K Balachander
-
దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ జ్ఞాపకార్థంగా శిలవిగ్రహం
దివంగత ప్రఖ్యాత దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.బాలచందర్‌కు శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయనుందని తమిళనాడు హౌసింగు బోర్డు సొసైటీ అధ్యక్షుడు పూచి మురుగన్ వెల్లడించారు. దర్శకుడు కె.బాలచందర్ 9వ స్మారక దినోత్సవం కార్యక్రమం స్థానిక టి.నగర్‌లోని టక్కర్బాబా ఆవరణంలో శనివారం జరిగింది. (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) కె.బాలచందర్ అభిమాన సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైలాపూర్ శాసనసభ్యుడు వేలు, తమిళనాడు హౌసింగ్ బోర్డు సొసైటీ అధ్యక్షుడు పూచి మురుగన్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూచి మురుగన్ మాట్లాడుతూ దర్శకుడు కె.బాలచందర్ శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. రజనీకాంత్, కమలహాసన్, మమ్ముట్టి తదితర ప్రముఖ నటుల విజ్ఞప్తి లేఖల కారణంగా, కె.బాలచందర్ అభిమాన సంఘం కార్యదర్శి బాబు వినతిపత్రం ప్రభుత్వ పరిశీలన చివరి దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా కె.బాలచందర్ నివాసం ఉన్న వీధికి ఆయన పేరు పెట్టాలన్న కోరికను వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ప్రముఖ హాస్య నటుడు మృతి.. సడన్‌గా అలా జరగడంతోనే) -
మీ కుటుంబానికి ఉన్నారా స్నేహితులు?
Rajinikanth Dadasaheb Phalke Award 2021: ‘నా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ నా స్నేహితుడు రాజ్ బహదూర్‌కు అంకితం అన్నాడు నటుడు రజనీ కాంత్. 50 ఏళ్ల నాటి స్నేహం వారిది. ఇవాళ్టికీ రజనీకాంత్ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మంచం మీద స్నేహితుడు పడుకుంటే తాను కింద పడుకుంటాడు. కుటుంబాలు కేవలం తల్లి, తండ్రి, పిల్లలతో మనలేవు. స్నేహితులు కావాలి. గాఢమైన స్నేహాలే బతుకు నావలో సంతోషాన్ని, కష్టం వచ్చినప్పుడు సపోర్ట్నీ ఇస్తాయి. మరి మనకు ఉన్నాయా అంతటి గట్టి స్నేహాలు. మన పిల్లలకు నేర్పిస్తున్నామా ఆ సంస్కారాలు? ‘ఒక మనిషికి అసలైన నష్టం ఏమిటంటే నిజమైన మిత్రుణ్ణి కోల్పోవడమే’ అని సూక్తి. సంపదలు ఎన్ని రకాలైనా ‘స్నేహ సంపద’ వాటిలో ఉంది. స్నేహితుల్ని కోల్పోవడం అంటే సంపదను శాశ్వతంగా కోల్పోవడం. ‘నీ స్నేహితులెవరో చెప్పు... నువ్వెవరో చెప్తా’ అనేది ఎందుకంటే ఆ స్నేహితుల సంఖ్యను, వ్యక్తిత్వాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్థారించవచ్చు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు. కాని కళ్లు తడవకుండా, ఆ సమయంలో పక్కనే స్నేహితుడు లేకుండా జీవితాన్ని దాటడం కష్టం. స్నేహ సంబంధాలు నిలబెట్టు కోవడానికి సమయం ఇస్తున్నామా? స్నేహితులను కోల్పోతే మళ్లీ పొందగలమా? ‘ఫ్యామిలీ ఫ్రెండ్స్’ అనే మాట ఉంది. మనకిప్పుడు ఎంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందరు మన ఇంటికి వచ్చి ఎందరి ఇంటికి మనం వెళ్లగలిగేలా ఉన్నాము. చెక్ చేసుకోవడం తప్పనిసరి. స్నేహంలో ఉండే ఆనందమే బలం. ఆయుష్షు. రజనీకాంత్ మరియు అతడు మొన్న ఢిల్లీలో రజనీకాంత్ తన నట జీవితానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని తన గురువు కె.బాలచందర్‌తో పాటు స్నేహితుడు రాజ్ బహదూర్‌కు కూడా ఇచ్చాడు. రజనీకాంత్‌కు బెంగళూరులో రాజ బహదూర్ అనే స్నేహితుడు ఉన్నట్టు చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ స్నేహం... స్నేహానికి ఉండే విలువ చర్చకు వచ్చాయి. ‘నాలోని నటుణ్ణి రాజ్ బహదూర్ గుర్తించి నన్ను మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించాడు’ అని రజనీకాంత్ అన్నాడు. ఒక స్నేహితుడు అన్న మాట, అతని ప్రోత్సాహమే ఇవాళ దేశానికి రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌ని ఇచ్చింది. అందుకే రజనీకాంత్ ఆ స్నేహం పట్ల కృతజ్ఞతతో... ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు. ఎప్పటి స్నేహం? 1970 నాటి సమయం. అప్పుడు రజనీకాంత్ బెంగళూరులో తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌గా ఉన్నాడు. బస్ కండక్టర్‌గా కర్ణాటక ఆర్.టి.సిలో ఉద్యోగంలో చేరాడు. అతని బస్ నంబర్ 10 ఏ. మెజెస్టిక్ నుంచి శ్రీనగర్ స్టాప్ల మధ్య తిరిగేది. దాని డ్రైవర్ రాజ్ బహదూర్. రాజ్ బహదూర్ రజనీ కన్నా ఏడేళ్లు పెద్దవాడు. కాని వారికి స్నేహం కుదిరింది. ‘ఆ సమయంలోనే రజనీకాంత్‌లో మంచి స్టయిల్ ఉండేది. ప్రయాణికులకు చిల్లర ఇవ్వాల్సి వస్తే కాయిన్ ఎగరేసి ఇచ్చేవాడు. ఏ కార్యక్రమాలు జరిగినా స్టేజ్ మీద నాటకం వేసేవాడు. అందరికంటే బాగా నటించేవాడు.’ అని 77 ఏళ్ల రాజ్ బహదూర్ గుర్తు చేసుకున్నాడు. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకూ చామరాజ్నగర్లోనే ఉంటున్నాడు. రజనీకాంత్ అప్పట్లో దానికి దగ్గరగా ఉండే హనుమంతనగర్ లో ఉండేవాడు. డ్యూటీ సమయాల్లోనూ డ్యూటీ లేనప్పుడూ ఇద్దరూ కలిసి తిరిగేవారు. స్నేహితుడే దారి రజనీకాంత్‌ను సినిమాల్లో చేరమని రాజ్ బహదూర్ శత పోరు పెట్టాడు. కాని ఉద్యోగాన్ని వదిలి మద్రాసు వెళ్ళడం రజనీకి పెద్ద రిస్క్. నీకెందుకు నేనున్నా అన్నాడు రాజ్ బహదూర్. ఆ రోజు ల్లో రాజ్ బహదూర్ జీతం 400. అందులో 200 రజనీకాంత్‌కు పంపేవాడు. రజనీకాంత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న రోజులకు, స్ట్రగుల్ అయిన రోజులకు రాజ్ బహదూర్ పంపిన డబ్బే పెద్ద ఆధారం. ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ పూర్తయ్యాక ముగింపు ఫంక్షన్‌కు కె.బాలచందర్ చీఫ్ గెస్ట్. ఆ టైమ్‌లో ఆయన రజనీకాంత్‌ని చూసి ‘తమిళం నేర్చుకో’ అని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. రజనీ నా దగ్గరకు వచ్చాడు. బాలచందర్ ఈ మాట అన్నాడ్రా అన్నాడు. అంతేకాదు.. ఇవాళ్టి నుంచి నాతో తమిళంలోనే మాట్లాడు అన్నాడు. నేను తమిళం మాట్లాడుతూ తమిళం నేర్చుకోవడంలో సాయం చేశాను’ అన్నాడు రాజ్ బహదూర్. కృష్ణ–కుచేల నిజానికి రజనీకాంత్ ఇప్పుడు కృష్ణుడు. కాని రాజ్ బహదూర్ దగ్గర ఎప్పుడూ కుచేలుడిగానే ఉంటాడు. ఫోన్లు చేయడు. మెసేజ్‌లు పెట్టడు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాజ్ బహదూర్ ఇంటికి వచ్చి బెల్లు కొడతాడు. ఆర్టిసిలో రిటైర్ అయ్యి తమ్ముడి కుటుంబంతో సొంత ఇంట్లో జీవిస్తున్న రాజ్ బహదూర్ దగ్గర రజనీ కాంత్ కోసమే ఎప్పుడూ ఒక గది సిద్ధంగా ఉంటుంది. ఆ గదిలో ఒక సింగిల్ కాట్ ఉంటుంది. రాజ్ బహదూర్ దానిమీద రజనీకాంత్ కింద నిద్రపోతారు. రజనీకాంత్ వచ్చాడంటే స్నేహితులిద్దరినీ ఆ గదిలో వదిలి కుటుంబ సభ్యులు ఏమీ ఎరగనట్టుగా ఉండిపోతారు. ఇక రేయింబవళ్లు వాళ్ల కబుర్లు సాగుతాయి. రజనీకాంత్ ఒక్కోసారి రాజ్ బహదూర్ దగ్గర వారం పది రోజులు ఉండిపోతాడు. ఇద్దరూ చీకటి పడ్డాక మామూలు మనుషుల్లా బెంగళూరు రోడ్ల మీద తిరుగుతారు. కొనసాగే బంధం సినిమా రంగంలోని కృత్రిమత్వం నుంచి పారిపోవడానికి రజనీకాంత్ తన స్నేహాన్ని ఒక సాధనం చేసుకున్నాడు. ఒక్క రాజ్ బహదూర్ దగ్గర మాత్రమే రజనీ మామూలు మనిషిలా ఉండగలడు. మనల్ని భ్రమల్లో నుంచి, అహంలో నుంచి బయటపడేలా చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మన పిల్లలకు ‘మావయ్యగానో బాబాయిగానో’ ఉంటూ మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉండాలని అనిపిస్తుంది. ఇలాంటి స్నేహాలు పొందడం కష్టం కాదు. కాపాడుకోవడమే కష్టం. అందుకు ప్రయత్నించినవాళ్లే ధన్యులు. -
నా కీర్తికి కారణం ఆయనే..
సినిమా: తమ కీర్తి సజీవంగా ఉన్నంతవరకు దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ కీర్తి ప్రతిష్ట లు సజీవంగానే ఉంటాయని నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పేర్కొన్నారు. గురువారం దర్శక శిఖరంగా పేరుగాంచిన దివంగత దర్శక దిగ్గజం కె.బాలచందర్ 90వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు పుష్పాకంద స్వామి, బి.కందస్వామి స్థానిక ఆళ్వార్ పేటలోని రాజ్ కమల్ ఫిలిమ్స్ కార్యాలయంలో గల కె.బాలచందర్ శిలా విగ్రహానికి నివాళులర్పించారు. కాగా నటుడు రజినీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి ఎందరో నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు కె.బాలచందర్. అదేవిధంగా కమలహాసన్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన దర్శకుడు ఈయన. నీల్కుమిలి చిత్రంతో దశ దర్శకుడిగా తన సినీ పతనాన్ని ప్రారంభించిన కె.బాలచందర్ ఆ తర్వాత సర్వర్ సుందరం, ఇరు కొడుగాల్, అపూర్వసహోదర్గళ్ విభిన్న కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొమ్మిది సార్లు జాతీయ అవార్డులను అందుకున్న ఈయన కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ ,దాదాసాహెబ్ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. అలాంటి కె బాలచందర్ అనారోగ్యం కారణంగా 2014 డిసెంబర్ 23న కన్నుమూశారు. కాగా గురువారం ఆయన 90వ జయంతి సందర్భంగా కమలహాసన్ ,రజనీకాంత్ ఆయనతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ముందుగా కమలహాసన్ తన ట్విట్టర్లో పేర్కొంటూ కె.బాలచందర్ ను తనను తొలిసారిగా వాహినీ స్టూడియో జరుగుతున్న వెళ్లి విళా చిత్ర షూటింగ్ లో జెమినీ గణేశన్ పరిచయం చేశారు అని చెప్పారు. అప్పుడు చాలా బిజీగా ఉన్న కె.బాలచందర్ ఒక క్షణం తనను చూశారని అన్నారు. ఆ క్షణంలో ఆయన నాపై చూసిన ఆ చూపే తమ మధ్య పెద్ద బంధానికి దారితీస్తుందని ఊహించలేదన్నారు. ఆ తర్వాత పదహారేళ్ల వయసులో తాను బాలచందర్ వద్దు అని చెప్పానని అలా ఆయన జీవితంలో తనకు ఇచ్చిన స్థానం, తాను తన జీవితంలో ఆయనకు ఇచ్చిన స్థానం తాము ఊహించి జరిగింది కాదన్నారు. అది తమ మధ్య తండ్రి కొడుకుల బంధంగా బల పడింది పేర్కొన్నారు. కె.బాలచందర్ తనకు చాలా విషయాలు చెప్పారని, మరెన్నో ఎన్నో విషయాలను నేర్పించాలని అన్నారు. తమ కీర్తి సజీవంగా ఉన్నంతవరకు కె.బాలచందర్ కీర్తిప్రతిష్టలు సజీవంగా ఉంటాయని కమలాసన్ పేర్కొన్నారు. ఎందుకంటే తాము ఆయన పట్టుకున్న బొమ్మలు పేర్కొన్నారు. కె.బాలచందర్ ఒక పెద్ద నక్షత్ర కూటాన్నే సినిమాకు పరిచయం చేశారని కమలహాసన్ పేర్కొన్నారు. నా కీర్తికి కారణం ఆయనే.. కాగా నటుడు రజినీకాంత్ తన గురువు కె.బాలచందర్ 90 జయంతి సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ ఈరోజు తన గురువు 90వ జయంతి అని అన్నారు. ఆయన నటుడిగా తనను పరిచయం చేయకపోయినా తాను కచ్చితంగా నటుడిని అయ్యేవాడిని అని అన్నారు. కన్నడ భాషలో విలన్ గానో, లేదా చిన్న చిన్న పాత్రలతో నటిస్తూ చిన్న నటుడిగా కొనసాగేవాడినని అన్నారు.అయితే ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం కె.బాలచందర్నే అని అన్నారు. ఆయన తనకు పేరు మార్చి తనలోని మైనస్ లను పోగొట్టి ప్లేసులు ఏమిటన్నది తనకు తెలియచెప్పి ఒక పరిపూర్ణ నటుడిగా తీర్చిదిద్దారు అని అన్నారు. వరుసగా చిత్రాలు ఒప్పందం చేసుకొని మంచి పాత్రలు ఇచ్చి ఒక స్టార్ నటుడిగా తమిళ పరిచయం చేశారని అన్నారు. తన జీవితంలో అమ్మ,నాన్న ,అన్నయ్య ఆ తర్వాత స్థానంలో కె.బాలచందర్ ఉంటారని అన్నారు. ఈ నలుగురు నాకు 4 దైవా లు అని పేర్కొన్నారు.తనతో పాటు మరెందరో నటీనటులకు జీవితాన్ని ఇచ్చిన దర్శకుడు కే.బాలచందర్ అని అన్నారు. తాను ఎందరో దర్శకుల చిత్రాల్లో పని చేశానన్నారు. ఇండియాలో ప్రముఖ దర్శకులు సుభాష్ ఘాయ్ భీమ్ సింగ్ ,కృష్ణన్ సుబ్బు, మణిరత్నం, శంకర్ వంటే పలువురు దర్శకత్వంలో నటించాలని చెప్పారు . అయితే బాలచందర్ షూటింగ్ సెట్లోకి రాగానే తనలాంటి వారితో పాటు లైట్ బాయ్ వరకు లేచి నిలబడతారు అని అన్నారు. అలాంటి ఒక గంభీరమైన దర్శకుడిని ఎక్కడా చూడలేదని రజనీకాంత్ పేర్కొన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- కె.బాలచందర్
-
అభిమానులు షాక్ అవుతారు
సౌత్ స్టార్స్ రజనీకాంత్, కమల్‌హాసన్ ఒకే వేదికపై కలిశారు. గురువారం కమల్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వీరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నాకు నీడగా నిలిచిన కె.బాలచందర్‌గారికి నా కార్యాలయంలో విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. రజనీ, నేను ఒకరు చేసే పనులకు మరొకరం అభిమానులం’’ అని పేర్కొ న్నారు. అలాగే తనకు నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్‌లో ‘గాడ్‌ఫాదర్, తిరువిళైయాడల్æ, హే రామ్’ అని రజనీ పేర్కొన్నారు. ‘హే రామ్’ చిత్రాన్ని దాదాపు 30సార్లు చూసి ఉంటానని రజనీ పేర్కొనడం విశేషం. ఇక పుట్టినరోజు సందర్భంగా తన నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు కమల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఐకాన్‌గా రజనీకాంత్ ఎంపిక అయ్యారని తెలియగానే ఫోన్ చేసి అభినందించాను. యాక్టింగ్ మొదలుపెట్టిన తొలి ఏడాదే రజనీ ఐకాన్‌గా నిలిచారు. ఈ గౌరవం రజనీకి 43ఏళ్ల తర్వాత దక్కిందనే చెప్పుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ సినీ కెరీర్లో ముందుకు వెళ్లాలని మేం యువహీరోలుగా ఉన్న రోజుల్లోనే నిర్ణయించుకున్నాం. ఓ సందర్భంలో సినిమాలు వదిలేద్దామనుకుంటున్నానని నాతో అన్నప్పుడు సినిమాలు చేయడాన్ని కొనసాగించమని చెప్పింది నేనే. ఎందుకంటే కొందరు నన్ను కూడా సినిమాలు చేయవద్దని చెప్పారని అప్పుడు రజనీకి చెప్పాను. మా వ్యక్తిగత విషయాలను రజనీ, నేను ఏ స్థాయిలో చర్చించుకుంటామో చెబితే అభిమానులు షాక్ అవుతారు’’ అన్నారు కమల్‌హాసన్. -
ఒకే వేదికపై కమల్-రజనీ
-
బాలచందర్ ఆస్తుల వేలం.. గందరగోళం!
సాక్షి, చెన్నై : లెజెండరీ దర్శకుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత.. కే బాలచందర్ ఆస్తుల వేలం వార్త గత రెండు రోజులుగా కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అలాంటిదేం జరగబోదని నిర్మాణ సంస్థ.. ఆస్తులను వేలం వేసి తీరతామని యూకో బ్యాంక్ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు గందరగోళం మొదలైంది. ఆదివారం ప్రముఖ దినపత్రికల్లో దివంగత బాలచందర్ ఆస్తులను వేలం వేయబోతున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో రజనీ కాంత్, కమల్ హాసన్‌లు గురువు కోసం ఏదైనా చేస్తారేమోనని అంతా ఎదురు చూశారు. వారు స్పందించకపోయినప్పటికీ ఆయన నిర్మాణ సంస్థ కవితాలయ మూవీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. బాలచందర్ ఆస్తుల వేలం ఉండబోదని తెలిపింది. ‘వ్యాపారంలో భాగంగానే బాలచందర్.. ఇళ్లు, కార్యాలయం డాక్యూమెంట్లు చెన్నైలోని యూకో బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఆయన చనిపోవటంతో రుణంపై వడ్డీ పేరుకుపోయింది. 1.36 కోట్లకు వేలం వేయాలని బ్యాంక్ నిర్ణయించింది. కానీ, ఇప్పటికే చాలా వరకు రుణం తిరిగి చెల్లించాం. మిగతా రుణాన్ని సింగిల్ సెటిల్మెంట్లో చెల్లించేలా మా ప్రతినిధులు బ్యాంక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు’ అని కవితాలయ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే బ్యాంక్ మాత్రం ఈ ప్రకటనపై సానుకూలంగా స్పందించలేదు. బాలచందర్ ఇల్లు, కార్యాలయం వేలం వేస్తున్నామని, ఇది కోర్టు పరిధిలో వ్యవహారం కాబట్టి ఇంతకు మించి స్పందించలేమని బ్యాంకు అధికారులు చెప్పటంతో గందరగోళం మొదలైంది. -
వసంత్ దర్శకత్వంలో పార్వతీ మీనన్
వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకులు పేర్లతో వసంత్ పేరు కచ్చితంగా ఉంటుంది. కేలడీ కణ్మణి, నీ పాది నాన్ పాది, ఆశై, నేరుక్కునేర్, రిథం లాంటి పలు విభిన్న కథా చిత్రాలు సృష్టికర్త వసంత్. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ శిష్యుడైన ఈయన చివరి చిత్రం మూండ్రుపేర్ మూండ్రు కాదల్. తాజాగా తన్నీర్ అనే మరో వైవిధ్యభరిత కథా చిత్రాన్ని సెల్యులాయిడ్‌పై కెక్కించడానికి సిద్ధం అయ్యారు వసంత్. ఇది ప్రముఖ రచయిత అశోక్ మిత్రా రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం. ఇందులో కథానాయకి పాత్రకు నటి పార్వతి మీనన్ అయితే పక్కాగా నప్పుతుందని వసంత భావించినట్లు తెలిసింది. పార్వతి మీనన్ ఇంతకుముందు పూ మరియన్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొం దారు. ఇటీవల విడుదలైన ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ కూతురిగా నటిం చారు. మంచి పాత్రల కోసం తాపత్రయపడే పార్వతి చిత్రం తన్నీర్ ద్వారా మరోసారి తన సత్తా చాటుకోనున్నారన్న మాట. -
అంతులేని ‘కథకుడు’
కొందరికి వృత్తి ఉపాధి. కొందరికి ఊపిరి. మరికొందరికి అంతఃచేతన. ఆఖరి రోజుల్లో అపస్మారకంలో ఉండిపోయారు. స్పృహలేదు. అయినా మధ్యలో ఆయన పెదాలు ‘లైట్స్’,‘కెమెరా’, ‘స్టార్ట్ ’ అన్నాయట. బాలచందర్ ఒడుపు కథ. నాటకం పెట్టుబడి. వ్యూహం కథనం. వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయ్యారు. సినీమా బలహీనత నాటకం. కాని ఆనాటి ఫాల్కే ‘హరిశ్చంద్ర’ నుంచి, తొలినాటి పుల్ల య్యగారి ‘భక్త ప్రహ్లాద’ దగ్గర్నుంచి నేటి వరకు ఆ బలహీనత సామాన్యగుణంగా భార తీయ సినీమాలో రాజ్య మేలు తూవచ్చింది. కాని ఐదు దశా బ్దాల పాటు ‘నాటకీయత’నే సినీమాకి బలమూ, అలంకారమూ, ఆకర్షణా చేసి - వెండితెర మీద అపూర్వమైన నాటకాలను రచించిన వెండితెర మేస్త్రి కె. బాలచందర్. 76 సంవత్సరాల కిందట తంజావూరు జిల్లా నల్లమాంగుడి అనే గ్రామంలో 8 ఏళ్ల కుర్రాడికి నాటకం ఊపిరి. ఊరి మధ్య అరుగు మీద నాటకం వేస్తూంటే వాళ్ల నాన్నకి తెలిసి, నాటకం మధ్యలో స్టేజీ మీదకి వచ్చి కొడుకుని చెవి పట్టుకు తీసుకుపోయి ఇంట్లో చావ గొట్టాడు. అయితే ఆ వ్యసనం కారణంగానే ఆ కుర్రాడు తర్వాతి జీవితంలో 9 జాతీయ బహుమతులూ, 13 ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, కళైమామణి, ఏఎన్నార్ అవార్డు పుచ్చుకుని భారతదేశంలో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదిం చుకుంటాడని ఆయనకి తెలీదు. 19 ఏళ్లకి ఆయన ఊళ్లో బడిపంతులయ్యాడు. తర్వాత ఎకౌటెంట్ జనరల్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం. అప్పుడే ఒక నాటక సమాజాన్ని ఏర్పరు చుకుని మొట్టమొదటి నాటకం ‘మేజర్ చంద్రకాంత్’, రచన, ప్రదర్శన. దరిమిలాను సుందరరాజన్ అనే నటుడు సినీమాలో ఆ పాత్ర వేసి ‘మేజర్’ని ఇంటిపేరు చేసుకున్నాడు. ఓ పేరులేని దర్శకుడు ‘ధాయ్ పిరందాళ్ వళి పిరుక్కుం’ (ఆషాఢమాసం వస్తే దారి అదే దొరు కుతుంది) అనే సినీమా తీసి, అనుకోకుండా బోలెడు డబ్బు సంపాదించి, బాలచందర్ ‘నీర్ కుమిళి’ అనే నాటకాన్ని చూసి, దాన్ని సినీమాగా తీయా లనుకున్నాడు. బాలచందర్నే దర్శకత్వం వహిం చమన్నాడు. నాకు చాతకాదని వచ్చేశాడు బాలచందర్. తోటి నటులు తిట్టి అతనికి నమ్మకం లేని వ్యాసంగం లోకి అతన్ని తోశారు. అలా మొదటి సినీమాకి దర్శకుడయ్యారు. నా ‘కళ్లు’ నాటిక మీద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చిన్న సమీక్ష చదివి దర్శకుడు ఎస్.డి. లాల్ ద్వారా నాకు కబురు పంపారు. నేను కథ చెప్తే పొంగిపోయి నాటిక హక్కులు కొని చిత్ర నిర్మాణానికి ఉపక్రమించారు. పేరు ‘ఊమై విళిగళ్’ (మూగకళ్లు). జయసుధ, జయశంకర్ నటీనటులు. తీరా నాలుగు రీళ్లు తీశాక నిర్మాణం నిలిచి పోయింది. సంవత్సరం తర్వాత ఇద్దరం పామ్‌గ్రోవ్ హోటల్లో కలిశాం. ‘ఆపేశారేం సార్?’ అనడిగాను. ‘నాటికలో మీరు సూచించిన సింబల్ తెర మీద విస్తృతిలో పల్చబడుతోంది. నచ్చక ఆపేశాను’ అన్నారు. ఒక గొప్ప దర్శకుడి కళాత్మకమయిన నిజాయితీకి ఇది నిదర్శనం. మా వాసూ పేరిట స్థాపించిన గొల్లపూడి శ్రీనివాస్ స్మారక సంస్థ ప్రారంభోత్సవ సభలో అక్కినేని, సునీల్ దత్, అపర్ణాసేన్, ఆదూర్ గోపాలకృష్ణన్‌తో పాటు బాలచందర్ ముఖ్య అతిథి. మాట్లాడుతూ, ‘‘విశాఖ సముద్రతీరంలో శ్రీనివాస్ మృతికి నా చేతులకూ రక్తం అంటిందేమో! సముద్రాన్ని ఆకర్షణీయంగా అలంకరిం చిన నేరం నాది’’ అంటూ ‘డ్యూయెట్’ సినీమా షూటింగ్ అక్కడ మొదలెట్టి వాసూ జ్ఞాపకంతో తీయలేక ఒకరోజు విరమించుకున్నారట. కారణాన్ని మీనాక్షీ శేషాద్రికి చెప్పారట. మరో పదేళ్ల తర్వాత హిందీ హీరో ఆమీర్‌ఖాన్ బహుమతినందుకుంటున్న సభకి వచ్చి ఆయన సినీమా ‘తారే జమీన్ పర్’లో కృషిని ప్రశంసిస్తే, ఆమీర్‌ఖాన్ పసివాడిలాగ కంటతడి పెట్టుకున్నాడు. వేదిక మీదే బాలచందర్ చేతిలో ప్రసంగ పాఠాన్ని లాక్కొని ‘‘నేను ముసలివాడినయ్యాక నా మనవలకి ఈ ప్రసంగం చదివి వినిపిస్తాను’’అంటూ, ‘‘మా అమ్మ ఈ సభలో ఉంటే ఎంతో సంతోషించేది’’ అన్నారు. కొందరికి వృత్తి ఉపాధి. కొందరికి ఊపిరి. మరికొం దరికి అంతఃచేతన. ఆఖరిరోజుల్లో అపస్మారకంలో ఉండి పోయారు. స్పృహలేదు. అయినా మధ్యలో ఆయన పెదాలు ‘లైట్స్’,‘కెమెరా’, ‘స్టార్ట్ ’ అన్నాయట. ఓ జీవితకాలం వెండితెరకి నాటకం రుచిని మప్పిన రుషి బాలచందర్. కథనీ, పాత్రలనీ, చిక్కగా కాచి వడపోసి అందులో పాత్రలయిన ప్రతి నటుడినీ ‘చరిత్ర’ ను చేసిన సృష్టికర్త. కమల్‌హాసన్, రజనీకాంత్, సరిత, మమ్ముట్టి, ప్రకాష్‌రాజ్, ఏఆర్ రెహమాన్- ఉదాహరణలు చాలు. బాలచందర్ ఒడుపు కథ. నాటకం పెట్టుబడి. వ్యూహం కథనం. వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయ్యారు. ఒక జీవితకాలంలో పట్టిందంతా బంగారం చేసి, తన సంతకాన్ని ప్రతి సృష్టి లోనూ నిలుపుకున్న దర్శక నిర్మాత- మరొక్కరే గుర్తు కొస్తారు నాకు- ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్. అయితే వారి ధోర ణులు వేరు. భాషలు వేరు. ప్రేక్షకులు వేరు. కాని ఇద్దరూ ఆక్రమించుకున్న ఆకాశం ఒక్కటే. -
ఇదే నా గురువుకు అంజలి
తమిళసినిమా: ‘‘కె.బాలచందర్ నాకు నేర్పిన వృత్తితోనే ఆయనకు అంజలి ఘటిస్తున్నాను.’’అని ప్రముఖ నటుడు కమలహాసన్ పేర్కొన్నారు. ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, కమలహాసన్ గురు శిష్యుల బంధం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి గురువు తనువు చాలిస్తే సినీ ప్రపంచమే కన్నీరుమున్నీరైంది. కానీ గురువు ఆఖరి చూపు కూడా కమలహాసన్‌కు దక్కలేదు. కారణం కమల్ ఆ సమయంలో అమెరికాలో ఉండటమే. బాలచందర్ మరణవార్త విని కమలహాసన్ చెన్నైకి బయల్దేరారు. ఆయన వచ్చిన తరువాత అంత్యక్రియలు అంటూ ప్రచారం జరిగింది. కానీ కమలహాసన్ అంత్యక్రియలకు రాలేకపోయూరు. కారణాన్ని కమల్ వివరిస్తూ ఒక వీడియోను పంపారు. అందులో ఆయన పేర్కొంటూ తమిళ చిత్ర పరిశ్రమలో అపారదాతృత్వ గుణం కలిగినవారు కె.బాలచందర్. 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో వందల మంది కళాకారులను పరిచయం చేశారు. వారిలో నేనూ ఒకరిని. ఆయన నా ఒత్తిడి మేరకు భాగం పంచుకున్న ఉత్తమ విలన్ చిత్రం నా జీవితంలో చాలా ముఖ్యమైంది. ఇది మాత్రమే కాకుండా ఎన్నో విషయాల్లో నేను బాలచందర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఆయన ఆఖరి చూపు కూడా దక్కలేదు. కానీ ఆయన నాకు నేర్పిన వృత్తిలోనే నిమగ్నమై ఉన్నాను. ఇదే నేను నా గురువుకు ఘటించే అంజలిగా భావిస్తున్నాను అని కమలహాసన్ పేర్కొన్నారు. -
3 గంటలకు బాలచందర్ అంత్యక్రియలు
-
మరో చరిత్ర లిఖించి మరలిరాని తీరాలకు..
-
బాలచందర్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి
-
అస్తమించిన బాలచంద్రుడు
-
అస్తమించిన బాలచంద్రుడు
భారత సినీ దర్శక శిఖరం కె.బాలచందర్ అస్తమించారు. కోలీవుడ్‌ను ద్రిగ్భాంతికి గురి చేసి అందనంత దూరాలకు వెళ్లారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చెన్నై నగరంలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని మైలాపూర్ లజ్ కార్నర్‌లోని నివాసంలో ఆప్తులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. తమిళసినిమా:అనారోగ్యం కారణంగా ఈ నెల 15న బాలచందర్ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఆయన కోలుకుంటారని భావించిన సినీలోకం మంగళవారం రాత్రి విషాద సమాచా రం అందుకోవాల్సి వచ్చింది. అందరికీ ఇక సెలవంటూ బాల చంద్రుడు అందనంత దూరాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం భారత సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తే, తమిళ సినీ పరిశ్రమను కన్నీటి సంద్రంలో ముంచింది. తమిళంలోనే కాదు, తెలుగు, హిందీ... పలు భాషల్లో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న శిఖరం బాలచందర్. అసాధారణ కథా చిత్రాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే సినిమాపై ఎనలేని మక్కువను పెంచుకున్న ఆయన 12 ఏళ్ల వయసులో రంగస్థలంపై అడుగుమోపారు. 1930 జూలై 9న తంజావూరు (తిరువారూరు)జిల్లా నన్నిలం గ్రామంలో జన్మించారు. చదువులో పట్టభద్రుడైన బాలచందర్ రంగస్థలం నుంచి సినీ రంగం వైపు అడుగులు వేశారు. 1965లో తొలిసారిగా మెగాఫోన్ పట్టి ‘నీర్ కుమిళి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివంగత హాస్యనటుడు గణేష్ కథా నాయకుడిగా నటించారు. ఆ తరువాత మేజర్ చంద్రకాంత్, ఇరుకొడుగళ్, పూవా తలైవా, భామా విజయం, తామరై నెంజం, నాన్ అవనిల్లై, పున్నగై, సింధుభైరవి, అపూర్వ రాగంగళ్, తన్నీర్ తన్నీర్ ఇలా పలు చిత్రాలను తెరకెక్కించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు. నేటి సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్‌లతో పాటుగా 50 మందికి పైగా నటీ నటుల్ని తెరకు పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. కమలహాసన్, మాధవి తదితర పలువురిని బాలీవుడ్‌కు తీసుకెళ్లింది ఈ దర్శక శిఖరమే. ఆయన మృతి యావత్ భారత సీనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో పడేసింది. ఆయన మరణ సమాచారంతో అభిమానులు కన్నీటి మడుగులో మునిగారు. ఆస్పత్రి వద్దకు అభిమానులు తరలి వచ్చినా, లోపలికి అనుమతించ లేదు. బాలచంద్రుడి భౌతిక కాయాన్ని ఆయన స్వగృహంలో ఆప్తులు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. గురువారం భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
పదికాలాల... బాలచంద్రికలు
కె.బాలచందర్ - భారతీయ సినిమా సగర్వంగా తలెత్తి చూసే దర్శక శిఖరం. మాలాంటి వాళ్లం పుట్టకముందే ఆయన ప్రముఖ రచయిత, దర్శకుడు. అంటే మాకు ఊహ తెలిసి, సినిమాల మీద మోజు పడేటప్పుటికి బాలచందర్ ఆలోచనలు, సినిమాలు అవుట్‌డేటెడ్ అయిపోయి ఉండాలి. కాని... మొన్న మొన్నటి దాకా ఏ జనరేషన్ ఎమోషన్ - ఆ జనరేషన్ టైమ్‌లోనే పట్టుకుని - మధ్య తరగతి కష్టాలు, యువతరం ఆవేశాలు, ప్రేమ సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన అద్భుత చిత్రకారుడు బాలచందర్. తమిళుడైనా - తమిళ, తెలుగు, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా సూపర్‌హిట్ సినిమాలు తీశారు. కాని ఎక్కడా ఏ ప్రాంతం, భాష వాసనా రాదు. మానవత్వం, వాస్తవాల పరిమళాలే వీస్తాయి. కొన్ని ఆహ్లాదంగా ఉంటాయి. మరికొన్ని చాలా ఘాటుగా ఉంటాయి. 50 సంవత్సరాల సినిమా కెరీర్లో 101 సినిమాలు - వాటిలో కొన్ని వందల జీవితాలు - ముందు తరాలకి కూడా చేరువయ్యేలా. వాటిలో నుంచి కొన్ని ఎంపిక చేసుకోవడం కష్టమైనదే. వేటిని కాదనగలం? వేటిని వదిలేయగలం? అయినప్పటికీ మనసుపై చెరగని ముద్రవేసిన ఓ పది సినిమాల గురించి... బొమ్మా - బొరుసా? (1971) ‘సుఖదుఃఖాలు’, ‘సర్వర్ సుందరం’, ‘సంబరాల రాంబాబు’ - ఈ సినిమాలతో బాలచందర్ కథలు తెలుగు ప్రేక్షకులని పలకరించాయి. సుఖదుఃఖాలు (మేజర్ చంద్రకాంత్), సర్వర్ సుందరం - ఆయన రాసిన నాటకాలు. ‘భలే కోడళ్లు’, ‘సత్తెకాలపు సత్తయ్య’ చిత్రాలతో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన స్టార్డమ్ స్టామినాకి తెలుగులో బాక్సాఫీస్ సాక్షిగా శ్రీకారం చుట్టిన సినిమా ‘బొమ్మా-బొరుసా?’. అంతవరకూ బాలచందర్‌గారి స్క్రిప్టుల్లో నాటకీయత, సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఉండేది. పూర్తిగా వినోదంతో కొంత వ్యంగ్యాన్ని జోడించి చెప్పిన కథ ‘బొమ్మా- బొరుసా?’. 1971లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి అత్తా అల్లుళ్ల ఛాలెంజ్‌ల కథలకి ముడిసరుకు. బాలచందర్ సినిమా నేపథ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తారనే దానికి ఈ సినిమా మరో ఉదాహరణ. విజయవాడ, నాగార్జున సాగర్ బాక్డ్రాప్లో కథ నడుస్తుంటుంది. అహంభావి, గర్విష్టి, డబ్బు మీద ఆశ ఉన్న (అత్తగారికీ (ఎస్. వరలక్ష్మి), ముగ్గురు అల్లుళ్లు (జట్కాబండి అల్లుడు - చలం, మిగిలిన వారు రామకృష్ణ, చంద్రమోహన్) ఎలా బుద్ధి చెప్పారనేది లైన్. సాధారణంగా బాలచందర్ సినిమా ప్రారంభంలోనే ప్రధాన పాత్రలని పరిచయం చేసి, కథలో ఇన్వాల్వ్ అయ్యేలా కథనాన్ని పరిగెత్తిస్తారు. ఫస్ట్ షాట్‌లోనే సినిమా ఎలా ఉంటుందనేది చెప్పడం బాలచందర్ స్టయిల్. దానికి మరో అందమైన సాక్ష్యం - ఈ సినిమా ప్రారంభం. బొడ్లో తాళాల గుత్తి దోపుకున్న ఎస్. వరలక్ష్మి మాట్లాడుతుంటే, పక్కనే బీరువా మీద ఉన్న బొమ్మ తలాడిస్తుంటుంది. అత్త మాటలకి అల్లుడు తందానా తానా అనేది చాలా సింబాలిక్‌గా చెప్పారు. ఎ.వి.ఎమ్. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అరంగేట్రం (తమిళం) (1973) తమిళనాట పెను సంచలనం సృష్టించిన సినిమా ‘అరంగ్రేటం’. బాలచందర్ సినిమాల్లో స్త్రీ పాత్రలని చాలా బోల్డ్‌గా చూపించడం ఈ సినిమాతోనే ప్రారంభమైనందని చెప్పాలి. ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యభిచార వృత్తిలోకి దిగడమనేది ఈ సినిమా కథాంశం. ప్రమీల కథానాయిక పాత్ర పోషించారు. అప్పట్లో ఈ సినిమా పలు వివాదాలకి, విమర్శలకి దారి తీసింది. అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్‌హాసన్ నటించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జీవిత రంగం’ పేరుతో పి.డి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. హిందీలో ముంతాజ్, రాజేష్‌ఖన్నాలతో ‘అయినా’ అని బాలచందరే స్వయంగా రీమేక్ చేశారు. అంతులేని కథ (1976) బాలచందర్ కీర్తి తెలుగునాట పతాక స్థాయికి చేర్చిన సినిమా ‘అంతులేని కథ’. ఓ వర్కింగ్ ఉమెన్ జీవితంలోని ఒడిదుడుకులని, ఆశలని, నిరాశలని చాలా హృద్యంగా చిత్రీకరించారు బాలచందర్.‘మేఘ దాకా తారా’ అనే అస్సామీ చిత్రం ప్రభావం దీనిపై ఉందని కొంతమంది విమర్శకులు అంటుంటారు. జయప్రదకి విశేషంగా పేరు తెచ్చి పెట్టిన ఈ సినిమాలో ఎందరో మహిళా ఉద్యోగినులు తమ వేదనని వెదుక్కున్నారు.మొదట సుజాత హీరోయిన్గా 1974లో ‘అవళ్ ఒరు తోడర్ కథై’ పేరుతో ఈ సినిమా తీశారు. హిందీలో రేఖతో తాతినేని రామారావు ‘జీవన్‌ధార’, కన్నడంలో సుహాసినితో బాలచందరే స్వయంగా ‘బెంకెయిల్లి అరిడ హూవు’ (అగ్నిలో పుట్టిన పువ్వు) పేరిట రీమేక్ చేశారు. బెంగాలీలో కూడా ‘కబిత’ పేరుతో వచ్చింది. ఈ సినిమా ముగింపులో, పబ్లిసిటీలో ‘ఇంకా ఉంది’ అని ప్రచారం చేయడం - ప్రేక్షకులు సరికొత్తగా ఫీలయ్యారు. ఈ చిత్రం మీద ఆసక్తి రెట్టింపయ్యింది. అపూర్వ రాగంగళ్ (1975) తండ్రి మీద ఓ యువతి మనసు పడుతుంది. ఆ తండ్రి కొడుకు ఆ యువతి తల్లిపై ప్రేమ పెంచుకుంటాడు. విచిత్రమైన ఈ పొడుపు కథలాంటి కథతో సినిమా తీయాలంటే ఆ డెరైక్టర్‌కి ఎన్ని గట్స్ ఉండాలి? ఆ ధైర్యం బాలచందర్‌కి ఉంది కాబట్టే - ఆయన అజరామరమైన దర్శకుడయ్యారు. 1975లో వచ్చిన ఈ సినిమా చాలా చర్చనీయాంశమైంది. సామాజిక కట్టుబాట్లని సవాల్ చేసింది. శ్రీవిద్య, కమల్‌హాసన్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ పరిచయమయ్యారు. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ కథాంశం కొత్తగా ఉంటుంది. అంతే కాదు - స్వతహాగా రచయిత అయిన దర్శకరత్న దాసరి నారాయణరావు తొలిసారి రీమేక్ చేసింది ఈ సినిమానే (తూర్పు-పడమర). జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో సొంతం చేసుకుంది ఈ ‘అపూర్వ రాగంగళ్’. బాలచందర్ స్వయంగా రాజ్‌కుమార్, కమల్‌హాసన్, హేమమాలిని, పద్మిని కొల్హాపురిలతో ‘ఏక్ నయా పమేలీ’ పేరుతో రీమేక్ చేశారు. ఆకలి రాజ్యం (1981) 80వ దశకంలో యువతరం ముందున్న ప్రధాన సమస్య ఆకలి, నిరుద్యోగం - మరోవైపు కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టడం. అప్పటికే బాలచందర్ ఆడవాళ్ల కన్నీళ్లు (అంతులేని కథ, ఇది కథ కాదు, ఆడవాళ్లు మీకు జోహార్లు) కుర్రాళ్ల కలలు (మన్మథలీల, మరోచరిత్ర, అందమైన అనుభవం) తెరపై చూపించేశారు. రగులుతున్న సమస్యల్ని తనదైన కోణంలో చెప్పాలనుకున్నారు. అందుకు దేశ రాజధాని ఢిల్లీనే నేపథ్యంగా ఎంచుకున్నారు. వ్యవస్థ మీద ఎంత వ్యంగ్యంగా చెప్పాలో అంత వ్యంగ్యంగా చెప్పారు. ఓ సంగీత విద్వాంసుడి కొడుకు పొట్టకూటి కోసం క్షురకవృత్తి చేపట్టడం పరాకాష్ట. మహాకవి శ్రీశ్రీ అభిమానిగా కమల్‌హాసన్ ఆశువుగా చెప్పిన కవితలు, ప్రసిద్ధ గాయకుడు పి.బి. శ్రీనివాస్ రాసిన హిందీ పాట... బురదలో పడ్డ ఆపిల్‌ని కడుక్కుని తినడం - ఒకటా, రెండా.. ఎన్నెన్నో గుర్తుండిపోయే అంశాలు. కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రతాప్ పోతన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. 1981 జనవరి 9న ఈ సినిమా విడుదలయితే, దీనితోపాటు ఎన్టీఆర్-రాఘవేంద్రరావుల ‘గజదొంగ’, జనవరి 14న కృష్ణ-రాఘవేంద్రరావుల ‘ఊరికి మొనగాడు’ విడుదలయ్యాయి. ఆ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ రెండింటినీ తట్టుకుని ఈ సినిమా ఘన విజయం సాధించిందంటే ‘ఆకలిరాజ్యం’ పొటెన్షియాలిటీ అర్థం చేసుకోవచ్చు. ఎరడు రేఖగళ్ (కన్నడ) (1984) తన ప్రియురాలే తనపై అధికారిణిగా వస్తే... ఆమెని వదిలి, మరొకరిని వివాహమాడిన అతని పరిస్థితి ఏమవుతుంది? ‘ఇరుకోడగళ్’ అనే పేరుతో షావుకారు జానకి, జెమినీ గణేశన్, జయంతిలతో 1969లో కె. బాలచందర్ తమిళంలో తీసిన సినిమా ఇది.ఈ కథాంశంతో తెలుగులో ‘కలెక్టర్ జానకి’ సినిమా వచ్చింది.బాలచందర్ తమిళ-తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నా, 1983లో ‘బెంకెయిల్లి అరడ హొవు’ చిత్రంతో కన్నడంతో ఎంటరయ్యారు. ఆ సినిమా సక్సెస్‌తో - 1984లో శ్రీనాథ్, సరిత, గీతలతో ‘ఎరడు రేఖగళ్’ (రెండు రేకులు) రూపొందించారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మాటల్లో చెప్పలేం. హిందీలో అమితాబ్ ‘సంజోగ్’ చిత్రానికి మూలం ఇదే. అంటే బాలచందర్ ఓ కథ రాస్తే, అది ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. భారతదేశమంతటా ఆ కథ భావోద్వేగం కలిగిస్తుందనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. ఏక్ దూజ్ కే లియే (1981) భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమకథా చిత్రం ‘ఏక్ దూజ్ కే లియే’ మన తెలుగు సూపర్‌హిట్ ‘మరో చరిత్ర’ని హిందీలో రీమేక్ చేశారు బాలచందర్. సినీ లెజెండ్ ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్ర నిర్మాత. తెలుగువారు, తమిళుల మధ్య ఎక్కువ అభిప్రాయభేధాలుండవు. కాని హిందీ-తమిళ భాషల మధ్య రాజకీయ నాయకుల పుణ్యమాని చాలా దూరం సృష్టించి ఉంది. అందుకే హిందీలో ఈ చిత్రం మరింత జనరంజకమయ్యింది. ప్రేమకి భాష అడ్డుకాదని వెండితెరపై ఒట్టేసి, చాలా బలంగా చెప్పిన సినిమా ఇది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంగారిని హిందీకి తీసుకెళ్లి, జాతీయ అవార్డుతో ఆయన ప్రతిభ ఏంటో దేశానికి చాటి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాలోని విరహం, విషాదం మబ్బు తునకలా గుండెని తడుపుతూనే ఉంటుంది. తెలుగులో విషాదాంతమైన ముగింపుని హిందీలో సుఖాంతం చేస్తే ఎలా ఉంటుందని చాలా చర్చలు జరిగాయి. రెండు రకాల క్లైమాక్స్‌లు షూట్ చేసి, చివరికి ట్రాజెడీనే ఎంచుకున్నారు. అందుకే ‘దేవదాసు’లా ఇదో అజరామరమైన ప్రేమకథ. ఇప్పటికీ ప్రేమకథల్లో (తొలిప్రేమ) బాలు యే హీరో. తన్నిరు - తన్నిరు (1981) మనిషికి అత్యవసరమైన వాటిల్లో నీరు ముఖ్యం. గాలి, నీరు అనేవి ప్రకృతి ఇచ్చేవి. కాని వాటిని కూడా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిస్తే సామాన్యులు ఎలా నలిగిపోతారనేది ‘తన్నిరు-తన్నిరు’ కథాంశం. ఓ పాపులర్ తమిళ నాటకం ఆధారంగా బాలచందర్ దీనిని తెరకెక్కించారు. 1981లో సరిత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం గ్రామీణ భారతాన్ని కళ్లకి కట్టినట్లు చూపించింది. యధావిధిగానే ఈ సినిమా సంచలనం రేకెత్తించింది. జాతీయ అవార్డులతో పాటు - చాలా ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది. తెలుగులో ‘ఏ ఎండకా గొడుగు’ పేరుతో అనువాదమైంది. భారతీయ వంద ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమాని ఐబిఎన్ ఛానెల్ పేర్కొంది సింధు భైరవి (1985) కళాకారుడికి ఎప్పుడూ ప్రేరణ అవసరం. అది ప్రకృతి నుంచి లభించవచ్చు. లేదా - ఎవరి ప్రేమ నుంచో దొరకొచ్చు. ఆ రెండోది అయితేనే సమస్య వస్తుంది. ఓ కర్ణాటక సంగీత విద్వాంసుడు తన ప్రియురాలిని స్ఫూర్తిగా తీసుకుని రాణిస్తుంటాడు. ఆమె దూరం కావడంతో సంగీతానికి దూరమవుతాడు. తాగుడికి బానిసవుతాడు. ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి ఇద్దరు స్త్రీలు చేసిన ప్రయత్నం ఈ సినిమా. సుహాసిని ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. అలాగే ఇళయరాజా, చిత్రాలు కూడా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో అనువాదమైంది. రుద్రవీణ (1988) ‘ఇది కథ కాదు’ ‘47 రోజులు’ - కె. బాలచందర్ మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన చిత్రాలు. ఆ రెండింట్లో నెగెటివ్ పాత్రలు చేశారు చిరంజీవి. అన్నట్లు ‘ఆడవాళ్లూ - మీకు జోహార్లు’లో అతిథిపాత్రలో తళుక్కున మెరిశారు. చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా మారి అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించినప్పుడు - దర్శకుడిగా వాళ్ల ఫస్ట్ ఛాయిస్ బాలచందర్‌గారే! అన్నాహజారే జీవితం స్ఫూర్తిగా, ‘రుద్రవీణ’ కథని మలిచారు బాలచందర్. మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని చెప్పడంతో పాటు - కళ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఉపయోగపడాలనే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా ఇది. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్‌దత్ అవార్డ్ కైవసం చేసుకుంది ‘రుద్రవీణ’. అంతే కాదు - తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరిలో ‘రుద్రవీణ’ స్ఫూర్తితో యువకులందరూ కలిసి ఊళ్లోవాళ్ల తాగుడు మాన్పించి, ఆ డబ్బుతో లైబ్రరీ, స్కూల్ ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ప్రభావితం చేశారనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? -
బాలచందర్ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్: ప్రఖ్యాత సినీ దర్శకుడు కె. బాలచందర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మశ్రీ అవార్డులతో పాటు తొమ్మిది జాతీయ ఫిల్మ్ అవార్డులు సాధించి దేశంలోనే అత్యన్నత స్థాయి దర్శకులలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన ఆయన మరణం భారతీయ చలన చిత్రరంగానికి తీరని లోటు అని జగన్ ఓ ప్రకటనలో తెలిపారు. అనేక ఆణిముత్యాల వంటి చిత్రాలను అందించిన ఆయన చలన చిత్ర రంగంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికారని కొనియాడారు. బాలచందర్ కుటుంబ సభ్యలకు ఆయన తన ప్రగాడ సంతాపం, సానుభూతిని తెలియజేశారు. -
దర్శక దిగ్గజం కె.బాలచందర్ ఇకలేరు
-
కమల్, రజని మళ్లీ కలిసి నటిస్తారా?
శిష్యులెంత ఘనులైనా గురువు ముందు విద్యార్థులే. ప్రఖ్యాత నటులు కమలహాసన్, రజనీకాంత్ తమ గురువు, ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్‌ను అంతగా గౌరవిస్తారు. ఆయనకు వీళ్లంటే వల్లమాలిన ప్రేమ. ఆరంభదశలో కమల్, రజనీలతో కె.బాలచందర్ పలు చిత్రాలను తెరకెక్కించారు. ఇళమై ఊంజలాడు గిరదు, నినైత్తాలే ఇనిక్కుం, మూండ్రు ముడిచ్చు లాంటి పలు చిత్రాల్లో కమలహాసన్, రజనీకాంత్ కలసి నటించారు. ఆ తరువాత వారికి ప్రత్యేక ఇమేజ్ రావడంతో విడివిడిగా నటించడం మొదలెట్టారు. ప్రస్తుతం కమల్, రజనీ తమిళ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు లాంటివారుగా ఎదిగారు. అలాంటి శిష్యులతో కలిసి మళ్లీ చిత్రం చేయాలన్నది గురువు కె.బాలచందర్ కోరిక. ప్రస్తుతం ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నారట. ఈ విషయాన్ని సీనియర్ నటి జయప్రద వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ తాను ఇటీవల తన గురువు కె.బాలచందర్‌ను కలిశానన్నారు. అప్పుడాయన మళ్లీ రజనీకాంత్, కమలహాసన్‌లతో ఒక చిత్రం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను నటించాలని బాలచందర్ అడిగినట్లు చెప్పారు. తన జీవితంలో మరచిపోలేని చిత్రం కె.బాలచందర్ దర్శకత్వంలో నటించిన నినైతాలే ఇనిక్కుం అని జయప్రద పేర్కొన్నారు. అంతాబాగానే ఉంది. రెండు ధృవనక్షత్రాలు లాంటి కమల్, రజని మళ్లీ కలిసి నటిస్తారా? తమ గురువు ప్రయత్నం ఫలించేనా? అలాంటి అందమైన అనుభవం ప్రేక్షకులకు మళ్లీ కలిగే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిందే! -
మా ఇద్దర్నీ కలిపింది తనే!
ఓ దర్శక దిగ్గజం మరో దర్శక ప్రముఖుని గురించి మాట్లాడితే... వినేకొద్దీ వినాలనిపిస్తుంది. ఒకరు కె. విశ్వనాథ్ అయితే, మరొకరు కె. బాలచందర్. ఇద్దరి ఇంటి పేర్లు కేతో ఆరంభమైనట్లుగానే, సినిమాల విషయంలోనూ ఇద్దరి అభిరుచులూ దాదాపు ఒకటే. కళాత్మక చిత్రాల నుంచి విభిన్న వాణిజ్య చిత్రాల వరకూ ఇద్దరూ సృష్టించిన సంచలనాలు ఎన్నెన్నో. ఈ ఇద్దరు దర్శకులూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే ‘ఉత్తమ విలన్’. కమల్‌హాసన్ హీరోగా నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కమల్‌తో ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’లాంటి ఆణిముత్యాలను విశ్వనాథ్ రూపొందిస్తే, బాలచందర్ ‘అవళ్ ఒరు తొడర్ కథై’, ‘అపూర్వ రాగంగళ్’ వంటి అద్భుత చిత్రాలను రూపొందించారు. ఈ ఇద్దర్నీ తన గురువులుగా భావిస్తారు కమల్. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఉత్తమ విలన్’లో ఉన్న రెండు కీలక పాత్రలను ఈ ఇద్దరూ చేస్తే బాగుంటుందని కమల్ భావించారు. స్వయంగా ఈ ఇద్దర్నీ సంప్రదించి, ఒప్పించారట. ఈ విషయాన్ని కె. విశ్వనాథ్ స్వయంగా చెప్పారు. ‘‘బాలచందర్, నేను బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఎక్కువసేపు కలిసి మాట్లాడుకోవాలనుకునేవాళ్లం. కానీ, కుదిరేది కాదు. ఒకరికొకరం సినిమా మేకింగ్ గురించి తెలిసిన విషయాలు పంచుకోవాలనుకునేవాళ్లం. కానీ, తీరిక లేక అది జరగ లేదు. ఇప్పుడు బాలచందర్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేటి తరం నటీనటులతో సినిమా చేయడంకూడా మంచి అనుభూతినిస్తోంది’’ అని విశ్వనాథ్ చెప్పారు.