గుర్తుతెలియని వ్యక్తి అలజడి | An unidentified person was destroyed | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి అలజడి∙

Published Wed, May 2 2018 11:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

An unidentified person was destroyed - Sakshi

చచ్చి పడి ఉన్న మేక, గొర్రె పిల్లలు

భామిని : మండలంలోని చిన్నదిమిలి వద్ద గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించి మాయమయ్యాడు. కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేశాడు. పొలంలోని మేకలు, గొర్రె పిల్లల గూడుపై చెత్తను పోసి తగలబెట్టాడు. మేకల పెంపకందారుల బస వద్ద గల వంట సామాన్లు నాశనం చేశాడు. బియ్యం, ఇతర వస్తువుల్లో మందులు కలిపేశాడు. పొలంలోని జలసిరి బోరును ధ్వంసం చేసి పైపులను విరిసివేశాడు.

వ్యవసాయ మోటార్‌ను వరద కాలువలో పడేశాడు. చిన్నదిమిలికి చెందిన కిల్లారి బుడ్డు, పిసిని ఆనంద్, కోరాడ బూసయ్యకు చెందిన తొమ్మిది మేక, గొర్రె పిల్లలు చనిపోయాయి. మేకల మంద నుంచి వచ్చిన పెంపకందారులు చచ్చిపడి వీటిని చూసి విలపించారు. హుటాహుటిన పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదుచేశారు. బత్తిలి పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement