వారణాసి: పీఎం కిసాన్ సమ్మాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి సంతకం పీఎం కిసాన్ నిధులపై చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. వారణాసి కేంద్రంగా ఈ హామీని అమలు చేశారు.
ఏడాదికి మూడు దశల్లో రూ.6 వేల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈసారి 17వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతులకు రూ.2వేల చొప్పున మొత్తం రూ.20 వేల కోట్ల సాయం ఈ పథకం ద్వారా అందనుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment