ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వం
తన పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
రాబోయే ఐదేళ్లలో మరింత మంచి చేస్తానంటూ ప్రజలకు హామీ
మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీకు మంచి జరిగి ఉంటే ఓటేసి ఆశీర్వదించాలంటూ ప్రజలకు వినమ్రంగా సీఎం విజ్ఞప్తి
జగన్ ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన జనం
మరోవైపు.. తన హయాంలో చేసిన మంచేమీ లేకపోవడంతో బాబు నోట తిట్లు, శాపనార్థాలు
ఘోర పరాజయం ఖాయమవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలో చంద్రబాబు, పవన్
నంద్యాలలో చివరి సభలోనూ జగన్‌పై నోరుపారేసుకున్న చంద్రబాబు.. అదే బాటలో పవన్
ప్రధాని మోదీని రప్పించినా కన్పించని జనస్పందన
టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తును తిరస్కరిస్తున్నారనడానికి ఇదే తార్కాణం
ప్రచారపర్వంలోనే పోటీ ఏక పక్షమేనని.. వైఎస్సార్‌సీపీ ఘన విజయం తథ్యమని తేల్చిన జనం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వం శనివారం సా.6 గంటలకు ముగిసింది. గత 59 నెలలుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా చేసిన మంచిని వివరిస్తూ.. అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో మరింత మంచి చేస్తానని హామీ ఇస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలంటూ ఆయన వినమ్రంగా చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘జగన్ కోసం సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 47 వేల పోలింగ్ బూత్‌ల పరిధిలో 2.50 లక్షల మంది బూత్ కన్వినర్, సభ్యుల బృందం నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో.. కోటి మందికిపైగా ప్రజలు స్వచ్ఛందంగా స్టార్ క్యాంపెయినర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మంచేమీ లేకపోవడంతో చెప్పుకునేందుకు ఏమీలేక చంద్రబాబు, పవన్.. సీఎం జగన్‌పై తిట్లు, శాపనార్థాలకు పరిమితమయ్యారు.
కూటమి ప్రచార సభలు వెలవెల..
టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు.. బీజేపీతో 2 పార్టీలు జతకలిశాక ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభ జనంలేక వెలవెలబోయాయి. మూడు పారీ్టల కలయికను అవకాశవాదంగా జనం భావించడంవల్లే ఆదిలోనే ఆ పొత్తును తిరస్కరించారనడానికి తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట సభలే నిదర్శనమని అప్పట్లో రాజకీయ పరిశీలకులు చెప్పారు.
ఇక ఎన్నికల షెడ్యూలు వెలువడ్డాక టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి తరఫున చంద్రబాబు, పవన్ సంయుక్తంగా.. వేర్వేరుగా నిర్వహించిన ప్రచార సభలకు జనం నుంచి స్పందన లభించలేదు. ఇది బాబు, పవన్‌కు నిరాశ, నిస్పృహకు గురిచేసింది. దాంతో సీఎం జగన్‌పై బూతులు, శాపనార్థాలతో వారు విరుచుకుపడ్డారు. నీ అమ్మ మొగుడు.. నీ అమ్మమ్మ మొగుడు.. సీఎం జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ చంద్రబాబు తన స్థాయిని మరిచి, దిగజారి బూతులు అందుకుంటే.. పవన్‌కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి వైఎస్సార్‌సీపీ నేతలను తరిమితరిమి కొట్టండి అంటూ రంకెలేశారు.
చివరకు.. సాక్షాత్తూ ప్రధాని మోదీని రప్పించి.. రాజమహేంద్రవరం, అనకాపల్లి, కలికిరిలలో నిర్వహించిన సభలకు, విజయవాడలో నిర్వహించిన రోడ్‌షోకు ఆశించినంత జనస్పందన లభించలేదు. కళ్ల ముందు ఘోర పరాజయం కన్పిస్తుండటంతో చంద్రబాబు, పవన్ తమ నోటికి మరింతగా పనిచెప్పారు. ప్రచారం ముగింపులో నంద్యాల సభలో సిగ్గెగ్గులు గాలికొదిలేసిన చంద్రబాబు.. సీఎంగా విశాఖపట్నంలో కాదు ‘ఇడుపుపాయలో మీ నాన్న సమాధి వద్ద ప్రమాణం స్వీకారం చెయ్.. శ్మశానంలో చెయ్’ అంటూ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడటంతో జనం విస్తుపోయారు.
సిద్ధం.. సిద్ధం అంటూ హోరెత్తిన జనం..
సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జనసంద్రాలను తలపించాయి. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సునామీ సృష్టించడం ఖాయమన్నది సిద్ధం సభల్లోనే వెల్లడైందని రాజకీయ పరిశీలకులు అంచనాకొచ్చారు.
ఎన్నికల తొలివిడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మార్చి 27న ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో ప్రారంభించిన బస్సుయాత్ర ఏప్రిల్ 24న టెక్కలి సమీపంలో ముగించారు. మొత్తం 22 రోజులు.. 23 జిల్లాలు.. 106 నియోజకవర్గాల్లో సాగిన ఈ యాత్రలో 16 చోట్ల జగన్ నిర్వహించిన బహిరంగ సభలు ‘సిద్ధం’ సభలను తలపించాయి.
విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో నిర్వహించిన రోడ్ షోలకైతే లక్షలాది మంది జనం బస్సుయాత్ర వెంట పరుగులు పెడుతూ.. మంచిచేసిన మిమ్మల్ని గెలిపించే పూచీ మాది అంటూ భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడు అధికారంలోకి వస్తే నాయకులు హామీలు ఇవ్వడం సాధారణం. కానీ.. బస్సు యాత్రలో తద్భిన్నంగా మంచి చేసిన మిమ్మల్ని గెలిపించి.. సీఎంగా చేసుకునే పూచీ మాది అంటూ జనం సీఎం జగన్‌కు భరోసా ఇవ్వడాన్ని రాజకీయాల్లో అపూర్వ ఘట్టంగా పరిశీలకులు అభివరి్ణస్తున్నారు. ఇలా బస్సుయాత్రతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా vముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment