం పార్టీ నేతల కుట్రలు.. లోపలకీ అనుమతి ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వివాదం 
  • టిడిపి కార్యకర్తలని చెదరగొట్టిన పోలీసులు.. 
  • -వేమిరెడ్డి  ప్రభాకర్ వందల కోట్లు ఖర్చుపెట్టి కోవూరులో గెలవాలని చూస్తున్నాడు.. సీఎం జగన్ బొమ్మతో ప్రజల్లోకి వెళ్తున్న తనను.. ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే ప్రసన్న ధీమా..

11:10AM, Apr 18th, 2024 
చిత్తూరు
పుంగనూరులో టిడిపికి భారీ షాక్

  • టిడిపి నుంచి వైయస్ఆర్సీపీ లోకి భారీగా వలసలు
  • టిడిపి నేత కృష్ణమూర్తి తో పాటు ఆయన భార్య మాజీ కౌన్సిలర్ లక్ష్మి తో పాటు మరో 100 కుటుంబాలు మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
  • కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పెద్దిరెడ్డి

11:00AM, Apr 18th, 2024 
ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది

  • ఉదయం 11  గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన
  • నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు

10:30AM, Apr 18th, 2024 
విజయవాడ
దేవాలయాలని కూల్చి వేసిన దుర్మార్గుడు చంద్రబాబు: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

  • రామతీర్థం, అంతర్వేది పూర్వవైపు తేచ్చింది సీఎం జగన్నే
  • చంద్రబాబు బూట్లు వేసుకొని పూజ చేసే వ్యక్తి
  • రూ. 70 కోట్ల నిధులతో బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయని అభివృద్ధి చేసింది సీఎం జగన్
  • శ్రీరామనవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు
  •  సీఎం జగన్పై దాడిపట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారు
  • బోండా ఉమా మాటల్లోనే అర్థమవుతుంది సీఎం జగన్పై దాడి చేసింది ఎవరో..?
  • బోండా ఉమకి బుద్ధి జ్ఞానం లేదు
  • ఎవరైనా కంటిమీద దాడి చేయించుకుంటారా..?
  • బోండా ఉమా ఓడిపోతారని తెలుసు
  • భూ కబ్జాలు, రౌడీయిజం, చేస్తారని ప్రజలందరికీ తెలుసు
  • సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అయిందని బోండా ఉమ సునకానందం పొందాడు
  • పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేస్తుంటే బోండా ఉమ ఎందుకు పారిపోతున్నాడు
  • తప్పు నువ్వు చేసావు కాబట్టే భయపడుతున్నావ్
  • రాష్ట్రంలోని చేతులన్నీ బొండా ఉమా వైపే చూపెడుతున్నాయి
  • బొండా మామ టీ షర్టులు వేసుకుని మారువేషంలో తిరుగుతున్నాడు
  • తప్పు చేశాడు కాబట్టే మారువేషణలో తిరుగుతున్నాడు
  • సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది అని ఆయన చెప్తున్నాడు

ఎంపీ కేశినేని నాని కామెంట్స్

  • బొండా ఉమా వారిద్దరు కుమారులు రౌడీయిజం, గుండాయిజానికి పాల్పడుతున్నారు
  • బోండా ఉమ బుడమేరును ఆక్రమించి భూకబ్జాలు చేశాడు
  • కీచకుడు, కాలకేయుడు బోండా ఉమ
  • సీఎం జగన్ తలకు వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నుకు దాడికి పాల్పడటం దారుణమైన విషయం
  • బోండా ఉమాకి దాడి చేయించిన విషయం తెలుసు
  • చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రుడు బోండా ఉమా
  • నిన్న బోండా ఉమ మా వాళ్లే కొట్టారు అన్న క్యాంటీన్ తీసినందుకానీ అనలేదా..?
  • బోండా ఉమా రెండు రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చాడు
  • ఏబీఎన్ ఛానల్లో బోండా ఉమా క్లియర్‌గా చెప్పాడు  దాడి చేసామని
  • చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాడు

10:00AM, Apr 18th, 2024 
ప్రకాశం జిల్లా
నేడు నామినేషన్ వేయనున్న దర్శి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కామెంట్స్

  • వైఎస్సార్‌సీపీకి  జనంలో అనూహ్య స్పందన ఉంది
  • ముఖ్యమంత్రి  జగన్‌ను మళ్లీ సీఎంని చేసుకుంటాం అని జనం ముక్తకంఠంతో చెబుతున్నారు
  • దర్శిలో నా గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు
  • దర్శిలో అత్యధిక మెజారిటీతో నేను గెలవడం ఖాయం

9:30AM, Apr 18th, 2024 
ఏపీలో మళ్లీ ఎగరబోతున్న వైఎస్సార్‌సీపీ జెండా!

  • ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లని వైఎస్సార్‌సీపీ గెలవబోతున్నట్లు తేల్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ పోల్ స్కాన్ సర్వే
  • టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకుని వచ్చినా.. సింగిల్‌గానే 52.6 శాతం ఓటు షేర్‌ని వైఎస్సార్‌సీపీ కొల్లగొట్టబోతున్నట్లు తేల్చేసిన సర్వే
  • మళ్లీ గెలిచేది జగనే

9:00AM, Apr 18th, 2024 
నామినేషన్ల పర్వం..

  • ఉదయం 11  గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక
  • శ్రీశైలం వైఎ‍స్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న చక్రపాణిరెడ్డి
  • ఎమ్మిగనూరు వైఎ‍స్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న  బుట్టా రేణుక
  • మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న  లోకేష్‌
  • చిత్తూరు వైఎ‍స్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న  విజయానందరెడ్డి
  • దర్శి వైఎ‍స్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న శివ ప్రసాద్‌రెడ్డి

08:45AM, Apr 18th, 2024
అనంతపురం:

కళ్యాణదుర్గంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు 

  • వైఎస్సార్‌సీపీ ప్రచార రథంపై దాడి 
  • అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను విచక్షణా రహితంగా కొట్టిన టీడీపీ నేతలు 
  • కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో ఘటన
  • టీడీపీ నేతల గూండా గిరిపై కళ్యాణదుర్గం లో భయాందోళనలు

08:30AM, Apr 18th, 2024
తణుకు

వైఎస్సార్‌సీపీలో చేరిన రాజోలు జనసేన ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావు

  • సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ చేరిన బొంతు రాజేశ్వరరావు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్

08:10AM, Apr 18th, 2024
ఢిల్లీ:

నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

  • ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలని , దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని పిటిషన్
  • చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావించిన ఏసీబి
  • అయినా చంద్రబాబు నాయుడు పేరు నిందితుడిగా తెలంగాణ ఎసిబి చేర్చకపోవడాన్ని  ప్రశ్నిస్తూ పిటిషన్ 
  • పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి  
  • విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 
  • 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు 
  • ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ ఏసిబి 
  • ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన  చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో  బయటపెట్టిన ఏసిబి
  • "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్

07:50AM, Apr 18th, 2024
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
రాజోలులో  జనసేనకు షాక్

  • జనసేన పార్టీ కి రాజీనామా చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ బొంతు రాజేశ్వరరావు
  •  రాజేశ్వరరావు తోపాటు రాజీనామా చేసిన జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు
  • ఇవాళ తణుకులో‌ సీఎం‌ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్న బొంతు రాజేశ్వరరావు

07:40AM, Apr 18th, 2024
పార్వతీపురం మన్యం

బీజేపీ అరకు పార్లమెంట్ టికెట్ ఆశావహుడు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ను పార్టీ నుండి తొలగించిన బీజేపీ

  • అరకు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎస్టీ కుల ధ్రువీకరణ ను ప్రశ్నించినందుకు వేటు వేసిన రాష్ట్ర పార్టీ
  • ఇండిపెండెంట్గా పోటీకి సిద్దపడుతున్న జయరాజ్

07:30AM, Apr 18th, 2024
చెప్పిన మాట తప్పితే నాయకుడు ఎలా అవుతారు?

07:15AM, Apr 18th, 2024
పచ్చవన్నె మేధావులు

  • సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ముసుగులో చంద్రబాబుకుకొందరు రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ల ఊడిగం
  • వారికున్నది రాష్ట్రంపై ప్రేమ కాదు.. సీఎం జగన్‌పై కక్ష
  • ముఖ్యమంత్రిపై బురద జల్లడమే వారి ఎజెండా
  • సర్వీసులో ఉన్నప్పుడే చంద్రబాబు కోసం పరితపించిన ‘నిమ్మగడ్డ’
  • చట్ట పరిధిని దాటి స్థానిక ఎన్నికల్లో టీడీపీకి గులాంగిరి
  • సీబీఐ డైరెక్టర్‌గా పనికిరాడని సుప్రీంకోర్టు తేల్చిన వ్యక్తి నాగేశ్వరరావు
  • సర్వీసు పొడిగించలేదనే అక్కసుతో విషం కక్కుతున్న మరో మేధావి పీవీ రమేష్‌
  • ఇప్పుడు వీళ్లంతా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షకుల అవతారం
  • సొంత ప్రయోజనాలు, రాజకీయ ఎజెండాతో ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు

07:00AM, Apr 18th, 2024
బాబు నుంచి షర్మిలకు రూ. 60 కోట్లు

  • చంద్రబాబు ఫైనాన్స్‌ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది?
  • చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రధారులు
  • వైఎస్‌ వివేకా హత్య కేసులో రాజకీయ కోణం లేదు.. మరో సంబంధం ఉంది
  • సునీత, రాజశేఖర్‌ రెడ్డికి నార్కో అనాలసిస్‌ టెస్టులు చేయాలి
  • వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార  ప్రతినిధి ఆర్‌. రమేష్‌కుమార్‌రెడ్డి

06:40AM, Apr 18th, 2024
నేటి నుంచి నామినేషన్ల పర్వం 

  • రాష్ట్రంలో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్‌  
  • ఏప్రిల్‌ 25 వరకు నామినేషన్ల స్వీకరణ.. 26న పరిశీలన 
  • 29 వరకు ఉపసంహరణకు చాన్స్‌ 
  • ఉ.11 నుంచి మ.3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం 
  • ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు 
  • గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి కి ఒకరు, స్వతంత్ర అభ్యర్థికి పదిమంది ఓటర్లు ప్రతిపాదించాలి 
  • ఎంపీ అభ్యర్థి నామినేషన్‌ రుసుం రూ.25,000.. ఎమ్మెల్యేకు రూ.10,000 
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ.. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి 
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా వెల్లడి 
     

06:30AM, Apr 18th, 2024
వ్యూహకర్తలు హ్యాండ్సప్‌.. జారిన జాకీలు!

  • విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్‌ శర్మ బృందం 
  • జనసేన, బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు 
  • మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు 
  • సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాబిన్‌ నిర్వేదం.. సర్వేలు, స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా సీట్లిచ్చారు 
  • పార్టీ కోసం పని చేసిన వారిని పక్కనపెట్టి.. ధనవంతులకే సీట్లు 
  • క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించినా పట్టించుకోనప్పుడు మేమెందుకు? 
  • తమ ప్రయత్నాలు అంతా వృథా అయ్యాయని ఆక్రోశం 
  • రాబిన్‌ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు 
  • పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్‌ బృందం  

06:20AM, Apr 18th, 2024
అవినీతి జీవి

  • రూ.వందల కోట్లు కైంకర్యం  
  • వందలాది ఎకరాలభూముల ఆక్రమణ 
  • నకిలీ ఎరువులతో రైతులను నట్టేట ముంచిన వైనం 
  • రేషన్, ఇసుక, అక్రమ మద్యం మాటున అక్రమార్జన 
  • ఉపాధి హామీ, నీరు చెట్టు, సీసీరోడ్ల పేరుతో ప్రజాధనం లూటీ 
  • మరుగుదొడ్ల బిల్లుల్లోభారీగా చేతివాటం  
  • అభివృద్ధి పనుల్లోనూ మాయాజాలం 
  • వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు అవినీతి చిట్టా 

06:10AM, Apr 18th, 2024
నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్‌–4

  • అమరావతిని ముక్కలు చేసి పంచుకున్న చంద్రబాబు అండ్‌ కో 
  • లింగమనేని కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో భారీ మార్పులు  
  • ఆ భూముల విలువ రూ.2 వేల కోట్లకు పైగా చేరేలా పన్నాగం..
  • ప్రతిగా క్విడ్‌ ప్రోకోలో హెరిటేజ్‌కు భూములు, బాబుకు కరకట్ట బంగ్లా 
  • నారాయణ విద్యా సంస్థల కోసం అష్టవంకర్లుగా రింగ్‌ రోడ్డు.. పవన్‌ కల్యాణ్‌కూ లాభం చేకూరుస్తూ అమరావతిలో ప్యాకేజీ 


06:00AM, Apr 18th, 2024
కూటమి బలం 'నీటి బుడగే'!

  • బస్సు యాత్రలో అడుగడుగునా సీఎం జగన్‌కు జన నీరాజనం 
  • ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉప్పొంగిన అభిమాన సంద్రం 
  • వారధిపై పాదయాత్ర నాటి ప్రభంజనాన్ని తలపించిన బస్సు యాత్ర 
  • మండుటెండైనా.. అర్ధరాత్రయినా రోడ్‌ షోలకు పోటెత్తుతున్న జన సంద్రం 
  • విజయవాడలో 4.30 గంటలపాటు జైత్రయాత్రలా సాగిన రోడ్‌ షో 
  • తామెన్నడూ ఈ ప్రజా స్పందనను చూడలేదంటోన్న ఉద్యోగ, వ్యాపార వర్గాలు 
  • తాము పుంజుకున్నామనే చోట బస్సు యాత్ర సక్సెస్‌తో టీడీపీలో నైరాశ్యం 
  • తమది బలుపు కాదు వాపే అంటున్న టీడీపీ సీనియర్‌ నేతలు 
  • తొలిసారి ఓటేయబోతున్న 18–21 ఏళ్ల విద్యార్థులంతా జగన్‌ వెంటే.. 
  • మళ్లీ రాబోయేది వైఎస్సార్‌సీపీ సునామీయేనంటున్న రాజకీయ విశ్లేషకులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement