
సాక్షి, బాపట్ల: ఏపీలో టీడీపీ దమనకాండకు, అరాచకాలకు తెరపడటం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. పలు చోట్ల గత ప్రభుతానికి సంబంధించిన శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు.
తాజాగా బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు.

Comments
Please login to add a commentAdd a comment