
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని పంజగుట్ట సర్కిల్‌లో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ శాసనసభాపక్షం నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, మల్లురవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌లు సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని కలసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ పంజగుట్టలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెట్టిన విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో పెడితే తమ నాయకుడు వీహెచ్ కొట్లాడి హైకోర్టు ద్వారా బయటకు తెచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో విగ్రహాన్ని గతంలో తొలగించిన పంజాగుట్ట సర్కిల్‌లోనే ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను కోరామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment