లక్నో: అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని ఎంపిక చేశారు. మూడు విగ్రహాల్లో 51 అంగుళాలు ఉన్న రాముని శ్యామవర్ణ(నీలిరంగు) విగ్రహాన్ని ఆలయ కమిటీ ఫైనల్ చేసింది. ఎంపిక చేసిన ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్, కే.ఎల్ భట్‌లు తయారు చేశారు.
అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ జరిగింది. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. ఈ విగ్రహాన్నే గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు.
ఓటింగ్‌లో బాలరాముని మూడు విగ్రహాలను సమర్పించారు. ఇందుకు 51 అంగుళాలు ఉన్న ఐదేళ్ల రాముని విగ్రహాలను శిల్పులు రూపొందించినట్లు ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. బాల రాముని దైవత్వం కళ్లకు కట్టినట్లు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని ఆయన ఇప్పటికే చెప్పారు.
ఏడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవం జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో బాలరాముని విగ్రహం ఊరేగింపు ఉంటుంది. ఆచార స్నానాలు, పూజలు, అగ్ని ఆచారాలు వరుసగా ఉంటాయి. జనవరి 22న, ఉదయం పూజ తరువాత మధ్యాహ్నం పవిత్రమైన మృగశిర నక్షత్రాన బాల రాముడు మందిరంలో కొలువు దీరనున్నాడు.
ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment