అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడు | Lord Hanuman 90 Foot Tall Statue in US Texas, Became 3rd Tallest Statue In US, Video Goes Viral | Sakshi
Sakshi News home page

అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడు

Published Tue, Aug 20 2024 1:04 PM | Last Updated on Tue, Aug 20 2024 1:28 PM

Lord Hanuman 90 Foot Tall Statue in US Texas

అమెరికాలోని టెక్సాస్‌లోగల హనుమంతుని భక్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక్కడి హ్యూస్టన్‌లో తాజాగా 90 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ భారీ విగ్రహం అమెరికాలోని మూడవ ఎత్తయిన విగ్రహంగా పేరు తెచ్చుకుంది. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ ప్రాంతంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వెనుక చినజీయర్ స్వామి సూచనలు, సలహాలు ఉన్నాయి.

‘స్టాట్యూ ఆఫ్ యూనియన్‌’ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఈ విగ్రహం యునైటెడ్ స్టేట్స్‌లోని మూడవ అతి ఎత్తయిన విగ్రహం. అలాగే హనుమంతునికి సంబంధించిన 10 ఎత్తయిన విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ నుంచి స్వామివారి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement