
పురాతన విగ్రహం స్థానంలో నకిలీ విగ్రహం
చంద్రగిరి (తిరుపతి జిల్లా): రాయల కాలం నాటి పురాతన విగ్రహాన్ని రాత్రికి రాత్రి చోరీ చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థానంలో నకిలీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్కియాలజీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి రాయలవారి కోట ప్రాంగణంలో క్రీ.శ.11వ శతాబ్ధానికి చెందిన రాతి గోడలో అప్పటి రాజులు వినాయక స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
అయితే ఇటీవల ఆ విగ్రహంపై కన్నెసిన గుర్తు తెలియని కేటుగాళ్లు చోరీ చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా అదే ప్రదేశంలో నకిలీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆర్కియాలజీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురాతన విగ్రహం లోపల భాగంలో నిధులుంటాయని, వాటిని సొంతం చేసుకోవడానికే విగ్రహాన్ని చోరీ చేసి ఉంటారని ప్రచారం చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment