రబీలో ఆరుతడి పంటలనే సాగుచేసేలా రైతులను సన్నద్ధం చేయాలని వ్యవసాయశాఖ కమిషనర్ బి. జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
రైతులను ప్రోత్సహించాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రబీలో ఆరుతడి పంటలనే సాగుచేసేలా రైతులను సన్నద్ధం చేయాలని వ్యవసాయశాఖ కమిషనర్ బి. జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ కమిషనరేట్ నుంచి శనివారం ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీవ్రమైన కరెంట్ సమస్య, భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో రబీలో రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలు సాగుచేసేలా చర్యలు తీసుకోవాలన్నా రు. ఇందుకోసం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వ్యవసాయ కమిషనరేట్‌కు నూతనంగా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించారు. శనివారం ఈ సదుపాయంతోనే కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.