destroied
-
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్ విగ్రహానికి..
సాక్షి, బాపట్ల: ఏపీలో టీడీపీ దమనకాండకు, అరాచకాలకు తెరపడటం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. పలు చోట్ల గత ప్రభుతానికి సంబంధించిన శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి అలజడి
భామిని : మండలంలోని చిన్నదిమిలి వద్ద గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించి మాయమయ్యాడు. కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేశాడు. పొలంలోని మేకలు, గొర్రె పిల్లల గూడుపై చెత్తను పోసి తగలబెట్టాడు. మేకల పెంపకందారుల బస వద్ద గల వంట సామాన్లు నాశనం చేశాడు. బియ్యం, ఇతర వస్తువుల్లో మందులు కలిపేశాడు. పొలంలోని జలసిరి బోరును ధ్వంసం చేసి పైపులను విరిసివేశాడు. వ్యవసాయ మోటార్ను వరద కాలువలో పడేశాడు. చిన్నదిమిలికి చెందిన కిల్లారి బుడ్డు, పిసిని ఆనంద్, కోరాడ బూసయ్యకు చెందిన తొమ్మిది మేక, గొర్రె పిల్లలు చనిపోయాయి. మేకల మంద నుంచి వచ్చిన పెంపకందారులు చచ్చిపడి వీటిని చూసి విలపించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదుచేశారు. బత్తిలి పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరో ఆలయం కూల్చివేత
గుంటూరు రూరల్ : భక్తుల మనోభావాలతో సర్కారు ఇంకా ఆటలాడుకుంటూనే ఉంది. ఆలయాల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. మొన్నటివరకు విజయవాడలో కొనసాగిన ప్రక్రియ ఇప్పుడు గుంటూరులో జరుగుతోంది. గోరంట్ల గ్రామంలో దాదాపు 21 సంవత్సరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్న కనకదుర్గమ్మ ఆలయాన్ని గురువారం మున్సిపల్ అధికారులు తొలగించారు. అమరావతి రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉందంటూ ఆలయాన్ని కూల్చివేశారు. నగరంలోని లాడ్జి సెంటర్ నుంచి ఈ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. సర్వే సందర్భంగా ఆలయ ముందుభాగాన్ని మాత్రమే తొలగిస్తామని చెప్పిన అధికారులు ఆ తర్వాత మొత్తం తొలగించారని నిర్వాహకులు తురకా భూపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఆలయాన్ని తొలగించారని ఆలయ కమిటీ సభ్యులు విమర్శిస్తున్నారు. గ్రామస్తులందరితో పూజలందుకుంటున్న తల్లికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని కూల్చివేయటంతో ఒక విగ్రహం ధ్వంసమైందని, మిగిలిన విగ్రహాలను గ్రామంలోని చిన్న రేకుల షెడ్డులో ఏర్పాటు చేశామని వారు వివరించారు. పనుల్లో భాగంగానే తొలగించాం... రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే ఆలయాన్ని తొలగించాల్సి వచ్చిందని నగరపాలక సంస్థ డీసీపీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయం రోడ్డుకు మధ్యలో అడ్డుగా ఉండటంతో ముందే నిర్వాహకులకు తెలిపామన్నారు.