un known person
-
గుర్తుతెలియని వ్యక్తి అలజడి
భామిని : మండలంలోని చిన్నదిమిలి వద్ద గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించి మాయమయ్యాడు. కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేశాడు. పొలంలోని మేకలు, గొర్రె పిల్లల గూడుపై చెత్తను పోసి తగలబెట్టాడు. మేకల పెంపకందారుల బస వద్ద గల వంట సామాన్లు నాశనం చేశాడు. బియ్యం, ఇతర వస్తువుల్లో మందులు కలిపేశాడు. పొలంలోని జలసిరి బోరును ధ్వంసం చేసి పైపులను విరిసివేశాడు. వ్యవసాయ మోటార్‌ను వరద కాలువలో పడేశాడు. చిన్నదిమిలికి చెందిన కిల్లారి బుడ్డు, పిసిని ఆనంద్, కోరాడ బూసయ్యకు చెందిన తొమ్మిది మేక, గొర్రె పిల్లలు చనిపోయాయి. మేకల మంద నుంచి వచ్చిన పెంపకందారులు చచ్చిపడి వీటిని చూసి విలపించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదుచేశారు. బత్తిలి పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముంబయిలో దారుణం.. పాశవికం
ముంబయి: ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. అత్యంత పాశవికమైన చర్య నెలకొంది. గొడవ పడి ఆ కక్షతో ఓ మహిళ మరో మహిళా కానిస్టేబుల్ ఐదేళ్ల పాపను ఏకంగా 15 అంతస్తులపై నుంచి విసిరేసింది. కింద పడగానే పెద్ద శబ్దం రావడంతో వెళ్లి చూసిన వాచ్మెన్ షాక్‌కు గురయ్యాడు. బాలికను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఆ మహిళకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి ఆ బిల్డింగ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ముంబయిలోని బైకుల్లాలో గల న్యూ హింద్ మాదా కాలనీలో 22 అంతస్తుల భవనం ఉంది. అందులో అశోక్, ఆర్తి అనే భార్యభర్తలు 15వ అంతస్తులో ఉంటున్నారు. వీరిలో ఆర్తి వర్లీ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా అశోక్ మాత్రం ఆటో మొబైల్ వ్యాపారం చూసుకోవడంతోపాటు ఓ షోరూంలో పనిచేస్తున్నాడు. సోమవారం ఆర్తి తన ఉద్యోగానికి వెళ్లగా అశోక్ ఇంట్లోనే ఉన్నాడు. ప్రస్తుతం గ్లోరియా ప్రి ప్రైమరీ స్కూల్లో చదువుతున్న తమ ఐదేళ్ల పాప బయట ఆడుకుంటోంది. కానీ, అలా ఆడుతున్న కాసేపటికే ఆ పాపను ఎవరో 15వ ఫ్లోర్ నుంచి కిందకు ఎవరో విసిరేశారు. ఆ భవనంలో ఉన్నవారందరినీ ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసేలా చేసింది. విచారణ చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అంతకుముందు ఆ మహిళా కానిస్టేబుల్ తో గొడవపడిన ఓ మహిళే ఈ దారుణం చేసి ఉంటుందని తెలుస్తోంది.