అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆలయ ట్రస్టు ఎంతగానో కృషి చేస్తోంది. సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండటంతో రామాలయానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రతిరోజూ వెలుగులోకి వస్తోంది.
ఈ క్రమంలోనే అత్యంత ఆకర్షణీయమైన రామ్‌లల్లా విగ్రహానికి సంబంధించిన తొలి ఫొటో వెలుగులోకి వచ్చింది. పల్లకీలో కూర్చున్న రామ్‌లల్లా ఆలయ ప్రాంగణంలో ఊరేగారు. అయితే ఇది గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం కాదు. ఇది ప్రతీకాత్మక విగ్రహం. గర్భగుడిలో ప్రతిష్టించే బాలరాముని విగ్రహాన్ని ఈనెల 18న(ఈరోజు) రామాలయ ప్రాంగణానికి తీసుకురానున్నారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కర్నాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ నూతన రామాలయంలో ప్రతిష్ఠించే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. జనవరి 22న జరిగే పవిత్రోత్సవానికి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆలయ ట్రస్టు తొలుత బాలరాముని విగ్రహాన్నే ఆలయ ప్రాంగణంలో ఊరేగించాలని భావించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి, శ్రీరాముని ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి, భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలిగించారు.
బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
ఇది కూడా చదవండి: 22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment