KCR Speech At India's Tallest Ambedkar Statue Inauguration Event - Sakshi
Sakshi News home page

ఎవడో డిమాండ్‌ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదు.. రాబోయే రోజుల్లో రాజ్యం మనదే

Published Fri, Apr 14 2023 5:19 PM | Last Updated on Fri, Apr 14 2023 5:34 PM

KCR Speech At India Largest Ambedkar Statue Inauguration Event - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎవడో డిమాండ్‌ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదని, అంబేద్కర్‌ విశ్వ మానవుడని.. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ భారీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభాస్థలి నుంచి ఆయన ప్రసంగించారు. 

ఎవడో డిమాండ్‌ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఈ విగ్రహ ఏర్పాటులో ఒక బలమైన సందేశం ఉంది. అంబేద్కర్‌ విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వనీయమైనది. అణగారిన వర్గాల ఆశాదీపం అంబేద్కర్‌. అంబేద్కర్‌ చెప్పింది ఆచరించేది ఉందా? లేదా? అని ఈ సందర్భంగా ఆయన అక్కడున్నవాళ్లను ప్రశ్నించారు..

అందరూ అంబేద్కర్‌ చెప్పిన మాటలు ఆచరించాలి.  ఆయన ఆశయాల సాధన దిశగా ముందుకెళ్లాలి.  ఇది కేవలం విగ్రహం కాదు.. ఒక విప్లవం. అంబేద్కర్‌ను చూడగానే అందరి మనసూ ప్రభావితం కావాలి. ఆయన సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. విగ్రహ ఏర్పాటునకు కృషి చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  

సెక్రటేరియెట్‌కు అంబేద్కర్‌ పేరు పెట్టుకున్నాం. అలాగే అంబేద్కర్‌పేరిట శాశ్వత అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం. ఏటా అంబేద్కర్‌ జయంతి రోజు అవార్డుల ప్రదానం చేస్తాం. ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందిస్తాం. ఇందుకోసం దాదాపు రూ. 50 కోట్లతో అంబేద్కర్‌ అవార్డు నిధి ఏర్పాటు చేస్తాం అని సీఎం కేసీఆర్‌ సభాస్థలి నుంచి ప్రకటించారు. 

పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి. దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. దళితుల ఆర్థికాభావిృద్ధికి దళిత బంధు పథకం తీసుకొచ్చాం. కేసీఆర్‌ జాతీయ నేతగా ఎదగాలని ప్రకాష్‌ అంబేద్కర్‌ అన్నారు.  దేశంలో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాబోయే రాజ్యం మనదే. మహారాష్ట్రలో ఊహించని ఆదరణ వస్తుంది. యూపీ, బీహార్‌, బెంగాల్‌లో కూడా ఆదరణ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేస్తాం అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement