సాక్షి ప్రతినిధి, కడప: కాదేదీ దుష్ప్రచారానికి అనర్హం అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిష్ట దెబ్బతీసేలా వారి వైఖరి ఉంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ జిల్లా పులివెందుల కేంద్రంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సైతం రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది.
పులివెందుల మోడల్ టౌన్‌లో భాగంగా వివిధ సర్కిల్స్‌లో జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా (పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జాతిపిత మహాత్మాగాం«దీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను తెలంగాణ నుంచి తీసుకువచ్చారు. ఇవి శుక్రవారం సాయంత్రానికి పులివెందుల చేరుకున్నాయి. పాత బస్టాండు సమీపంలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకు పిల్లర్ సిద్ధం చేశారు. అక్కడే విగ్రహాలు క్రేన్ సహాయంతో లారీ నుంచి దించారు.
వైఎస్సార్ విగ్రహాన్ని పిల్లర్‌పైన పెట్టారు. అలాగే జాతిపిత విగ్రహం ఆవిష్కరణకు కోర్టు సర్కిల్ వద్ద ఏర్పాట్లు చేశారు. గరండల్ బ్రిడ్జి సమీపంలో సుందరీకరణతోపాటు అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచారు.
ఇంకా పిల్లర్, సుందరీకరణ పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్ నిరంజన్‌రెడ్డి ఇంట్లో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని భద్రపర్చారు. అంతలోనే క్రేన్ నుంచి కిందికి దించిన విగ్రహాన్ని ఫొటో తీసి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో అంబేడ్కర్ విగ్రహాన్ని వైఎస్సార్ విగ్రహం కింద ఉంచారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు
మోడల్ టౌన్‌లో భాగంగా సుందరీకరణ పనులు, జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులు కొనసాగుతున్నాయి. అంతలోనే రాజకీయ స్వలాభం కోసం సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రతిష్టను దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
పిల్లర్ లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని ప్రశి్నస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనం నుంచి దించి ఉన్న విగ్రహాన్ని ఫొటో తీసి ప్రచారం చేయడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. అంబేడ్కర్‌ను కించపరిచే విధంగా అవాస్తవాలు ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అత్యంత సుందరంగా అంబేడ్కర్ విగ్రహం
పులివెందుల మోడల్ టౌన్‌లో భాగంగా సుందరంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పులివెందులలో మాటా్లడుతూ స్థానిక గరండాల్ బ్రిడ్జి దగ్గర విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్, పార్టీ పట్టణ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి స్థానిక ఎస్సీ, బీసీ నాయకులతో కలిసి స్థల పరిశీలించారని తెలిపారు. అందులో భాగంగా శిల్ప కళాకారుడితో ప్రత్యేకంగా కళాత్మకంగా రూపొందించిన అంబేడ్కర్ విగ్రహం కూడా పులివెందులకు చేరుకుందన్నారు. టీడీపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment