![Director K Balachander Metal Statue In Tamilnadu - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/24/director-k-balachandar.jpg.webp?itok=sUGGUE0G)
దివంగత ప్రఖ్యాత దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.బాలచందర్‌కు శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయనుందని తమిళనాడు హౌసింగు బోర్డు సొసైటీ అధ్యక్షుడు పూచి మురుగన్ వెల్లడించారు. దర్శకుడు కె.బాలచందర్ 9వ స్మారక దినోత్సవం కార్యక్రమం స్థానిక టి.నగర్‌లోని టక్కర్‌బాబా ఆవరణంలో శనివారం జరిగింది.
(ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్)
కె.బాలచందర్ అభిమాన సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైలాపూర్ శాసనసభ్యుడు వేలు, తమిళనాడు హౌసింగ్ బోర్డు సొసైటీ అధ్యక్షుడు పూచి మురుగన్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూచి మురుగన్ మాట్లాడుతూ దర్శకుడు కె.బాలచందర్ శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. రజనీకాంత్, కమలహాసన్, మమ్ముట్టి తదితర ప్రముఖ నటుల విజ్ఞప్తి లేఖల కారణంగా, కె.బాలచందర్ అభిమాన సంఘం కార్యదర్శి బాబు వినతిపత్రం ప్రభుత్వ పరిశీలన చివరి దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా కె.బాలచందర్ నివాసం ఉన్న వీధికి ఆయన పేరు పెట్టాలన్న కోరికను వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: ప్రముఖ హాస్య నటుడు మృతి.. సడన్‌గా అలా జరగడంతోనే)
Comments
Please login to add a commentAdd a comment