విగ్రహాన్ని పరిశీలిస్తున్న శివనాగిరెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామ శివారు పొలాల్లో తాజాగా పరిశోధకులు తెలంగాణలోనే అతిపెద్దదైన, దాదాపు 9 అడుగుల ఎత్తున్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహాన్ని గుర్తించారు. విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కరుణాకర్, మహ్మద్ నసీరుద్దీన్‌లు ఈ విగ్రహాన్ని ఆదివారం పరిశీలించారు.
దాదాపు వెయ్యేళ్ల క్రితం చెక్కిన ఈ గ్రానైట్ శిల్పం కుడి చేతిలో గద, ఎడమ చేయిన సూచీ ముద్రగానూ, పైరెండు చేతుల్లో శంఖుచక్రాలను, తలపై కిరీటం, ఆభరణాలు, నడుము దిగువన వస్త్రాన్ని చెక్కి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిమ లక్షణాల ఆధారంగా ఈ శిల్పాన్ని రాష్ట్ర కూటుల అనంతరం కల్యాణ చాళుక్య కాలానికి అంటే 10వ శతాబ్దానికి చెందిందిగా గుర్తించినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. దీన్ని సంరక్షించి భావి తరానికి అందించాల్సిన అవసరం ఉందని, ఈ విగ్రహ నేపథ్యాన్ని గుర్తించేందుకు పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment