అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన గురువులను స్మరించుకుని, పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియా సైట్‌లో షేర్ చేశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా రాశారు.. 'అయోధ్యధామ్‌లోని శ్రీరాముడి జన్మస్థలంలో నేడు జరుగుతున్న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శతాబ్ధాల పోరాట ఫలితం. ఈ సందర్భంగా దిగ్విజయ్‌నాథ్ మహరాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్‌లకు ఉద్వేగభరితమైన నివాళులు అర్పిస్తున్నాను.. జై జై శ్రీ రామ్!’ అని రాశారు.
श्री अयोध्या धाम में श्रीराम जन्मभूमि पर आज हो रही प्रभु श्री रामलला के नूतन विग्रह की प्राण-प्रतिष्ठा से पीढ़ियों का संघर्ष एवं सदियों का संकल्प पूर्ण हुआ है। इस अवसर पर युगपुरुष ब्रह्मलीन महंत दिग्विजयनाथ जी महाराज और राष्ट्रसंत ब्रह्मलीन महंत अवेद्यनाथ जी महाराज के प्रति… pic.twitter.com/slW5UjNUoC
— Yogi Adityanath (@myogiadityanath) January 22, 2024
సీఎం యోగి మరో ట్వీట్‌లో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు... ‘ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం.. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యధామ్‌లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. నేడు ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. భక్తి సాగరంలో మునిగిన దేశమంతా రామనామం స్మరిస్తోంది’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యకు లండన్ సాధ్విల బృందం!
Comments
Please login to add a commentAdd a comment