May 20th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Assembly Elections 2024: Political News Updates In Telugu On May 20th, 2024 | Sakshi
Sakshi News home page

May 20th AP Election News Updates: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Mon, May 20 2024 7:21 AM | Last Updated on Mon, May 20 2024 9:07 PM

ap elections 2024 may-20th political updates telugu

May 20th AP Elections 2024 News Political Updates

9:01 PM, May 20th, 2024

తూర్పు గోదావరి జిల్లా :

ఓర్వలేకే టీడీపీ కుట్రలకు, భౌతిక దాడులకు పాల్పడుతుంది: హోంమంత్రి తానేటి వనిత

  • కుట్రలు, భౌతిక దాడులు ఈ కూటమి నేతలు చేస్తున్న తీరు చూస్తుంటే జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అని స్పష్టమవుతోంది.
  • మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కడుపు మంటతో టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారు.
  • ఇటీవల నల్లజర్లలో సైతం స్వయంగా నామీదకు దాడికి పాల్పడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెబుతారు.
  • టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేశారు
  • ప్రజలకు తెలుసు జగనన్న పేదలకు భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని.
  • పోలీసులు వైఎస్సార్‌సీపీకి కొమ్ముకాశారు అనడం అవాస్తవం.
  • అలాగైతే ఇటీవల స్వయంగా నామీద జరిగిన దాడికి పోలీసులు ఏం చేశారో చెప్పాలి.
  • టీడీపీ, జనసేన నేతలు కలసి అధికార దాహంతో  వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు.
     

4:41 PM, May 20th, 2024

మంగళగిరి:

సిట్‌ చీఫ్‌  వినీత్ బ్రిజ్ లాల్‌ని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేతలు

పోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై సిట్  చీఫ్‌ని కలిశాం:  అంబటి రాంబాబు

  • టీడీపీతో కొందరు పోలీస్ అధికారులు కుమ్మక్కై అయ్యారనే దానిపై ఇసి ఆదేశాలతో బయటపడింది
  • ఈసి ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ని కలిసి ఫిర్యాదు చేశాం
  • హింసాత్మక ఘటనలలో కొందరు ఐపిఎస్ అధికారుల పాత్ర కూడా ఉంది
  • ఎన్నికల సమయంలో అధికారులని మార్చడం సహజం
  • కానీ ఎపిలో జరిగిన బదిలీలలో పురందేశ్వరి లేఖ ఆధారంగానే జరిగింది
  • అధికారులని మార్చిన చోటే హింసాత్మక ఘటనలు జరిగి అధికారులు సస్పెండ్లు జరిగాయి
  • అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలలో ఎస్పీలని పురందేశ్వరి ఫిర్యాదు ఆధారంగా మార్చిన చోటే హింస జరిగింది... అక్కడే సస్పెన్షన్లు జరిగాయి
  • ఇద్దరు ఐపిఎస్‌లని సస్పెండ్ చేశారంటే పోలీసుల పాత్ర అర్ధమవుతుంది
  • పోలీసు శాఖ  టీడీపీతో పూర్తిగా కుమ్మక్కైంది
  • ఇది చాలా దురదృష్టకరమైన పరిస్ధితి
  • పోలీస్ యంత్రాంగం బాద్యత వహించాలి
  • వైఎస్సార్ సిపి ఇచ్చిన ఫిర్యాదులని కనీసం ఎన్నికల సమయంలో తీసుకోలేదు
  • వైఎస్సార్ పై తప్పుడు సెక్షన్లు, కేసులని నమోదు చేయాలని చూస్తున్నారు
  • తప్పుడు కేసులని నివారించాలని కోరాం
  • పోలీస్ అధికారుల కాల్ డేటాని పరిశీలించాలని కోరాం
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిట్ ఛీఫ్ ని కోరాం
  • దేశంలోనే పోలీస్ అధికారులు టిడిఇతో కుమ్మక్కు కావడం చాలా సీరియస్ అయిన‌ విషయం
  • వినీత్ బ్రిజ్ లాల్ మంచి సమర్ధవంతమైన అధికారి అని నమ్ముతున్నాం
  • .నాగరిక సమాజంలో ఈ తరహా సంఘటనలు జరగకూడదు
  • పెద్దారెడ్డి ఇంటికి వెళ్లి సిసి కెమారాలు ద్వంసం చేసి టీడీపీ జెండాలు ఎగురవేయడం ఏమిటి
  • అధికారుల మార్పు వల్ల టీడీపీకి మేలు జరుగుతుందనే ఇలా చేశారు
     

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి కుట్రలు చేసింది: జోగి రమేష్

  • హింసాత్మక సంఘటనలు ప్రేరేపించడానికి కూటమే కారణం
  • కలెక్టర్లు, ఎస్పీలు మార్చిన చోటే పెద్ద ఎత్తున‌ హింసాత్మక సంఘటనలు జరిగాయి
  • ప్రజాస్వామ్యంలో హింసని ప్రేరేపించింది చంద్రబాబే
  • మళ్లీ సిఎంగా వైఎస్ జగన్ వస్తారు
  • ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయి
  • పూర్తి స్ధాయిలో విచారణ జరిపి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి
     

ఎస్సీ, ఎస్టీ, బిసిలు వైఎస్ జగన్‌కి అండగా ఉన్నారనే కక్షతో హింసకి పాల్పడ్డారు: రావెల‌ కిషోర్‌బాబు

  • చాలా గ్రామాలలో ఎస్సీ, బిసీలు ఊళ్లకి ఊళ్లే ఖాళీ అవుతున్నాయి.
  • టీడీపీ పై చర్యలు తీసుకోవాలి
  • గ్రామాలలో సాధారణ పరిస్ధితులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి
  • ఘటనలకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
  • ప్రజాస్చామ్యాన్ని పునరుద్దించాలి
     

3:41 PM, May 20th, 2024

విజయవాడ

ఢీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ప్రాధమిక‌ నివేదిక అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్

  • ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఈసి ఆదేశాల మేరకు సిట్ విచారణ
  • రెండు రోజుల పాటు నాలుగు బృందాలగా క్షేత్ర స్ధాయిలో పర్యటన
  • పల్నాడు, తిరుపతి, అనంతపురం‌ జిల్లాలలో పర్యటించిన సిట్ బృందాలు
  • హింసాత్మక ఘటనలకి కారణాలు విశ్లేషిస్తూ ప్రాధమిక నివేదిక
  • 150 పేజీల ప్రాధమిక నివేదిక డిజిపికి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్

     

2:20 PM, May 0th, 2024
ఏపీలో కొత్త పోలీస్‌ అధికారుల నియామకం

  • ఈసీ సస్పెండ్‌ చేసిన అధికారుల  అధికారుల స్థానంలో కొత్తవాళ్ల నియామకం
  •  నరసరావుపేట డీఎస్పీ గా - ఎం.సుధాకర్ రావు 
  • గురజాల డీఎస్పీగా - సీహెచ్ శ్రీనివాసరావు 
  • తిరుపతి డీఎస్పీగా - రవి మనోహరచారి 
  • తిరుపతి ఎస్ బీ డీఎస్పీగా - ఎం.వెంకటాద్రి 
  • తాడిపత్రి డీఎస్పీగా - జనార్దన్ నాయుడు నియామకం
  • పల్నాడు DSB - I  సీఐగా-  సురేష్ బాబు 
  • పల్నాడు DSB - II సీఐగా - U. శోభన్ బాబు 
  • కారంపూడి ఎస్సై గా - కె.అమీర్ 
  • నాగార్జున సాగర్ ఎస్సై గా - ఎం.పట్టాభి

 

2:06 PM, May 20th, 2024
కాసేపట్లో డీజీపీకి సిట్‌ నివేదిక

  • ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాధమిక నివేదిక సిద్దం
  • ఉదయం నుంచి డిజిపి ప్రధాన కార్యాలయంలోనే కూర్చుని ప్రాధమిక నివేదిక సిద్దం చేస్తున్న ఐజీ వినీత్ బ్రిజ్ లాల్
  • మరికాసేపట్లో డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి సిట్ ప్రాధమిక‌ నివెదిక
  • సిట్ ప్రాధమిక నివేదికపై తీవ్ర ఉత్కంఠ
  • గత రెండు రోజులగా పల్నాడు, అనంతపురం,తిరుపతి జిల్లాలలో సిట్ బృందాలు క్షేత్రస్ధాయి పర్యటన
  • 33 ఎఫ్ఐఆర్ లు, సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలన
  • ఘటనలు జరిగిన గ్రామాలు సందర్శన

1:32 PM, May 20th, 2024
చింతమనేని ఎక్కడ?

  • పరారీలో దెందులూరు కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌
  • పోలింగ్‌ టైంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌ 
  • పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పీఎస్‌పై చింతమనేని దాడి
  • సినీ ఫక్కీలో దాడి చేసి అరెస్టైన వ్యక్తిని విడిపించిన చింతమనేని
  • చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు
  • 16 రాత్రి నుంచే అజ్ఞాతంలోకి.. బెంగళూరు వెళ్లినట్టు ప్రాథమిక సమాచారం
  • ఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసుల గుర్తింపు
  • నూజివీడు డీఎస్పీ పర్యవేక్షణలో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు

12:51 PM, May 20th, 2024
మంగళగిరి

  • పల్నాడు హింసలో బాధితులుగా పలువురు మహిళలు
  • మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన చినగణేషునిపాడు మహిళలు
  • టీడీపీ నేతలు ఎస్సీ, బీసీ మహిళల ఇళ్లపై దాడులు జరపడంతో భయాందోళనకు గురై ఓ గుడిలో రెండ్రోజుల పాటు తలదాచుకున్న మహిళలు
  • పోలీసుల సాయంతో బంధువుల ఇళ్లకు వెళ్లినట్టు మహిళా కమిషన్ కు ఫిర్యాదు
  • తమకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కమిషన్ ను కోరిన మహిళలు
  • సాక్షితో మాట్లాడిన  మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మి
  • పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు: గజ్జల వెంకటలక్ష్మి
  • బాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాFeg: గజ్జల వెంకటలక్ష్మి
  • ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గం: గజ్జల వెంకటలక్ష్మి
  • ప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధం: గజ్జల వెంకటలక్ష్మి
  • మహిళలకు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా..?: గజ్జల వెంకటలక్ష్మి
  • వారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన చంపేస్తారా..?  : గజ్జల వెంకటలక్ష్మి
  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారు: గజ్జల వెంకటలక్ష్మి
  • ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు: గజ్జల వెంకటలక్ష్మి
  • ఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల బాధితులను పరామర్శించలేదు: గజ్జల వెంకటలక్ష్మి
  • త్వరలోనే బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్తాం: గజ్జల వెంకటలక్ష్మి

 

 

12:11 PM, May 20th, 2024
విజయనగరం

  • డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలు
  • ఎంపీ పోస్టల్ బ్యాలెట్ ను తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రానికి తరలించడం లో అధికార్ల సమాచార లోపం వుంది.
  • వైస్సార్సీపీ అభ్యర్థి ఏజెంట్ ను ఈ ప్రక్రియ కోసం పంపించాము.
  • టీడీపీ అభ్యర్థి ఏజెంట్ హాజరు కాక పోవడం వారి ఇష్టం. అయినా రాజకీయం చేసే ప్రకటనలు చేస్తున్నారు.
  • కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా జరగాలని వైస్సార్సీపీ మనస్పూర్తి గా కోరుకుంటుంది.
  • గతం లో గెలిచినా, ఓడినా లేకితనం రాజకీయాలు చేయలేదు.


12:00 PM, May 20th, 2024
పోలీసుల అదుపులో బళ్ల బాబీ

  • ఎన్నికల ఫలితాలు వెలవడక ముందే నరసాపురంలో జనసేన నాయకుల దౌర్జన్యం
  • పశ్చిమగోదావరి మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబీ.. ఆటోలో వెళ్తున్న కుటుంబం పై దాడి
  • కారుకు ఆటో సైడ్ ఇవ్వలేదని  ఆటోను వెంబడించి.. అందులోని ఇద్దరు మహిళలు,పిల్లలు, మరో ఇద్దరిపై దాడి చేసిన బాబీ అతని స్నేహితులు
  • మీరు ఎవరు వైఎస్ఆర్ సీపీకి ఓటు వేశారా? జనసేనకు ఓటు వేశారా...? అంటూ నిలదీసిన బాబి అండ్‌ కో
  • మీరు బీసిల్లా ఉన్నారు వైఎస్ఆర్ సీపీకే ఓటు వేసి ఉంటారని బాబి అతడి స్నేహితులను దాడి.. ఆపై అక్కడి నుంచి జారుకున్న బ్యాచ్‌
  • నరసాపురం ఆసుపత్రికి బాదితులను తరలించిన స్థానికులు
  • ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి.. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్..
  • కేసు నమోదు చేసి బళ్ల బాబీని అదుపులకు తీసుకున్న పోలీసులు

11:32 AM, May 20th, 2024
విజయవాడ

  • ఎన్నికల సంఘానికి నేడు సిట్ ప్రాధమిక నివేదిక
  • పోలింగ్ అనంతర అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తున్న సిట్ ఇన్‌ఛార్జి వినీత్‌ బ్రిజ్‌లాల్‌
  • నేడు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పణ
  • ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన నాలుగు బృందాలు
  • తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నరసారావుపేట ఘటనలపై కీలక ఆధారాలు సేకరణ
  • కేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్
  • కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనున్న సిట్
  • రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్న సిట్
  • డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయనున్న సిట్

11:01 AM, May 20th, 2024
గుంటూరు

  • సాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ను కలవనున్న వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం
  • పోలింగ్ నాడు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై ఫిర్యాదు
  • పల్నాడు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరిగిన దాడుల ఆశారాలను అందించే అవకాశం
  • ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన అంశాలపై కూడా సిట్ కి వివరించనున్న పార్టీ బృందం

10:38 AM, May 20th, 2024
ప్రకాశం

  • ఎల్లో మీడియా పై మాజీమంత్రి బాలినేని ఆగ్రహం
  • తప్పుడు కథనాలు ప్రచురిస్తే ఖబడ్దార్
  • నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మహాటీవి పై పరువునష్టం దావా వేస్తా
  • ఎవరెన్ని కుట్రలు చేసినా...అబద్ధాలు ప్రచారం చేసుకున్నా..కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయం
  • రాబోయేది వైస్సార్సీపీ ప్రభుత్వమే
  • 130 సీట్లకు పైగా వైస్సార్సీపీ కైవసం చేసుకోబోతోంది
  • జూన్ 9 న ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు

10:14 AM, May 20th, 2024
కాకినాడ సిటీ, పిఠాపురంలో అల్లర్లకు ఛాన్స్‌!

  • కాకినాడ సిటీ, పిఠాపురంపై కేంద్ర నిఘా విభాగం(ఇంటెలిజెన్స్‌ బ్యూరో) అలర్ట్‌
  • కౌంటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం!
  • కాకినాడ, పిఠాపురంపై ఎన్నికల సంఘానికి ఐబీ నివేదిక
  • కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టి
  • ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ఇప్పటికే పోలీసుల నిఘా

10:00 AM, May 20th, 2024
ఈసీకి సిట్‌ రిపోర్ట్‌

  • ఏపీలో అల్లర్లపై నేడు ఎన్నికల సంఘానికి సిట్‌ నివేదిక
  • ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చివరి అంకానికి చేరుకున్న సిట్‌ దర్యాప్తు
  • తాడిపత్రిలో ముగిసిన సిట్‌ విచారణ
  • పల్నాడు, తిరుపతిలో ఇవాళ మూడో రోజు కొనసాగనున్న విచారణ
  • క్రొసూరు, అచ్చంపేట మండలాల్లో నేడు పర్యటించనున్న సిట్‌ బృందాలు
  • ఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి సిట్‌ నివేదిక
  • సెక్యూరిటీ వైఫల్యం వల్లే అల్లర్లు జరిగినట్లు సిట్‌ ప్రాథమిక అంచనా
  • ఆ వెంటనే ఈసీకి నివేదిక పంపనున్న డీజీపీ
  • సమగ్ర దర్యాప్తు కోసం సిట్‌కు గడువు పొడిగించాలని కోరే అవకాశం

సమగ్ర కథనం: సిట్‌ నివేదికలో కీలకాంశాలు

9:27 AM, May 20th, 2024
ఆగని పచ్చ చిలుక పలుకులు

  • మరోసారి వైఎస్సార్‌సీపీపై విషం చిమ్మిన ప్రశాంత్‌ కిషోర్‌
  • చంద్రబాబు డైరెక్షన్‌లోనే పని చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్త
  • ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓడిపోతుందంటూ బర్కాదత్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు
  • బీజేపీకి మాత్రం సానుకూలంగానే పీకే స్వరం
  • ఐ-ప్యాక్‌ టీంతో భేటీ సమయంలో సీఎం జగన్‌ గెలుపు వ్యాఖ్యలు
  • పీకే చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించిన సీఎం జగన్‌
  • పీకే చేసేది ఏం లేదని.. అంతా ఐప్యాక్‌ టీం కష్టం ఉందన్న సీఎం జగన్‌
  • జగన్‌ వ్యాఖ్యలపై పీకేకు నూరిపోసిన చంద్రబాబు
  • వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఢీలా పరిచేందుకు  ఎల్లో మీడియా ప్రయత్నాలు

9:05 AM, May 20th, 2024
పల్నాడు

  • మాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి పిచ్చయ్య బైక్ తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
  • రాత్రి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
  • తెలుగుదేశం పార్టీకి చెందిన వారే తగలబెట్టి ఉంటారని అనుమానం
8:00 AM, May 20th, 2024
అనంతపురం: 
  • సిట్ అధికారులకు వినతి పత్రం అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి
  • తమ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై, తమ ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులను కోరారు

 

7:30 AM, May 20th, 2024
విజయవాడ

  • ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరం
  • నేటి సాయంత్రానికి  డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్
  • నాలుగు బృందాలగా సిట్ దర్యాప్తు
  • పల్నాడు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన రెండు బృందాలు
  • పల్నాడు జిల్లాలోని రెండు బృందాలని పర్యవేక్షించిన అదనపు ఎస్పీ సౌమ్యలత
  • తిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించిన మరొక బృందం
  • అనంతపురం‌ జిల్లాలోని తాడిపర్తిలో మరొక బృందం పర్యటన
  • డీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణ
  • ఎప్పటికపుడు నాలుగు బృందాల నుంవి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిలో హెడ్ క్వార్టర్స్‌  నుండి పర్యవేక్షిస్తున్న మరో అదనపు ఎస్పీ
  • మొత్తంగా 33 ఎఫ్ఐఆర్‌లను పరిశీలించిన సిట్ బృందాలు
  • దాదాపు 300 మందికి నిందితులు ఈ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లలో నమోదు
  • ఇప్పటికే వంద మందికి పైగా నిందితులు అరెస్ట్
  • సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలన
  • క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు
  • పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన
  • సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌ల పనితీరుపైనా సిట్ అనుమానాలు
  • టీడీపీ రౌడీలు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి సిట్ బృందాలకి కూడా ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ
  • నాలుగు బృందాల క్షేత్రస్ధాయి సమాచార సేకరణ ఆధారంగా నేటి సాయంత్రం 4 గంటల లోపు డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్
  • సిట్ ఇచ్చే ప్రాధమిక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పం‌పనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
  • పూర్తిస్ధాయి దర్యాప్తుకి మరికొ‌న్ని రోజుల సమయం పొడిగించాలని కోరే అవకాశం
  • సిట్ ప్రాధమిక నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ తదుపరి చర్యలకి అవకాశం

7:00 AM, May 20th, 2024
మార్చినచోటే మారణకాండ  

  • ‘సిట్‌’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటి
  • చంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస  
  • ఓటమి భయంతో బాబు రాక్షసత్వం
  • తలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదు
  • డబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలి
  • తొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు  
     

6:30 AM, May 20th, 2024
ముందస్తు బెయిల్‌ లేకుండా విదేశాలకు చంద్రబాబు

  • ఫైబర్‌నెట్‌ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ
  • శంషాబాద్‌ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు
  • సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి
  • పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు
  • నాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్‌
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement