మొదటి మూడేళ్లు పెట్టుబడి ప్రభుత్వానిదే.. అంతర పంటలు వేస్తే బోనస్
మహబూబ్‌నగర్ రైతు సదస్సులో వ్యవసాయ మంత్రి తుమ్మల
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రైతులంతా ఆయిల్‌పాం సాగుపై దృష్టి పెట్టాలి. మొదటి మూడే ళ్లు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది. అంతర పంటలు వేస్తే బోనస్ ఇచ్చే బాధ్యత కూడా మాదే. మీ పంటను ఇంటి వద్దే కొనిపించే బాధ్యత తీసు కుంటాం. వెంటనే మీ ఖాతాలో డబ్బులు వేస్తాం. పామాయిల్ పంట వేయండి.. మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖపరంగా మీరు ఏ శిక్ష విధించినా దానికి సిద్ధంగా ఉంటాం. రైతులకు నష్టం రాకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో మూడు రోజుల రైతు పండుగ సదస్సును పద్మశ్రీ అవార్డుగ్రహీత, రైతు వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఆహార పదార్థాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించేలా మైదానంలో ఏర్పాటు చేసిన 117 స్టాళ్లు, ఎగ్జిబిట్‌లను తిలకించిన అనంతరం సదస్సులో మంత్రి తుమ్మల మాట్లాడారు. రాష్ట్రానికి అప్పులు, కష్టాలు ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నట్లు తెలిపారు.
అనుకున్నవన్నీ నాలుగేళ్లలో చేస్తాం..
రైతులు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, వచ్చే నాలుగేళ్లలో అనుకున్న వ న్నీ చేసి అన్నదాతల చేత శెభాష్ అనిపించుకుంటా మని మంత్రి తుమ్మల చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు పదేళ్లు వ్యవసాయాన్ని ఎలా ఆగం చేశారో, ఈ పది నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో ఈ నెల 30న జరి గే సభలో సీఎం రేవంత్‌రెడ్డి చెబుతారని తుమ్మల తెలిపారు. రైతులను సమీకరించి సంక్రాంతికి ముందే రైతు పండుగను నిర్వహించుకుంటామన్నారు.
సాగు దండగ కాదు.. పండగని వైఎస్ నిరూపించారు: దామోదర
ఉమ్మడి ఏపీలో 2003–04లో వ్యవసాయం దండగ అని ప్రచారం జరిగితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టు లను చేపట్టి కొంత వరకు పూర్తి చేశారని.. వ్యవసాయం దండగ కాదు.. పండగని నిరూ పించారని మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొ న్నారు.
ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వ్యవసా య రంగాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రస్తుత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకొన వాటిని సాకారం చేసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయన్నా రు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెలేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment