వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల | lella appi reddy slams chandrababu pawan kalyan over land titling act | Sakshi
Sakshi News home page

వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల

Published Tue, May 7 2024 2:09 PM | Last Updated on Tue, May 7 2024 3:30 PM

lella appi reddy slams chandrababu pawan kalyan over land titling act

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.  

‘ఒక పార్టీ అధ్యక్షురాలు  లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుంది.  అదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పింది.

కానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోంది. ఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారు. చంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్.. నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?’ అని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు.  
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement