April 19th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On April 19th In Telugu - Sakshi
Sakshi News home page

April 19th AP Election News Updates: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Published Fri, Apr 19 2024 7:09 AM | Last Updated on Fri, Apr 19 2024 9:09 PM

AP Elections 2024: Political News In Telugu On April 19th Updates - Sakshi

April 19th AP Elections 2024 News Political Updates..

08:50 PM, Apr 19th, 2024

షర్మిలకు ఈసీ నోటీసులు

  •  వైఎస్‌ వివేకా హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలకు ఈసీ నోటీసులు
  •  వివేకా హత్య కేసులో పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న షర్మిల
  • అవినాష్‌రెడ్డి, మల్లాది విష్ణు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు నోటీసులు
  •  48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న  ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా
  • 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే విచక్షణాధికారంతో చర్యలు తీసుకుంటామని స్పష్టం

05:20 PM, Apr 19th, 2024

కాకినాడు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ ప్రసంగం.. ముఖ్యంశాలు

  • ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి.
  • ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్‌ నగరా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు
  • ఇంటింట ఆత్మగౌరవాన్ని,  పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని  కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా?

  • జన్మభూమి ‍కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్‌ జరుగుతోంది
  • ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్‌ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుంది
  • ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా?
  • ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలు
  • వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్‌ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుంది
  • జగన్‌కు ఓటేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి
  • లేదంటే బాబు మార్క్‌తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి
  • ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర

  • మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడు
  • జగన్‌కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్‌ మార్క్‌ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయి
  • లేదంటే.. బాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది
  • ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్‌ అందుతుంది. అదే సమయంలో పెన్షన్‌ అందిస్తున్న జగన్‌ మార్క్‌ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది.
  • ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశాం
  • ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగింది.
  • లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్‌ ముగింపు ఉంటుంది
  • మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుంది
  • పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ
  • మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడు
  • ఫ్యాన్‌కు ఓటేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయి
  • లేదంటే.. బాబు మార్క్‌తో ముగింపు పడుతుంది.

  • ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. ఉచిత పంటల బీమా.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే రుణాలు, ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ
  • ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేస్తేనే.. రైతన్నకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌
  • ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. దళారిలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటలు కొనుగోలు అన్నది జరుగుతుంది
  • ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేస్తేనే అనేది గుర్తుపెట్టుకోండి
  • లేదంటే.. చంద్రబాబు మార్క్‌తో ముగింపు
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్‌ బడుల్లో రూపు రేఖలు మార్చే నాడు-నాడు
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్స్‌ బోధన, మూడో తరగతి నుంచే బైజూస్‌ కంటెంట్‌
  • ఆరో తరగతికి వచ్చేసరికి డిజిటల్‌ బోధన,  ఐఎఫ్‌బీ ప్యానల్స్‌,
  • ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్‌
  • ఇక పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • దీనిలో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన
  • డిగ్రీ చదువుతున్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువుల్లో సర్టిఫైడ్‌  ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ద్వారా విదేశాల్లో అతి ఉన్నత విద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం
  • తొలిసారి డిగ్రీలో మ్యాండెటరీ ఇంటెర్న్‌షిప్‌
  • ఇవన్నీ కొనసాగి మీ పిల్లలు ఎదగాలంటే.. మీ బిడ్డ వైఎస్‌ జగన్‌ 10 ఏళ్లు ఇదే స్థానంలో ఉంటే జగన్‌ మార్క్‌ విప్లవాలు కొనసాగుతాయి.

05:00 PM, Apr 19th, 2024

పుట్టపర్తి సొమ్ములు ఎక్కడికి పోయాయంటే.?

  • మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
  • కిరణ్ కుమార్ రెడ్డి దోపిడీ దొంగ 
  • పుట్టపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు వేల కోట్లు దోచుకున్నాడు 
  • సాయిబాబా మరణ వార్తను వారంపాటు ప్లాన్ ప్రకారం బయట పెట్టలేదు 
  • అదే సమయంలో నగదు, బంగారం ట్రక్కుల ద్వారా తరలించాడు 
  • చిదంబరానికి డబ్బు సంచులు ఇచ్చి సీఎం పదవి తెచ్చుకున్నాడు 
  • అప్పుడే రాష్ట్ర విభజనకు కుట్ర జరిగింది

04:50 PM, Apr 19th, 2024

మంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే

  • దౌర్జన్యాలు,అరాచకాలకు పాల్పడేలా టిడిపి నేతలను ప్రోత్సహిస్తున్న లోకేష్.
  • మేకా వెంకటరెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు.
  • ఓటమి భయంతోనే లోకేష్ ఈ చర్యలకు పాల్పడుతున్నారు.
  • ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకుని బాధ్యులను శిక్షించి బ్రెయిన్ డెడ్ అయిన వెంకటరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలి.

-వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల డిమాండ్‌


 

04:40 PM, Apr 19th, 2024

కృష్ణాజిల్లా: 

25 సంవత్సరాలు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంటుంది: జోగి రమేష్

  • వచ్చే 23 రోజులు కీలకం.
  • 25 సంవత్సరాలు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంటుంది
  • చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడం లేదు
  • ఎమ్మెల్యే అయితే చాలనుకుంటున్నాడు.
  • అన్ని సర్వేలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నాయి
  • బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతుంది.
  • 25న సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మేనిఫెస్టో ప్రకటిస్తాం

03:50 PM, Apr 19th, 2024

లోకేష్‌ను అరెస్టు చేయాలి: ఎమ్మెల్యే ఆర్కే

  • తెలుగుదేశం కార్యకర్తల దాడిలో గాయపడి బ్రెయిన్ డెత్ అయిన మేకా వెంకట రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు
  • నారా లోకేష్ ఓటమి భయంతోనే మంగళగిరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నాడు.
  • మేకా వెంకట్ రెడ్డిని అత్యంత దారుణంగా బైక్ తో గుద్దారు.
  • తెలుగుదేశం కార్యకర్తల దాడిలో గాయపడిన మేకా వెంకట్ రెడ్డి కు బ్రెయిన్ డెత్ అయిందని వైద్యులు చెప్తున్నారు.
  • కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని వైద్యులు చెప్తున్నారు.
  • 15 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనం పైన తెలుగుదేశం నాయకులు దాడి చేశారు.
  • లోకేష్‌కే ఈ దాడులు చేయిస్తున్నాడు.
  • వెంటనే లోకేష్‌ను అరెస్టు చేయాలి.
  • తెలుగుదేశం కార్యకర్తల దాడిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.

మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ కామెంట్స్.

  • తెలుగుదేశం నాయకుల దాడి హేయమైన చర్య.
  • ప్రజాస్వామ్యంలో ఎలాంటి దాడులకు చోటు లేదు.
  • మంగళగిరిలో తెలుగుదేశం నాయకులు భయపెట్టి ఎన్నికలు చేయాలనుకుంటే కుదరదు.
  • తెలుగుదేశం కార్యకర్తల దాడిలో మేక వెంకట్ రెడ్డికి బ్రెయిన్ డెత్ అయింది.
  • ఇప్పుడు ఆ  కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు.

03:15 PM, Apr 19th, 2024

ఏపీ అప్పులపై చంద్రబాబు, రామోజీరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు:  కొండా రాజీవ్‌, వైఎస్సార్‌ అధికార ప్రతినిధి

  • సీఎం జగన్ హయాంలో రూ. 2.68 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశారు
  • రాష్ట్రం మొత్తం అప్పు రూ. 7 లక్షల కోట్లు
  • కానీ చంద్రబాబు, రామోజీరావు రూ. 12 లక్షల కోట్లు అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
  • చంద్రబాబు హయాంలో జి ఎస్ డి పి వృద్ధి 5.44 శాతం తో 22 వ స్థానంలో ఉంచాడు
  • సీఎం జగన్ హయాంలో  18.4 శాతం జీఎస్‌డీపీ  వృద్ధి సాధించాం
  • ఈ రాష్ట్రంలో 16 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చెప్పింది
  • తలసరి ఆదాయం పెరిగి.మన ర్యాంక్ 9 వస్థానానికి పెరిగింది
  • నిరుద్యోగ శాతం తగ్గిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి
  • 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క పోర్టు,.ఒక్క మెడికల్ కాలేజి కట్టలేదు సిగ్గులేదా..?
  • గుజరాత్ కంటే ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి
  • చంద్రబాబు, పచ్చ మీడియా ఎన్ని తప్పుడు కథనాలు రాసినా ప్రజలు సీఎం జగన్‌కే మళ్ళీ పట్టం కడతారు

02:19 PM, Apr 19th, 2024
నిరాడంబరంగా ఉండటం నా నైజం: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

  • నిరాడంబరంగా కడప పార్లమెంట్ స్దానానికి నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి
  • అందుకే నామినేషన్ నిరాడంబరంగా దాఖలు వేశాను
  • ఈ ఎన్నికల్లో భగవంతుడి అశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్దిస్తున్నా  
  • ప్రజల అశీస్సులు కూడా మెండుగా ఉండాలని కొరుతున్నా
  • ఈ ఐదేళ్లు జిల్లా అభివృద్ది విషయంలో వెనకపడకుండా చూశాం
  • పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాం
  • బద్వేలులో సెంచూరీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 1200 మంది పని చేస్తున్నారు
  • కొప్పర్తిలోను పలు పరిశ్రమలొచ్చాయి
  • కొప్పర్తిలో లక్ష మందికి ఉపాధి కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం
  • పులివెందులలోను అదిత్య బిర్లా వంటి పరిశ్రమలను ఏర్పాటు చేశాం
  • గండికోటలో 27 టీసీఎంల నీరు నింపగలిగాం 
  • గండికోటలో నీరు నిలువ చేయడం వల్లే ఇంతటి కరవు సమయంలోను దాహర్తిని తీర్చగలిగాం
  • ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది జరుగుతోంది
  • కోవిడ్ ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగాయి
  • ఈ ఐదేళ్ల కాలంలో పార్లమెంట్‌లో అనేక అంశాలు ప్రస్తావించాను
  • ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను
  • కృష్ణా జలాల రీ అలకేషన్ కు సంబంధించి ప్రస్తావించాను
  • కడప ఎయిర్ పొర్టు టర్మినల్ అభివృద్దికి కృషి చేశా
  • కడప-బెంగుళురు రైల్వే లైన్‌కు రాష్టం నుంచి ఇవ్వాల్సిన వాట ఇవ్వలేమని గత టీడీపీ ప్రభుత్వం లేఖ రాసింది
  • కర్ణాటకలోను భూసేకరణ ఉండటం వల్ల అలస్యమవుతోంది
  • ఫీజు బుల్టి సాధ్యపడితే కడప-బెంగుళూరు ప్రయాణం కల సాకారం అవుతుంది

01:56 PM, Apr 19th, 2024
తణుకులో టీడీపీ, జనసేన నేతల ఓవరాక్షన్‌

  • నామినేషన్‌ దాఖలుకు అభ్యర్థితో పాటు నలుగురికి అనుమతి
  • బారికేడ్‌లు తోసుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం
  • పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలు

01:38 PM, Apr 19th, 2024
రాజానగరం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా  నామినేషన్ 

  • రాజానగరం నియోజకవర్గంలో గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం
  • కరోనా సమయంలో ప్రజలకు విస్తృతంగా సహాయం అందించాం 
  • రానున్న రోజుల్లో ఉపాధి పరిశ్రమలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తాం
  • ఐదేళ్లుగా నిరంతరం ప్రజల్లోనే ఉన్నాము
  • మందగా వచ్చే ప్రతిపక్షాలను ప్రజలు నమ్మరు 
  • సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర ప్రజలంతా తోడుంటారు 

01:17 PM, Apr 19th, 2024
నగరి ప్రజలు నా వెన్నంటే ఉన్నారు: మంత్రి ఆర్కే రోజా

  • నా కష్టాన్ని గుర్తించిన జగనన్న చెల్లెలుగా భావించి అండగా నిలిచారు: మంత్రి ఆర్కే రోజా
  • నగరి నుంచి గెలిచి అసెంబ్లీ ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలను వినిపించాను
  • నా సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చారు. 
  • 3వ సారి టికెట్ లేదని ప్రచారం చేశారు. సీఎం జగన్ అండతో నామినేషన్ వేశాను
  • నగరి ప్రజలు అండగా నిలిచారు.. నామినేషన్ కాదు విజయోత్సవ  ర్యాలీలా ఈ రోజు ర్యాలీ జరిగింది.
  • 151 సీట్లు ప్రజలు ఇస్తే సంక్షేమం, అభివృద్ధి చేశారు
  • తప్పకుండా హ్యాట్రిక్ కొడతాను
  • 10 వేల మెజారిటీ గెలుస్తా..
  • నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు అండగా ఉంటాను.
  • మూడో సారి నగరిలో హ్యాట్రిక్ విజయం సాధించి అన్నకు గిప్ట్‌గా ఇస్తా
  • నగరి ప్రజలు నా వెన్నంటి ఉన్నారు
  • నగరి లో వెన్నుపోటు రాజకీయాలు చేసే నాయకులకు మే 13 ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
  • సీఎం జగన్‌ సహకారంతో నగరి మరింత అభివృద్ది చేస్తాం

11:34 AM, Apr 19th, 2024
జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విబేధాలు

  • జగ్గయ్యపేట కూటమి అభ్యర్ధి టీడీపీ నేత శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య)కు నిరసనసెగ
  • వత్సవాయి మండలం తాళ్లూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీరామ్ రాజగోపాల్
  • రాజగోపాల్‌ను అడ్డుకున్న టీడీపీ నాయకుడు బొల్లా రామకృష్ణ వర్గం
  • రామకృష్ణ టీడీపీ వ్యక్తి కాదని ఇటీవల వ్యాఖ్యలు చేసిన శ్రీరామ్ రాజగోపాల్
  • బొల్లా రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై తమకు సమాధానం చెప్పాలంటూ శ్రీరామ్ రాజగోపాల్‌ను అడ్డుకున్న రామకృష్ణ వర్గం
  • నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు
  • బొల్లా రామకృష్ణ ఇంటిలోకి పంపించేసిన పోలీసులు
  • ఇంటి లోపల నుంచే ప్లకార్డులతో నిరసన తెలిపిన బొల్లా రామకృష్ణ అనుచరులు
  • శ్రీరామ్ రాజగోపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు
  • ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు

11:23 AM, Apr 19th, 2024
సీఎం జగన్‌పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి

  • సీఎం జగన్‌పై 2 సార్లు ఎటాక్‌ జరిగింది.. 2 సార్లూ చంద్రబాబే చేయించారు
  • మానవత్వం, విలువలు లేని వ్యక్తి చంద్రబాబు

11:14 AM, Apr 19th, 2024
ఆరు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మారే అవకాశం?

  • రఘురామకృష్ణరాజు కోసం ఉండి ఎమ్మెల్యేకి చంద్రబాబు వెన్నుపోటు
  • ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి టికెట్‌ రఘురామకృష్ణరాజుకు దాదాపు ఖరారు
  • తమ ఎంపీ అభ్యర్థులను మార్చేది లేదని చెప్పేసిన బీజేపీ
  • నరసాపురం ఎంపీ సీటును ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన బీజేపీ
  • ఇన్నాళ్లు వాడుకున్న రఘురామకృష్ణరాజుకి ఉండి ఎమ్మెల్యే సీటు ఇస్తున్న చంద్రబాబు
  • ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి చేతులు దులుపుకొనున్న చంద్రబాబు
  • సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లిస్తానని గతంలో చెప్పి యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు
  • అనపర్తి - దెందులూరు మధ్య ఇంకా తేలని పంచాయితీ
  • అనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు సీటు బీజేపీకి ఇచ్చేలా ప్రతిపాదనలు
  • దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌తో అధిష్టానం చర్చలు
  • మాడుగులలో పైలా ప్రసాద్ బదులు బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చే అవకాశం
  • మడకశిర అభ్యర్థి అనిల్ కుమార్‌కు బదులు ఎమ్మెస్ రాజుకు ఇచ్చే ఆలోచన
  • తంబళ్లపల్లె అభ్యర్థి జై చంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సరళా రెడ్డికి ఇచ్చే అవకాశం

11:11 AM, Apr 19th, 2024
విశాఖ వెస్ట్‌: టీడీపీ ఎమ్మెల్యే గణబాబు చీఫ్ ట్రిక్స్

  • గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ నామినేషన్ వేస్తున్నారని గుడి తాళం తీయడంలో జాప్యం
  • ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తీసే ఆలయం తలుపులు ఎనిమిది గంటలకు తెరవని ఆలయ నిర్వాహకులు
  • గుడి తాళం తెరవకపోవడంతో రెండు గంటలుగా ఆలయం బయట ఉన్న భక్తులు
  • ఓటమి భయంతో గణబాబు చీఫ్ పాలి ట్రిక్స్ చేస్తున్నారని భక్తులు ఆగ్రహం
  • గోపాల్‌పట్నం గ్రామానికి చెందిన నూకాంబిక ఆలయాన్ని తన కుటుంబ సభ్యుల ఆధీనంలో వుంచుకున్న గణబాబు

10:42 AM, Apr 19th, 2024
కాకినాడ జిల్లాలో టీడీపీ, జనసేనకు ఎదురు దెబ్బ

  • సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో​ చేరిన జనసేన నేతలు పొలసపల్లి సరోజ, విజయ్ గోపాల్, టీడీపీ నేతలు తోట నాయుడు, ముత్యాల శ్రీనివాస్

10:39 AM, Apr 19th, 2024
వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

  • విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరికలు
  • వైఎస్సార్‌సీపీలోకి నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుకాంత్‌రెడ్డి, జనసేన నేతలు కాటంరెడ్డి జగదీష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌, టీడీపీ నేత చేజర్ల సుబ్బారావు, కాంగ్రెస్‌ నేతలు పంతం నెహ్రూ, ఇందిర

10:13 AM, Apr 19th, 2024
సీఎం జగన్‌ బస్సు యాత్రతో ప్రతిపక్షాల్లో వణుకు: మంత్రి వేణు

  • తూర్పుగోదావరిలో సీఎం జగన్‌ రోడ్ షో అత్యద్భుతంగా జరిగింది 
  • స్వచ్ఛందంగా వేల సంఖ్యలో జనం తరలివచ్చారు
  • ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు సీఎం రాక కోసం ఎదురు చూశారు 
  • సీఎం జగన్ పై తమకున్న ప్రేమాభిమానాలను జనం చూపించారు 
  • సీఎంకు ఉన్న జనాభిమానాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి
  • వారి మీడియాలో అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు 
  • ఎవరేనుకున్నా వైఎస్‌ జగన్‌కు అత్యధిక ప్రజాదరణ రోడ్ షోలో మరోసారి స్పష్టమైంది

09:10 AM, Apr 19th, 2024
అనకాపల్లి: మాడుగుల టీడీపీలో గందరగోళం

  • మాడుగుల టీడీపీ అభ్యర్థి మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం
  • నామినేషన్ వేసేందుకు సిద్దమైన పైల ప్రసాదరావు
  • టికెట్ తనదేనంటున్నబండారు సత్యనారాయణ
  • తగ్గేదే లేదంటూ నేడు నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకున్న పైలా ప్రసాదరావు
  • మాడుగుల టీడీపీ అయోమయం
  • ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో క్యాడర్..

07:46 AM, Apr 19th, 2024
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’మూక హత్యాయత్నం

  • కళ్యాణదుర్గంలో దారుణం
  • మూకుమ్మడి దాడికి దిగిన  టీడీపీ అభ్యర్థి అమిలినేని బంధువులు, బౌన్సర్లు
  • ప్రచార రథం తాళాలు లాక్కుని కవ్వింపు
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కాలువలో పడేసి పిడిగుద్దులు
  • గుండెలపై రాళ్లతో కొట్టి, కాళ్లతో తొక్కి చంపే ప్రయత్నం
  • గాయపడిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థి వాహన డ్రైవర్‌
  • విధుల్లో ఉన్న పట్టణ  సీఐ హరినాథ్‌పైనా చిందులేసిన టీడీపీ నేతలు

07:31 AM, Apr 19th, 2024
గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం

  • 17వ రోజు సీఎం జగన్‌ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని
  • జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు
  • కడియపులంకలో సీఎం వైఎస్‌ జగన్‌పై పూల వర్షం
  • వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు
  • బైక్‌ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం
  • బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు 
  • అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత
  • వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు
  • అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం
  • నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్‌ అభివాదం
     

07:30 AM, Apr 19th, 2024
ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా

  • రాజకీయాలకు అతీతంగా ఎన్నికల నిర్వహణ.. 
  • 12,459 సమస్యాత్మక కేంద్రాల్లో లోపల, బయట కెమెరాలు
  • మొత్తం 30,111 పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌టెలికాస్టింగ్‌
  • ఇప్పటి వరకు రూ.121 కోట్ల విలువైన నగదు, వస్తువుల జప్తు
  • సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తుపై పోలీసు అబ్జర్వర్ల పర్యవేక్షణ
  • ప్రభుత్వ ఉద్యోగులు పాలనాంశాలపై మాట్లాడటం నిబంధనల ఉల్లంఘనే  

07:10 AM, Apr 19th, 2024
బొండా బ్యాచ్‌ స్కెచ్‌.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే..

  • తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక
  • కుట్రదారుల ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు ఏ1 సతీశ్‌
  • పదునైన సిమెంట్‌ కాంక్రీట్‌ రాయితో సీఎంపై దాడి
  • శాస్త్రీయ ఆధారాలతో కుట్రను ఛేదించిన పోలీసులు 
  • ఏ2తోపాటు తెరవెనుక కుట్రదారుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు
  • రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకినిందితులిద్దరూ బొండా ఉమాతో కలసి దిగిన ఫొటోలు వైరల్‌ 

07:07 AM, Apr 19th, 2024
రాష్ట్రానికి మీ కూటమి చేసిన మేలేమిటి? 

  • చంద్రబాబు, పవన్‌ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారు 
  • సీఎం జగన్‌ని మీరు ఎంత మాటైనా అనొచ్చు.. తిరిగి మిమ్మల్ని అంటే ఏడుపులా?  
  • టీడీపీలో ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు మంచోడు, మా పార్టీలో ఉంటే చెడ్డోడా?
  • వాస్తవాలు చెప్పే జగన్‌ కావాలా?.. అబద్ధాల బాబు కావాలా?: పేర్ని నాని 
     

07:05 AM, Apr 19th, 2024
టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే 

  • ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్‌ మీరా 
  • బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో చేటే
  • ముస్లింలకు మేలు చేసింది సీఎం జగనే.. 
  • ఆయనతోనే ముస్లిం సమాజానికి భద్రత, భరోసా
  • ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్‌ మీరా
  • టీడీపీ భుజంపై గన్‌ పెట్టి ముస్లిం సమాజంపైకి గురిపెట్టిన బీజేపీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement